అమన్‌ రావు అజేయ శతకం.. డ్రాతో గట్టెక్కిన హైదరాబాద్‌  | Cooch Behar Under 19 Tourney: Aman Rao Unbeaten Century Helps To Draw Match Vs Saurashtra | Sakshi
Sakshi News home page

అమన్‌ రావు అజేయ శతకం.. డ్రాతో గట్టెక్కిన హైదరాబాద్‌ 

Published Wed, Nov 16 2022 8:25 AM | Last Updated on Wed, Nov 16 2022 8:25 AM

Cooch Behar Under 19 Tourney: Aman Rao Unbeaten Century Helps To Draw Match Vs Saurashtra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ అండర్‌–19 టోర్నీ (కూచ్‌ బెహర్‌ ట్రోఫీ)లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్, సౌరాష్ట్ర మధ్య జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 422 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ చివరి రోజు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. అమన్‌ రావు (217 బంతుల్లో 156 నాటౌట్‌; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 290, హైదరాబాద్‌ 226 పరుగులు చేయగా... సౌరాష్ట్ర తమ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 357 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఆరు జట్లున్న గ్రూప్‌ ‘బి’లో ఉన్న హైదరాబాద్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement