IND VS ENG 2022: BCCI Warns Rohit Sharma And Kohli Over Covid Protocals, Says Reports - Sakshi
Sakshi News home page

IND Vs ENG 2022: రోహిత్‌, కోహ్లిలకు బీసీసీఐ వార్నింగ్..‌!

Published Tue, Jun 21 2022 5:44 PM | Last Updated on Tue, Jun 21 2022 5:57 PM

IND VS ENG 2022: BCCI To Issue Warning To Rohit Sharma And Virat Kohli Says Reports - Sakshi

త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు ఫార్మాట్ల సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌, మాజీ కెప్టెన్లకు బీసీసీఐ స్ట్రిక్ట్‌ వార్నిం‍గ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్న వీరి ఫోటోలే ఇందుకు కారణం అని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఓ టెస్ట్‌, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట లండన్‌లో ల్యాండైన టీమిండియా ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది. అయితే రెండు రోజుల కిందట రోహిత్‌, కోహ్లిలు షాపింగ్‌ అంటూ లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులివ్వడం నెట్టింట వైరలైంది. 

యూకేలో కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్‌, కోహ్లిలు మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుందని సమాచారం. ఇదే విషయమై బీసీసీఐ రోహిత్‌, కోహ్లిలతో పాటు టీమిండియా మొత్తాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీమిండియా ఆటగాళ్లందరూ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనకాడేది లేదని వార్నింగ్‌ ఇచ్చిందని సమాచారం. 

కాగా, యూకేలో కోవిడ్‌ తీవ్రత గత కొద్ది రోజులతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆక్కడ ఇప్పటికీ రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే టీమిండియా కీ స్పిన్నర్‌ అశ్విన్‌ కోవిడ్‌ కారణంగా జట్టుతో పాటు ట్రావెల్‌ చేయలేకపోయాడు. ఇదిలా ఉంటే, గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో మిగిలిపోయిన టెస్ట్‌ మ్యాచ్‌ జులై 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో గతేడాది జరిగిన నాలుగు టెస్టుల్లో టీమిండియా  2-1తో ఆధిక్యంలో ఉంది. 

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ 

ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌ ఇలా ఉంది..

జూన్‌ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌
జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌
జులై 7న తొలి టీ20
జులై 9న రెండో టీ20
జులై 10న మూడో టీ20
జులై 12న తొలి వన్డే
జులై 14న రెండో వన్డే
జులై 17న మూడో వన్డే
చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్‌.. పలు అరుదైన రికార్డులపై కన్నేసిన రోహిత్‌-విరాట్‌ జోడీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement