సాక్షి, సిద్దిపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను బేషరతుగా తగ్గించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళదామని రైతులకు మంత్రి గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. బీజేపీ రైతుల పాలిట రాక్షస పార్టీగా మారిందని, ప్రతిరోజూ ఏదో రైతు వ్యతిరేక విధానాలు ప్రకటిస్తూ రైతుల ఉసురు పోసుకుంటోందని ఆరోపించారు.
కేసీఆర్ రైతుబంధుగా....బీజేపీ రాబం దుగా మారిందన్నారు. కిసాన్ మోర్చా సమావేశంలో మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..‘‘500–1000 మంది కలిసి స్వచ్ఛంద సేవకుల బృందంగా ఏర్పడి రైతులను లాఠీలతో కొట్టండి’’అని బీజేపీ కార్యకర్తలను ఉసిగొల్పిన రైతు వ్యతిరే కపార్టీ బీజేపీ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసిన బీజేపీ దేశంలో ఒక్క రూపాయి అయినా రైతుకు రుణమాఫీ చేసిం దా? అని ప్రశ్నించారు. గల్లీలో అయినా, ఢిల్లీలో పోరాటానికైనా వెనుకాడేది లేదని, నాగలి ఎత్తి రైతు పోరాట శక్తిని కేంద్రానికి చూపిద్దాం అని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment