జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో హైదరాబాద్‌కు చెందిన తెలుగు టాలన్స్ జట్టు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ జట్టు 26–25తో ఒక్క పాయింట్ తేడాతో గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టుపై గెలిచింది. కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్న తెలుగు టాలన్స్ జట్టు ఈ విజయంతో పీహెచ్ఎల్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
గోల్డెన్ ఈగల్స్‌తో మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ గోల్‌కీపర్ రాహుల్ విశేషంగా రాణించాడు. అతను ఏకంగా 24 సార్లు ప్రత్యర్థి ఆటగాళ్లుగోల్పోస్ట్పై కొట్టిన షాట్లను నిలువరించాడు. కైలాష్ పటేల్ ఐదు గోల్స్ సాధించడంతోపాటు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు గెల్చుకున్నాడు. ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టాలన్స్ 12 పాయింట్లతో మహారాష్ట్ర ఐరన్‌మెన్ జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment