handball tounament
-
Premier Handball League: సెమీస్‌లో తెలుగు టాలన్స్
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో హైదరాబాద్‌కు చెందిన తెలుగు టాలన్స్ జట్టు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ జట్టు 26–25తో ఒక్క పాయింట్ తేడాతో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టుపై గెలిచింది. కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్న తెలుగు టాలన్స్ జట్టు ఈ విజయంతో పీహెచ్ఎల్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గోల్డెన్ ఈగల్స్‌తో మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ గోల్‌కీపర్ రాహుల్ విశేషంగా రాణించాడు. అతను ఏకంగా 24 సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లుగోల్పోస్ట్పై కొట్టిన షాట్లను నిలువరించాడు. కైలాష్ పటేల్ ఐదు గోల్స్ సాధించడంతోపాటు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు గెల్చుకున్నాడు. ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టాలన్స్ 12 పాయింట్లతో మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. -
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ వాయిదా
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్) ఆరంభ సీజన్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) ఉపాధ్యక్షుడు ఆనందీశ్వర్ పాండే శుక్రవారం ప్రకటించారు. కొత్త తేదీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 24 నుంచి జనవరి 10 వరకు లీగ్ జరగాల్సి ఉంది. ఆరంభ సీజన్లో తెలంగాణ టైగర్స్, యూపీ ఐకాన్స్, మహారాష్ట్ర హ్యాండ్‌బాల్ హాస్లర్స్, కింగ్హ్యాక్స్ రాజస్తాన్, బెంగాల్ బ్లూస్, పంజాబ్ పిట్‌బుల్స్ జట్లు తలపడనున్నాయి. సురక్షిత పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించడానికి తమ బృందం కృషిచేస్తోందని పీహెచ్ఎల్ సీఈవో మృణాలిని శర్మ పేర్కొన్నారు. -
భవన్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కాలేజి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో భవన్స్ (సైనిక్‌పురి) కాలేజి జట్టు సత్తా చాటింది. దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భవన్స్ జట్టు 14–9తో అరోరా డిగ్రీ కాలేజిపై గెలుపొందింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో లయోలా అకాడమీ 11–7తో బీఆర్ అంబేడ్కర్ కాలేజిపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో అరోరా 9–4తో లయోలా అకాడమీపై, భవన్స్ సైనిక్‌పురి 15–8తో బీఆర్ అంబేడ్కర్‌పై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ మార్టిన్స్ కాలేజి చైర్మన్ ఎం. లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
చాంపియన్ హైదరాబాద్
హ్యాండ్‌బాల్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. హన్మకొండలో జరిగిన ఈ టోర్నీ టైటిల్ పోరులో హైదరాబాద్ 18–7తో ఖమ్మం జట్టును చిత్తుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆరంభం నుంచి జోరును కనబరిచిన హైదరాబాద్ జట్టు అర్ధభాగం ముగిసేసరికి 8–4తో ఆధిక్యంలో ఉంది. తర్వాత ఇదే ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మ్యాచ్‌ను గెలుచుకుంది. విజేత జట్టు తరఫున ప్రియ 7 పాయింట్లు సాధించగా, వినీష 5, నందిత 4 పాయింట్లతో రాణించారు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 13–8తో నిజామాబాద్‌పై, ఖమ్మం 8–7తో వరంగల్‌పై గెలుపొందింది. , Hyderabad -
ముగిసిన అంతర్ జిల్లాల హ్యాండ్‌బాల్ పోటీలు
l విజేతగా ఖమ్మం జట్టు l నాలుగో స్థానంలో నిలిచిన వరంగల్ వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అ సోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జ వహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ని ర్వహించిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన పోటీ ల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్ స్థానాన్ని నిజామాబాద్ జట్టు దక్కించుకోగా, మూడో స్థానంలో హైదరాబాద్, నాలుగో స్థా నంలో వరంగల్ జట్లు నిలిచాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు స్థానిక కార్పొరేటర్ సోబియా సబహత్ ముఖ్యఅతిథిగా హాజరైవిజేతలకు ట్రోఫీలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోట ములు సహజమన్నారు. ఓటమితో కుంగి పోకుండా.. మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి ఇందిర, హన్మకొండ సీఐ అవిర్నేని సంపత్‌రావు, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కైలాస్‌యాదవ్, ఇంద్రసేనారెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.