గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిపోయిన టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇదివరకే లండన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల చేత అప్పుడు జట్టుతో పాటు వెళ్లని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా లండన్‌లో ల్యాండయ్యాడు. జులై 1 నుంచి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. రోహిత్, కోహ్లిలు మాత్రం షాపింగ్ చేస్తూ లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు.
A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022
ఈ క్రమంలో అభిమానులు వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. రోహిత్, కోహ్లిలు లండన్ వీధుల్లో ఫ్యాన్స్‌తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు లీసెస్టర్‌షైర్‌లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలు కూడా నెట్టింట సర్ఫేస్ అవుతున్నాయి. కోహ్లితో షాపింగ్ అనంతరం రోహిత్ జట్టుతో పాటు చేరాడు.
Hello from Leicester and our training base for a week will be @leicsccc 🙌 #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc
— BCCI (@BCCI) June 20, 2022
ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 19) దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగియడంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లు బెంగళూరు నుంచే నేరుగా లండన్‌కు బయల్దేరారు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌కు ముందు టీమిండియా ఈ నెల 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం బర్మింగ్‌హామ్ వేదికగా జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. కాగా, ఇంగ్లండ్‌తో గతేడాది జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు టెస్టులు పూర్తి కాగా.. టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా ఉంది..
జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్
జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్
జులై 7న తొలి టీ20
జులై 9న రెండో టీ20
జులై 10న మూడో టీ20
జులై 12న తొలి వన్డే
జులై 14న రెండో వన్డే
జులై 17న మూడో వన్డే
చదవండి: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20 ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment