ముగిసిన అంతర్‌ జిల్లాల హ్యాండ్‌బాల్‌ పోటీలు | The end of the inter-district competitions in handball | Sakshi
Sakshi News home page

ముగిసిన అంతర్‌ జిల్లాల హ్యాండ్‌బాల్‌ పోటీలు

Published Sun, Aug 7 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ముగిసిన అంతర్‌ జిల్లాల హ్యాండ్‌బాల్‌ పోటీలు

ముగిసిన అంతర్‌ జిల్లాల హ్యాండ్‌బాల్‌ పోటీలు

  • l విజేతగా ఖమ్మం జట్టు
  • l నాలుగో స్థానంలో నిలిచిన వరంగల్‌
  • వరంగల్‌ స్పోర్ట్స్‌ : తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో హన్మకొండలోని జ వహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ని ర్వహించిన అంతర్‌ జిల్లాల సబ్‌ జూనియర్స్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలు ఆదివారం ముగిశాయి.
    హోరాహోరీగా కొనసాగిన పోటీ ల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్‌ స్థానాన్ని నిజామాబాద్‌ జట్టు దక్కించుకోగా, మూడో స్థానంలో హైదరాబాద్, నాలుగో స్థా నంలో వరంగల్‌ జట్లు నిలిచాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తెలంగాణ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు స్థానిక కార్పొరేటర్‌ సోబియా సబహత్‌ ముఖ్యఅతిథిగా హాజరైవిజేతలకు ట్రోఫీలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోట ములు సహజమన్నారు. ఓటమితో కుంగి పోకుండా.. మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. 
    జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఇందిర, హన్మకొండ సీఐ అవిర్నేని సంపత్‌రావు, ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కైలాస్‌యాదవ్, ఇంద్రసేనారెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement