బ్యాట్స్‌మెన్‌ విఫలం.. హైదరాబాద్‌ 135 ఆలౌట్‌ | Cooch Behar Trophy Under 19: Hyderabad 135 all out | Sakshi
Sakshi News home page

బ్యాట్స్‌మెన్‌ విఫలం.. హైదరాబాద్‌ 135 ఆలౌట్‌

Published Sun, Dec 10 2017 10:55 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

Cooch Behar Trophy Under 19: Hyderabad 135 all out - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూచ్‌ బెహర్‌ ట్రోఫీ అండర్‌–19 క్రికెట్‌ టోర్నీలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. దీంతో ఓవర్‌నైట్‌ స్కోరు 40/4తో మ్యాచ్‌ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ 52.2 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. ఎ. వరుణ్‌ గౌడ్‌ (34; 4 ఫోర్లు) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లలో ఏఎస్‌ జంవాల్‌ 6 వికెట్లతో హైదరాబాద్‌ను దెబ్బతీశాడు.

ఏఏ వాలియా 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హిమాచల్‌ ప్రదేశ్‌ శనివారం ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులతో నిలిచింది. హైదరాబాద్‌ బౌలర్లలో రతన్‌ తేజ, జి. అనికేత్‌ రెడ్డి చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement