దుమ్ము రేపిన రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు.. వీడియో వైరల్‌ | Dravid Jr. scores classy 98 in Cooch Behar Trophy - Sakshi
Sakshi News home page

#Samit Dravid: దుమ్ము రేపిన రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు.. వీడియో వైరల్‌

Published Thu, Dec 21 2023 9:00 AM | Last Updated on Thu, Dec 21 2023 9:18 AM

Dravid Jr scores classy 98 in Cooch Behar Trophy - Sakshi

కూచ్ బెహార్ అండర్‌-19 ట్రోఫీలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయడు సమిత్ ద్రవిడ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో సమిత్‌ కర్ణాటక తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్‌ అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 159 బంతులు ఎదుర్కొన్న జూనియర్‌ ద్రవిడ్‌.. 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 98 పరుగులు చేశాడు. సమిత్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన కవర్‌ డ్రైవ్‌లు ఉన్నాయి.

కొన్ని కవర్‌ డ్రైవ్‌ షాట్‌లు అతడి తండ్రిని తలపించాయి. సమిత్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. కాగా ఇదే మ్యాచ్‌లో సమిత్‌ ద్రవిడ్‌ బౌలింగ్‌లో కూడా రాణించాడు.

మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సమిత్‌..280 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  జమ్మూపై ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్‌పై వేటు! ఆర్సీబీ ప్లేయర్‌ అరంగేట్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement