నవంబర్‌లో అంతర్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ | November Inter-district Cricket tournament | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో అంతర్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ

Published Sun, Sep 25 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

November Inter-district Cricket tournament

వరంగల్‌ స్పోర్ట్స్‌ : జిల్లాకు చెందిన సీనియర్‌ క్రీడాకారుడు ఫారూఖ్‌ స్మారకార్థం  నవంబర్‌లో అంతర్‌ జిల్లా సీనియర్స్‌ క్రికెట్‌ టోర్నమెంటును నిర్వహించనున్నట్లు  క్రికెట్‌ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీని వాస్‌ తెలిపారు. హన్మకొండ అలంకార్‌ సమీపంలోని అసోసియేష¯ŒS జిల్లా కార్యాలయంలో ఆదివారం అసోసియేష¯ŒS సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ప్రతిభ ఉండి పేదరికంతో ఆడలేని క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, జిల్లా, నగరస్థాయిలో జూనియర్స్, సీనియర్స్‌ విభాగాల్లో ప్రతి నెలా టోర్నమెంటులు నిర్వహించాలని తీర్మానించారు.
 
అంతేకాకుండా అసోసియేష¯ŒS న్యాయ సలహాదారులుగా సీహెచ్‌. చిదంబర్‌నాధ్, పి.సత్యప్రకాష్‌లను నియమించినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. ప్రతి నెల కార్యవర్గ సమావేశంలో ఖర్చులను ప్రవేశపెట్టాలని తీర్మానించారు. సమావేశంలో అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గుజ్జారి ప్రతాప్, మార్నేని ఉదయభానురావు, మంచాల స్వామిచరణ్, ఖాజా జమీర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement