Inter-district
-
ముగిసిన ఎస్జీఎఫ్ ఫుట్‌బాల్ పోటీలు
కడప: స్థానిక జెడ్పీ హైస్కూల్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 67వ ఎస్జీఎఫ్ అంతర్‌జిల్లాల ఫుట్‌బాల్(అండర్–19) పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో మొదటి స్థానంలో కడప, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో 2–1 స్కోర్‌తో అనంతపురంపై కడప జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో అనంతపురం, ద్వితీయస్థానంలో గుంటూరు, మూడోస్థానంలో కడప, నాలుగోస్థానంలో చిత్తూరు నిలిచాయి. ఫైనల్స్‌లో 4–3 స్కోర్‌తో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు మదనపల్లె ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ, ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య చేతుల మీదుగా కప్‌లు, మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వరదారెడి గారి నారదరెడ్డి ఫుట్‌బాల్ పోటీల నిర్వహణకు రూ.10,116, విజేతలుగా నిలిచిన కడప(బాలికలు), అనంతపురం(బాలురు) జట్టులకు ఒక్కొక్క జట్టుకు రూ.10,116 చొప్పున మొత్తం రూ.30,348 ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత మదనపల్లెలో తొలిసారిగా 67వ ఎస్జీఎఫ్ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య మాట్లాడుతూ 67వ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకరరెడ్డి, రాజగోపాల్, ఏసీటీఓ నాగేంద్ర, హెచ్ఎం సుబ్బారెడ్డి, మహమ్మద్‌ఖాన్, పీఈటీలు అన్సర్, సుధాకర్, రమేష్, నాగరాజు, కరుణానిధి, 13 జిల్లాల జట్ల మేనేజర్లు, కోచ్‌లు పాల్గొన్నారు. అండర్–19 జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉదయ్‌భాస్కర్, శ్రీనివాసులు, రమేష్ వ్యవహరించారు. జాతీయస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 4 వరకు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో, బాలికలు నవంబర్‌లో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. బాలికలజట్టు: ఎస్.భానుశ్రీ, కె.మనీషా, ఆర్.భువన, ఎం.సావిత్రి(కడప), పి.కావ్యశ్రీ, యు.హారిక, కె.మమత(అనంతపురం), ఎం.పవిత్రపావని, ఎం.జ్యోతి, పి.టి.వి.హరిప్రియ(గుంటూరు), పి.సులోచన, జి.హేమహాసిని(వైజాగ్), పి.సుహర్ష, ఏ.బెహ్హప్మన్ జున్నా(కృష్ణా), కె.పావని(చిత్తూరు), జి.కావేరి(ప్రకాశం), ఎం.శిరీషా(నెల్లూరు), వి.సత్యసౌమ్య(ఈస్ట్‌గోదావరి) రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా కె.జొన్నాప్రహర్షిత(కృష్ణ), ఎం.వెంకటసుప్రజ (కడప), ఎల్.గాయత్రి(విజయనగరం), వి.ప్రజ్ఞారమణ(కర్నూలు), జీవిత(నెల్లూరు). బాలుర జట్టు: ఆసిఫ్, ఎ.నందకిశోర్, భరత్, జి.నరేంద్ర(అనంతపురం), జి.కౌశిక్, ఎస్.డి.రవూఫ్, ఎస్.కె.నాగషరీఫ్(గుంటూరు), సీతుమాధవ్, పి.విఘ్నేష్(కడప), సుఫియాన్, సి.అరవింద్(చిత్తూరు), జె.మైఖేల్(ప్రకాశం), అభి(కర్నూలు), వైడియస్ అశ్వథ్(వైజాగ్), జే.రాముడు(కృష్ణ), కెల్విన్కెన్నెట్(చిత్తూరు), వై.కల్యాణ్(విజయవాడ), కె.అశోక్‌కుమార్(నెల్లూరు) స్టాండ్‌బైలుగా అఖిల్‌యాదవ్(చిత్తూరు), వి.విజయ్(గుంటూరు), డి.వీరబాబు(ఈస్ట్‌గోదావరి), టి.రోహిత్.శ్రీ.ఫణిధర్(వెస్ట్‌గోదావరి), జ్ఞానేశ్వర్(శ్రీకాకుళం). -
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
అద్దంకి రూరల్: వివిధ జిల్లాల్లో 18 నుంచి 20 దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం జంక్షన్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. సంతమాగులూరు మండలం వెల్లలచెరువుకు చెందిన జంగాల శాంతిస్వరూప్ బాపట్లలో 2008లో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసి పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు గ్రామంలో రిసెర్చ్ అప్రంటీస్ చేశాడు. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మార్టేరు గ్రామానికి చెందిన రెల్లు శివతో పరిచయం ఏర్పడి ఇద్దరు కలిసి దొంగతనాలు చేశారు. ఇద్దరినీ అక్కడి పోలీసులు పట్టుకుని రాజమండి జైలుకు పంపారు. శాంతిస్వరూప్ బెయిల్‌పై బయటకొచ్చి అప్పటి నుంచి దొంగతనాలు ఒంటరిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అద్దంకి, చినకొత్తపల్లి, కురిచేడు, దర్శి, శావల్యాపురం, వినుకొండ, ఒంగోలు, మద్దిపాడు, మార్టేరు, పెరవలి, తణుకు, జన్నూరు తదితర ప్రాంతాల్లో 20 దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన డబ్బు, సొత్తుతో విలాసాలు, చెడు అలవాట్లకు ఖర్చు చేశాడు. బంగారం, వెండిని తణుకులోని బంగారు వ్యాపారులు కొఠారి జయంతిలాల్, కొఠారి సంజీవ్‌కుమార్, మార్టేరు గ్రామానికి చెందిన మద్దుల రామకృష్ణారావులకు అమ్మి జల్సాలకు వాడుకున్నాడు. సుమారు 90 నుంచి 100 సవర్ల బంగారం చోరీ చేసి ఉంటాడు. శాంతిస్వరూప్‌ను సంతమాగులూరు ఎస్ఐ నాగరాజు పుట్టావారిపాలెం జంక్షన్ వద్ద బుధవారం అరెస్టు చేశారు. అద్దంకి ఎస్ఐ సుబ్బరాజు బంగారాన్ని కోనుగోలు చేసిన వర్తకులను గురువారం అరెస్టు చేసి తీసుకొచ్చారు. శాంతిస్వరూప్, వర్తకులను కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఇంకా దర్యాప్తు పూర్తి కానందున కోర్డుకు మెమో సమర్పించి వారం రోజుల పాటు నిందితులను పోలీస్ కస్టడీకి అనుతించాలని కోరతామని డీఎస్పీ తెలిపారు. -
నవంబర్‌లో అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీ
వరంగల్ స్పోర్ట్స్ : జిల్లాకు చెందిన సీనియర్ క్రీడాకారుడు ఫారూఖ్ స్మారకార్థం నవంబర్‌లో అంతర్ జిల్లా సీనియర్స్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీని వాస్ తెలిపారు. హన్మకొండ అలంకార్ సమీపంలోని అసోసియేష¯ŒS జిల్లా కార్యాలయంలో ఆదివారం అసోసియేష¯ŒS సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ప్రతిభ ఉండి పేదరికంతో ఆడలేని క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, జిల్లా, నగరస్థాయిలో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ప్రతి నెలా టోర్నమెంటులు నిర్వహించాలని తీర్మానించారు. అంతేకాకుండా అసోసియేష¯ŒS న్యాయ సలహాదారులుగా సీహెచ్. చిదంబర్నాధ్, పి.సత్యప్రకాష్లను నియమించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రతి నెల కార్యవర్గ సమావేశంలో ఖర్చులను ప్రవేశపెట్టాలని తీర్మానించారు. సమావేశంలో అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షుడు గుజ్జారి ప్రతాప్, మార్నేని ఉదయభానురావు, మంచాల స్వామిచరణ్, ఖాజా జమీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
ముగిసిన అంతర్ జిల్లాల హ్యాండ్‌బాల్ పోటీలు
l విజేతగా ఖమ్మం జట్టు l నాలుగో స్థానంలో నిలిచిన వరంగల్ వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జ వహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ని ర్వహించిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన పోటీ ల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్ స్థానాన్ని నిజామాబాద్ జట్టు దక్కించుకోగా, మూడో స్థానంలో హైదరాబాద్, నాలుగో స్థా నంలో వరంగల్ జట్లు నిలిచాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు స్థానిక కార్పొరేటర్ సోబియా సబహత్ ముఖ్యఅతిథిగా హాజరైవిజేతలకు ట్రోఫీలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోట ములు సహజమన్నారు. ఓటమితో కుంగి పోకుండా.. మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఇందిర, హన్మకొండ సీఐ అవిర్నేని సంపత్‌రావు, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కైలాస్‌యాదవ్, ఇంద్రసేనారెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్‌జిల్లాల దొంగ అరెస్ట్
కశింకోట: విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది చోరీ కేసులతో సంబంధం ఉన్న అంతర్ జిల్లాల దొంగను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.80 లక్షల విలువైన ఐదున్నర తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్టు అనకాపల్లి క్రై ం బ్రాంచ్ డీఎస్పీ పీవీ కష్ణవర్మ తెలిపారు. కశింకోట పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన చేబ్రోలు విజయకుమార్ మోటారు సైకిల్‌పై పరారవుతుండగా అనకాపల్లి పట్టణంలోని సుంకరమెట్ట వద్ద పట్టుకున్నట్టు చెప్పారు. సబ్బవరంలో దొంగిలించిన మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని, విచారణ జరపగా ఇంకా ఏడు కేసులతో సంబంధం ఉందని తేలిందన్నారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగల్లో నల్లపూసల తాడు కశింకోటలోని అగ్రహారానికి చెందిన దుంతకుర్తి మాధురిలక్ష్మి అనే మహిళకు చెందిందన్నారు. ఆమె నగలను గత ఏడాది అక్టోబర్ 13న దొంగిలించారని, అప్పట్లో సబ్బవరంలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఆ కేసులో విజయకుమార్ నాల్గో నిందితుడని, అతని నుంచి ఇప్పుడు బంగారు నల్ల పూసల తాడు స్వాధీనం చేసుకున్నామన్నారు. మునగపాక మండలం నాగులాపల్లి వద్ద గంగి గాయత్రి అనే మహిళకు చెందిన బంగారు పుస్తెల తాడు దొంగిలించారని, విజయనగరం జిల్లా సాలూరులో చెవి దుద్దులు, రామభద్రపురంలో పుస్తెల తాడు, చీపురపల్లిలో చెవి దుద్దులు, ఉంగరం దొంగిలించగా వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఎంవీపీ కాలనీ, సాలూరు పట్టణంలో చోరీ చేసిన సొత్తును బ్యాంకులో కుదువ పెట్టారని తెలిపారు. దాన్ని స్వాధీనం చేసుకోవలసి ఉందన్నారు. విజయకుమార్.. బన్నీ గ్యాంగ్‌తో కలిసి విశాఖపట్నంలోనే గతంలో 30 వరకు దొంగతనాలు చేశాడని, ఇందులో పెందుర్తిలో 20 వరకు ఉన్నాయన్నారు. నిందితుడ్ని కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనకాపల్లి రూరల్ సీఐ కె.ఎన్.ఎస్.వి.ప్రసాద్, పోలీసు సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
చిలకలూరిపేట, న్యూస్‌లైన్ :పలు దొంగతనాలతో ప్రమేయం ఉన్న అంతర్ జిల్లా నేరస్తుడ్ని పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. 10 లక్షల విలువ చేసే బంగారు అభరాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. పొన్నూరు మండలం కసుకర్రు గ్రామానికి చెందిన కంచర్ల మోహనరావు పలు దొంగతనాలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. 2013 జూన్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన మోహనరావు గుంటూరు నగరం, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన దొంగతనాల్లో ప్రధాన నిండితుడు. తలుపులు వేయకుండా నిద్రిస్తున్న ఇళ్లలోకి చాకచక్యంగా చొరబడి దొంగతనాలు చేయడంతో సిద్ధహస్తుడు. 11 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న మోహనరావును మంగళవారం ఏఎంజీ ఎదురు డొంక ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. నిందితుడి వద్ద 34 సవర్ల బంగారు అభరణాలు, 10 తులాల వెండి, రూ.20 వేల నగదు, వాచి, ఐ-ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిండితుడి అరెస్టులో సమర్థంగా వ్యవహరించిన అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు, ఎస్ఐలు రాధాకృష్ణ, అసన్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు ప్రక టించారు. స్థానికంగా దొంగ బంగారం కొనుగోలు చేసిన నగల వ్యాపారి రాచుమల్లు బద్రీనాథ్‌పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచుకొని తలుపులు తెరచి పడుకోవడం సరికాదని, అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల బదిలీలు పూర్తికావచ్చాయని, రెండురోజుల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో పోలీసుల బదిలీలు ఉంటాయన్నారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ డి.ప్రసాద్, అర్బన్ సీఐ జి.చెంచుబాబు తదితరులు ఉన్నారు.