విజయనగరం జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది చోరీ కేసులతో సంబంధం ఉన్న అంతర్ జిల్లాల దొంగను
కశింకోట: విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఎనిమిది చోరీ కేసులతో సంబంధం ఉన్న అంతర్ జిల్లాల దొంగను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.80 లక్షల విలువైన ఐదున్నర తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్టు అనకాపల్లి క్రై ం బ్రాంచ్ డీఎస్పీ పీవీ కష్ణవర్మ తెలిపారు. కశింకోట పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన చేబ్రోలు విజయకుమార్ మోటారు సైకిల్‌పై పరారవుతుండగా అనకాపల్లి పట్టణంలోని సుంకరమెట్ట వద్ద పట్టుకున్నట్టు చెప్పారు.
సబ్బవరంలో దొంగిలించిన మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని, విచారణ జరపగా ఇంకా ఏడు కేసులతో సంబంధం ఉందని తేలిందన్నారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగల్లో నల్లపూసల తాడు కశింకోటలోని అగ్రహారానికి చెందిన దుంతకుర్తి మాధురిలక్ష్మి అనే మహిళకు చెందిందన్నారు. ఆమె నగలను గత ఏడాది అక్టోబర్ 13న దొంగిలించారని, అప్పట్లో సబ్బవరంలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్టు చెప్పారు.
ఆ కేసులో విజయకుమార్ నాల్గో నిందితుడని, అతని నుంచి ఇప్పుడు బంగారు నల్ల పూసల తాడు స్వాధీనం చేసుకున్నామన్నారు. మునగపాక మండలం నాగులాపల్లి వద్ద గంగి గాయత్రి అనే మహిళకు చెందిన బంగారు పుస్తెల తాడు దొంగిలించారని, విజయనగరం జిల్లా సాలూరులో చెవి దుద్దులు, రామభద్రపురంలో పుస్తెల తాడు, చీపురపల్లిలో చెవి దుద్దులు, ఉంగరం దొంగిలించగా వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.
ఎంవీపీ కాలనీ, సాలూరు పట్టణంలో చోరీ చేసిన సొత్తును బ్యాంకులో కుదువ పెట్టారని తెలిపారు. దాన్ని స్వాధీనం చేసుకోవలసి ఉందన్నారు. విజయకుమార్.. బన్నీ గ్యాంగ్‌తో కలిసి విశాఖపట్నంలోనే గతంలో 30 వరకు దొంగతనాలు చేశాడని, ఇందులో పెందుర్తిలో 20 వరకు ఉన్నాయన్నారు. నిందితుడ్ని కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనకాపల్లి రూరల్ సీఐ కె.ఎన్.ఎస్.వి.ప్రసాద్, పోలీసు సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.