ముంబై: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ మరో క్రికెట్ టోర్నీ వాయిదా పడింది. ఇప్పటికే రంజీ ట్రోఫీ, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలు పోస్ట్‌పోన్ కాగా, తాజాగా అండర్-19 కూచ్ బెహర్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
NEWS : Cooch Behar Trophy knockout matches postponed.
— BCCI (@BCCI) January 10, 2022
The BCCI on Monday announced the postponement of the knockout stage matches of the Cooch Behar Trophy following some positive COVID-19 cases within the team environment.
More details here - https://t.co/mP3TvYDKbr pic.twitter.com/8rManovoXE
ప్రస్తుతం టోర్నీ జరుగుతున్న పుణేలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు కొందరు ఆటగాళ్లు(ముంబై, సౌరాష్ట్ర) సైతం మహమ్మారి బారిన పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాగా, ఈ టోర్నీలో ముంబై, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, రాజస్థాన్, విదర్భ, బెంగాల్, హర్యానా , మహారాష్ట్ర జట్లు ఇప్పటికే క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
చదవండి: ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియాను నంబర్ వన్‌గా నిలబెట్టాను.. విరాట్ కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment