Fertilizer prices
-
మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్లో తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానం ద్వారా రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి స్పందిస్తూ..‘రైతులకు తక్కువ ధరకు ఎరువులు లభ్యమయ్యేలా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. కొన్ని ఎరువుల తయారీకి సంబంధించి కంపెనీలకు ఇప్పటికే 100 శాతం రాయితీలు అందించాం. రిటైల్ దుకాణంలో అమర్చిన పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల ద్వారా ఆధార్‌తో రైతులు సబ్సిడీపై ఎరువులు పొందుతున్నారు’ అని చెప్పారు.2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం అందిస్తున్న ఎరువుల సబ్సిడీ వివరాలను మంత్రి తెలియజేశారు.2010-11లో రూ.65,836.68 కోట్లు2011-12లో రూ.74,569.83 కోట్లు2012-13లో రూ.70,592.1 కోట్లు2013-14లో రూ.71,280.16 కోట్లు2014-15లో రూ.75,067.31 కోట్లు2015-16లో రూ.76,537.56 కోట్లు2016-17లో రూ.70,100.01 కోట్లు2017-18లో రూ.69,197.96 కోట్లు2018-19లో రూ.73,435.21 కోట్లు2019-20లో రూ. 83,466.51 కోట్లు2020-21లో రూ. 1,31,229.5 కోట్లు2021-22లో రూ. 1,57,640.1 కోట్లు2022-23లో రూ.2,54,798.9 కోట్లు2024-25లో జులై 2024 వరకు అందించిన సబ్సిడీ రూ.36,993.39 కోట్లు‘చట్టబద్ధంగా 45 కిలోల యూరియా బ్యాగ్ రూ.242 (ఛార్జీలు, పన్నులు మినహాయింపు)గా ఉంది. యూరియా ఉత్పత్తికి అయ్యే వాస్తవ ఖర్చులు, రైతులకు అందిస్తున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. అందుకోసం ప్రభుత్వ సబ్సిడీలు ఉపయోగపడుతున్నాయి. ఫాస్ఫేట్, పొటాష్ ఎరువుల కోసం ప్రభుత్వం ఏప్రిల్ 2010 నుంచి న్యూట్రియంట్ బేస్ట్ సబ్సిడీ(ఎన్బీఎస్) విధానాన్ని అమలు చేస్తోంది. ఎరువుల ధరలు వాటి ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. క్రమంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల్లో మార్పులుంటాయి’ అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: దివాలా దిశగా అగ్రరాజ్యం!2010-11 నుంచి ఎరువుల ఉత్పత్తి వివరాలను మంత్రి వెల్లడించారు.2010-11లో 376.25 లక్షల టన్నులు2011-12లో 387.78 లక్షల టన్నులు2012-13లో 374.94 లక్షల టన్నులు2013-14లో 380.46 లక్షల టన్నులు2014-15లో 385.39 లక్షల టన్నులు2015-16లో 413.14 లక్షల టన్నులు2016-17లో 414.41 లక్షల టన్నులు2017-18లో 413.61 లక్షల టన్నులు2018-19లో 413.85 లక్షల టన్నులు2019-20లో 425.95 లక్షల టన్నులు2020-21లో 433.68 లక్షల టన్నులు2021-22లో 435.95 లక్షల టన్నులు2022-23లో 485.29 లక్షల టన్నులు2023-24లో 503.35 లక్షల టన్నులు -
ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ
న్యూఢిల్లీ: రాబోయే ఖరీఫ్ సీజన్(ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30)లో ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఎప్పటిలాగే రూ.1,350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అలాగే దేశంలో కొత్తగా మూడు సెమీ–కండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టాటా గ్రూప్, జపాన్‌కు చెందిన రెనిసస్ వంటి కంపెనీలు కలిసి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. రక్షణ, అటోమొబైల్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలకు అవసరమైన సెమీ–కండక్టర్లను తయారు చేస్తారు. -
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఎగబాకడం, రైతుల నుండి పెరిగిన డిమాండ్, తగ్గిన సరఫరా కారణంగా దేశంలో ఎక్కువైన ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కేంద్రం దృష్టిసారించింది. రానున్న ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు దిగింది. బ్లాక్‌మార్కెటింగ్ అరికట్టేందుకు కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 370 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణలో నాలుగు యూరియా డైవర్షన్ యూనిట్లలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మిశ్రమ యూనిట్లో తనిఖీలు చేశాయి. మరో వారం పాటు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. తనిఖీల సందర్భంగా గుజరాత్, కేరళ, హరియాణా, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏకంగా 70,000 బస్తాల నకిలీ యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా 30 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా, 112 మిశ్రమ తయారీదారులను డీఆథరైజ్ చేసినట్లు వెల్లడించింది. దాదాపు రూ. 2,500 ఖరీదు చేసే 45 కిలోల యూరియా బస్తాను రైతులకు వ్యవసాయ అవసరాలకు రాయితీపై రూ.266కే కేంద్రం అందిస్తోంది. అయితే డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో సబ్సిడీ ధరకు యూరియాను పొందలేకపోతున్న రైతన్నలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
ఎరువు.. బరువుగా మారిన వేళ
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి సాయం.. ఉచితంగా నిరంతర విద్యుత్.. పండిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు.. వీటికి అదనంగా ఐదేళ్లకొక మారు పంట రుణమాఫీ. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న పథకాలివి. కానీ ఇక్కడ వ్యవసాయం రైతులకు పండుగలా మారిందా? అంటే లేదనే అంటోంది మెజారిటీ రైతాంగం. సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరిగినా.. తమ కష్టమంతా ఎరువులు, పురుగు మందులు, కూలీలు తదితర ఖర్చులకే సరిపోతోందని అంటున్నారు. దేశంలో అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసలో నిలవడం గమనార్హం. హెక్టారుకు సగటున 206 కిలోల ఎరువులు వాడుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. సారవంతమైన భూములు, చాలినన్ని సాగునీళ్లు ఉన్నా.. విపరీతంగా పెరిగిన ఎరువుల వాడకం, ఇతర ఖర్చుల వల్ల.. రైతుకు సాగు సంబురంగా మారడం లేదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎరువుల ఖర్చును తగ్గించుకుంటే ఎక్కువ ఫలితం దక్కుతుందని, పంటల మార్పిడితో ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఎరువుల వినియోగంలో టాప్ ఆహారోత్పత్తిని, మొక్కలకు పోషకాలు, భూసారాన్ని పెంచేందుకు రైతులు నత్రజని, భాస్వరం, పొటాషియం (ఎన్పీకే) భారీగా వినియోగిస్తున్నారు. తెలంగాణ 2018–19లో దేశంలోనే అత్యధిక ఎరువుల వినియోగంతో మొదటి స్థానంలో (హెక్టారుకు 245 కిలోలు) నిలవగా, 2019–20లో నాలుగో స్థానంలో (హెక్టారుకు 206 కిలోలు) నిలిచిందని ఫెర్టిలైజర్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే దేశ సగటు వినియోగం 133.1 కిలోలు మాత్రమే కావడం గమనార్హం. అవసరానికి మించి ఎరువుల వాడకం వల్ల ఏకంగా 200 మండలాల్లోని భూముల్లో భారీగా భాస్వరం నిల్వలు పేరుకు పోయాయని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ తాజా పరిశోధనలో తేలింది. పేరుకుపోయిన భాస్వరం నిల్వల నుంచి భూసార పరిరక్షణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను నిర్దేశించినా అది ఇంకా పంట పొలాలకు చేరువ కాలేదు. ఇదీ సాగు లెక్క.. ► రాష్ట్ర జనాభాలో 48.4 శాతం మందికి వ్యవసాయమే ఉపాధి. ► 2018 నుంచి రైతుబంధు కింద 63 లక్షల మందికి ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున అందుతున్న పెట్టుబడి సాయం. ► బావులు, లిఫ్ట్‌లు, చెరువులు, చెక్‌డ్యామ్‌ల ద్వారా రాష్ట్రంలోసాగవుతున్న భూమి 1.36 లక్షల ఎకరాలు ► గడిచిన ఐదేళ్లలో వరి ఉత్పత్తి పెరిగింది. అత్యధిక ఎరువుల వినియోగం ఉన్నా.. సగటు ఉత్పత్తిలో పంజాబ్ కంటే వెనకే ఉంది. ► 25.92 లక్షల వ్యవసాయ మోటార్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోంది. ► అత్యధికంగా మెదక్, జనగామ, నాగర్‌కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అవుతోంది. రైతులు, ఉన్న భూమి లెక్కలు ఇలా 2.47 ఎకరాలలోపు.. 64.6 శాతం 2.48 – 4.94 ఎకరాలు.. 23.7 శాతం 4.95– 9.88 ఎకరాలు.. 9.5 శాతం 9.89 –24.77 ఎకరాలు.. 2.1 శాతం 24.79 కంటే ఎక్కువ.. 0.2 శాతం అత్యధికంగా ఎరువులు వినియోగించిన రాష్ట్రా లు ఎరువులు, మందులకే రూ.47,600 ఖర్చు నాకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేసిన. ఆదాయం చూస్తే పెట్టుబడి ఖర్చులు కూడా పూర్తిగా రాలా. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకున్నా. అధిక వర్షాల కారణంగా నాలుగు క్వింటాళ్లే వచ్చింది. క్వింటాకు రూ.8 వేల చొప్పున విక్రయిస్తే రూ.1.60 లక్షలు రాగా, రూ.1,61,450 పెట్టుబడి పెట్టా. ఇందులో యూరియా, క్రిమిసంహారక, పూత మందులకే రూ.47,600 ఖర్చయ్యాయి. దీంతో పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. –బలరాం, పత్తి రైతు తిగుల్, సిద్దిపేట జిల్లా ఐదెకరాలు సాగు చేస్తే రూ.55 వేలే మిగిలింది ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తే రెక్కల కష్టానికి తగిన ఫలితం కూడా మిగలలేదు. సాగు కోసం రూ.1.2 లక్షలు ఖర్చు పెడితే 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.2 లక్షలు వచ్చాయి. విత్తనాల ఖర్చు నుంచి, నాటు వరకు రూ.45 వేల ఖర్చు కాగా, ఎరువులకు రూ.18 వేలు అయ్యాయి. పంటకోత, ఆరబెట్టేందుకు రూ.14 వేలు, మోటార్ల మరమ్మతుకు రూ.4 వేలు, 3 మోటార్ల నిర్వహణకు, ఏడాది కరెంటు బిల్లు రూ. 2,250 అయింది. ఖర్చులు పోను రూ.80 వేలు మిగిలితే.. పెట్టుబడి వడ్డీలకు రూ.25 వేలు పోయింది, ఆర్నెల్ల పాటు భార్యాభర్తలం ఇద్దరం కలిసి పనిచేస్తే రూ.55 వేలు మాత్రమే మిగిలింది. –లెక్కల ఇంద్రసేనారెడ్డి, రైతు, దేవరుప్పుల, జనగామ జిల్లా వ్యయం తగ్గాలి.. మద్దతు పెరగాలి పలు కారణాలతో పంట ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిపోయింది. ఈ మేర పంట మద్దతు ధర పెరగలేదు. దీంతో పిల్లల చదువులు, ఆరోగ్యం విషయాల్లో మిగిలిన సమాజంతో రైతులు పోటీ పడలేకపోతున్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా చేయూతనిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు, రైతులకు ఇచ్చే మద్దతు ధరలు పెంచాల్సి ఉంది. – ప్రొఫెసర్ కె.ముత్యంరెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎకనమిక్ అసోసియేషన్ -
ఎరువుల ధరలు తగ్గించాలి: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను బేషరతుగా తగ్గించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతులపై బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళదామని రైతులకు మంత్రి గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. బీజేపీ రైతుల పాలిట రాక్షస పార్టీగా మారిందని, ప్రతిరోజూ ఏదో రైతు వ్యతిరేక విధానాలు ప్రకటిస్తూ రైతుల ఉసురు పోసుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ రైతుబంధుగా....బీజేపీ రాబం దుగా మారిందన్నారు. కిసాన్ మోర్చా సమావేశంలో మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..‘‘500–1000 మంది కలిసి స్వచ్ఛంద సేవకుల బృందంగా ఏర్పడి రైతులను లాఠీలతో కొట్టండి’’అని బీజేపీ కార్యకర్తలను ఉసిగొల్పిన రైతు వ్యతిరే కపార్టీ బీజేపీ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేసిన బీజేపీ దేశంలో ఒక్క రూపాయి అయినా రైతుకు రుణమాఫీ చేసిం దా? అని ప్రశ్నించారు. గల్లీలో అయినా, ఢిల్లీలో పోరాటానికైనా వెనుకాడేది లేదని, నాగలి ఎత్తి రైతు పోరాట శక్తిని కేంద్రానికి చూపిద్దాం అని పిలుపునిచ్చారు. -
ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే లైసెన్సులు రద్దు
సాక్షి, అమరావతి: కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎరువులు కొనుగోలు చేస్తున్నప్పుడు బస్తాపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల ప్రకారమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఎమ్మార్పీకి మించి ఒక్క పైసా కూడా చెల్లించవద్దన్నారు. డీలర్ నుంచి విధిగా రసీదు పొందాలని సూచించారు. ఎవరైనా డీలర్లు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే.. స్థానిక వ్యవసాయాధికారికి గానీ, సమీకృత రైతు సమాచార కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 15521కి గానీ ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 19 నాటికి 6.63 లక్షల ఎంటీల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు 20.45 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని.. వాటిని నెలవారీ కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి సరఫరా చేస్తారని తెలిపారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలతో పాటు వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ ధరల వివరాలను రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో అంతర్గత తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి రిటైల్, హోల్‌సేల్, తయారీదారుల స్టాక్ పాయింట్లను తనిఖీ చేయాలని ఆయన వ్యవసాయ శాఖ సంచాలకులకు ఆదేశాలిచ్చారు. -
బె‘ధర’గొడ్తూ!
నేలకొండపల్లి: ఎన్నెన్నో ఆశలతో సాగు పనుల కు శ్రీకారం చుడుతున్న రైతులు ఆదిలోనే బెదిరేట్లుగా ఎరువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి రేట్ల పెంపుపై ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు రాకున్నా..వ్యాపారులు మాత్రం గతంతో పోలిస్తే ఎక్కువ చేసి అమ్మేస్తున్నారు. దీంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎరువుల ధరలకు రెక్కలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుబంధు, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాల ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్న తరుణంలో ఇలా..ఎరువుల ధరలు పెరగడమేంటని సామాన్య రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూ.1250 ఉన్న డీఏపీ కట్ట ప్రస్తుతం మార్కెట్ లో రూ.1470 పలుకుతోంది. దీంతో ఒక్కో బస్తాపై అదనంగా రూ.200కు పైగా భారం మోయాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ సమీపిం చిన నేపథ్యంలో రైతులు పొలాల బాట పట్టారు. దుక్కులు దున్నుతూ ఇతర పనులు చేస్తూ, వ్యవసాయ పనిముట్లను సిద్ధం చేసుకుంటూ..వారం పది రోజుల్లో రుతుపవనాలు రానుండటంతో ఖరీప్ సాగుకు అంతా సన్నద్ధమవుతున్నారు. అయితే పెరిగిన ఎరువుల ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఎరువుల దుకాణాల్లో పెంచిన లెక్క ప్రకారమే విక్రయాలు జరుపుతుండటంతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సాగు అంచనాలు ఇలా.. జిల్లాలో ఈ సంవత్సర ఖరీఫ్‌లో 2,30,498 హెక్టార్లు సాగు చేసే అవకాశాలున్నాయి. అందులో వరి–59,361 హెక్టార్లలో వేయనున్నారని అంచనా. ఇంకా పత్తి–96,116 హెక్టార్లు, మొక్కజొన్న 3,802 హెక్టార్లు,పెసర–9,249 హెక్టార్లు, కంది–2,340 హెక్టార్లు, మిర్చి–21,250 హెక్టార్లలో పండించే అవకాశాలున్నాయి. ఖరీఫ్‌లో వినియోగం 2.34 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. యూరియా– 72,408 మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంది. ఇంకా డీఏపీ–31,561 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 22,946 మెట్రిక్‌టన్నులు, కాంప్లెక్స్ –1,05,560 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ–2500 మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్లో వినియోగిస్తారని అంచనా. తగ్గిన భూసారాన్ని పెంచుకోవాలంటే మళ్లీ సేంద్రియం ఒక్కటే మార్గం అంటున్న శాస్త్రవేత్తల సూచనలను అందరూ పెడచెవిన పెడుతున్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నా..ఆచరణలో ఆశించిన స్థాయిలో అమలు కావట్లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా..వ్యవసాయాన్ని కాపాడేందుకు సేంద్రియ విధానాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. రైతులపై మోయలేని భారం.. అసలే సాగు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం అంటేనే భయపడుతున్న తరుణంలో ఎరువుల ధరలు పెంచడం దారుణం. వీటిని నియంత్రించాలి. రైతుల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వెంటనే ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. – గుడవర్తి నాగేశ్వరరావు, రైతుసంఘం నేత, నేలకొండపల్లి పెట్టుబడి ఇంకా పెరిగింది.. వ్యవసాయం ప్రతి ఏటా భారంగా మారుతోంది. ఒకపక్క పెరిగిన పెట్టుబడి, మరోపక్క కౌలు పెరగడంతో సాగు చేయాలంటేనే భయమేస్తోంది. కౌలు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాలకులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. – కాశిబోయిన అయోధ్య, కౌలురైతు, సింగారెడ్డిపాలెం -
ఎరువు.. ‘ధర’వు
ఖమ్మంవ్యవసాయం: ఒకవైపు చీడపీడలు.. మరోవైపు అనుకూలించని వాతావరణంతో సతమతమవుతున్న రైతుకు పెరిగిన ఎరువుల ధరలు గుదిబండగా మారాయి. గతంలో బస్తాకు రూ.10 లేదా రూ.20 చొప్పున పెంచిన కంపెనీలు ఈసారి ఏకంగా రూ.వందలు పెంచి కష్టజీవులపై మోయలేని భారం మోపాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే రెండుసార్లు రేట్లు పెరగడం గమనార్హం. గిట్టుబాటు ధర ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి తగ్గిపోవడం.. తాజాగా ఎరువుల ధరలు ఎగబాకి పెట్టుబడి అమాంతం పెరగడం.. రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందుకోసం దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. ముడిసరుకు ధరల ప్రభావం.. ఎరువుల తయారీకి వినియోగించే ముడి సరుకును ఆయా కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేస్తాయి. ఎరువులను తయారు చేసేందుకు పెట్రో ఉత్పత్తులతోపాటు పాస్పరిక్ యాసిడ్‌ను వినియోగిస్తారు. అయితే వాటి రేట్లు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో ఎరువుల ధరలు కూడా అమాంతం ఎగబాకినట్లు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఒకే సీజన్లో ఎరువుల ధరలు రెండు దఫాలు పెరిగాయి. ఫిబ్రవరి 1వ తేదీన, తిరిగి అక్టోబర్ 1వ తేదీన ధరలు పెంచారు. దీంతో ఒక్కో బస్తాపై రూ.400 వరకు పెరిగిన పరిస్థితి నెలకొంది. అంతకుముందు రూ.900 నుంచి రూ.1000 వరకు ఉన్న బస్తా ధర ప్రస్తుతం రూ.1,450 చేరింది. రైతులు దిగుబడి కోసం ఎక్కువగా డీఏపీ, కాంప్లెక్స్, మూరేట్ ఆఫ్ పొటాష్, సింగిల్ సూపర్ పాస్పేట్ వంటి ఎరువులను వినియోగిస్తుంటారు. కంపెనీలు కూడా ఆ ఎరువుల ధరలనే పెంచి రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. యూరియా రేట్లు కూడా.. ఎరువులన్నింట్లో యూరియా ధర కొంత భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వమే యూరియాకు ఒక ధరను నిర్ణయిస్తుంది. ఆ ధరలకే(సబ్సిడీ) రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ దాని ఉత్పత్తి ఖరీదు పెరిగినా అది ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఏడాది యూరియాను 45 కిలోల బస్తాలుగా విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తా ఖరీదు రూ.265 కాగా.. కొరత పేరుతో రూ.300 నుంచి రూ.320 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అదేమని రైతులు ప్రశ్నిస్తే.. కొరత ఉందని, దిగుమతి, ఎగుమతి చార్జీలు ఉంటాయని రైతులను వ్యాపారులు దగా చేస్తున్నారు. అన్నీ పెరిగెన్.. ఈ ఏడాది రైతుకు పెట్టుబడి భారం బాగానే పెరిగిందని చెప్పుకోవాలి. దుక్కి దున్నింది మొదలు అన్ని రకాల ఖర్చులు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తుండడంతో ట్రాక్టర్లకు దుక్కి దున్నే కిరాయిలు ఎక్కువయ్యాయి. గత ఏడాది ఒకసారి ఎకరం దుక్కి దున్నడానికి రూ.1000 అయ్యేది. ప్రస్తుతం అది రూ.1,400 చేరింది. అంటే రూ.400 పెరిగింది. ఇదిలా ఉంటే.. ఒక్కో ఎరువుల బస్తాపై గతం కన్నా సుమారు రూ.400 పెరిగింది. పంట వేసే క్రమంలో మూడుసార్లు దుక్కి దున్నుతారు.. మూడుసార్లు ఎరువులు వేస్తారు. దీంతో మొత్తం ఎకరానికి గతంలో కంటే రూ.2,500 నుంచి రూ.3,000 వరకు రైతులపై భారం పడుతోంది. దీనికి కూలీలు, పురుగు మందుల ఖర్చులు అదనం.. మొత్తం మీద ఈ ఏడాది రైతుకు పెట్టుబడి తడిసి మోపెడుతోంది. ఇంత ఖర్చు పెట్టినా దిగుబడి మంచిగా ఉంటుందా అంటే అదీ లేదు. వాతావరణం అనుకూలించక అన్ని పంటల దిగుబడులు భారీగా తగ్గాయి. దీంతో రైతులకు నష్టాలు తప్పా.. లాభాలు వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి. బాగా పెరిగాయి ఎరువుల ధరలు ఈ ఏడాది బాగా పెరిగాయి. గతంలో ఒకేసారి ఎన్నడూ ఇంత పెరగలేదు. రూ.1,080 నుంచి డీఏపీ బస్తా ఒకేసారి రూ.1,450 పెరిగింది. ఇలా అయితే ఎలా. రైతుల వ్యవసాయం చేయాలా.. వద్దా.. చివరికి పెట్టుబడి కూడా చేతికి వస్తందనే నమ్మకం లేదు. ప్రభుత్వం ధరలపై పునరాలోచించాలి. – మంకెన నాగేశ్వరరావు నేరెడ, చింతకాని మండలం వ్యవసాయం ఎలా చేయాలి గతంలో ఎప్పుడూ లేనం తగా ఎరువుల ధరలు పెంచారు. ఇలా అయితే రైతులు వ్యవసాయం ఎలా చేయాలి. గిట్టుబా టు ధరను పెంచకుండా ఇబ్బడి ముబ్బడి ఎరువుల రేట్లు పెంచడం దారుణం. ఈ ఏడాది దిగుబడి ఆశించినంత లేదు. దీనికి తోడు పెట్టుబడి పెరిగింది. ఈ సారి రైతులకు నష్టాలు తప్పవు. – మాదినేని సూరయ్య, పాతకాచారం, కొణిజర్ల మండలం -
ఎరువు.. ‘ధర’వు..
సాక్షి, కరీంనగర్: వర్షాభావం.. నీరందక ఎండిపోతున్న పైర్లు.. బతికి బట్టకట్టిన పంటలకు తెగుళ్లు.. ఖరీఫ్ సీజన్లో దిగుబడి లేక దిగాలు పడుతున్న రైతులకు రబీ సీజన్లో కూడా కష్టాలే ఎదురుకానున్నాయి. రబీకి రైతన్నలు సిద్ధం కాకముందే ఎరువుల రూపంలో ప్రతికూలతలు ఎదురయ్యాయి. డీజిల్ ధరలు పెరగడంతో సాగు వ్యయం పెరిగి గిట్టుబాటు కాని వ్యవసాయం చేసే రైతులకు ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ప్రతీ ఏడాది రైతు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గతేడాది వర్షాలు సకాలంలో కురియకపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో రైతులు అప్పులపాలయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసినప్పటికీ ఆ తర్వాత దాదాపు 10 రోజులపాటు వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో నష్టపోయారు. దీనికితోడు ఎరువుల ధరలను అయా కంపెనీలు పెంచేశాయి. ఇక పెట్టుబడి భారం మరింత పెరుగనుంది. పంటల దిగుబడి పెరగాలనే ఉద్దేశంతో రైతులు దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు. ఇదే అదునుగా భావించిన కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.95 నుంచి రూ.170 వరకు పెంచాయి. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు సార్లు ధరలను పెంచారు. ఒక్కో రైతుపై దాదాపు రూ.4 వేల వరకు అదనపు భారం పడనుంది. పెరుగుతున్న ఎరువుల వాడకం.. జిల్లాలో 2.1 లక్షల హెకార్ల సాగు విస్తీర్ణం కాగా.. లక్షా 25 వేల హెక్టార్లలో పత్తి సాగు, 20 వేల హెక్టార్లలో సోయా, 15 వేల హెక్టార్లలో కందులు, 7 వేల హెక్టార్లలో జొన్న, 3 వేల హెక్టార్లలో చిరుధాన్యాలు, 2 వేల హెక్టార్లలో పెసరి పంటలు సాగు చేశారు. అయితే.. జిల్లాకు 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 14 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 5 వేల మెట్రిక్ టన్నుల పొటాష్, 20 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎరువుల ధరల పెరుగుదల రైతుల మెడపై గుదిబండగా మారాయి. ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వడంతో సంతోషంలో ఉన్న రైతులకు పురుగుల మందుల ధరలు, ఎరువుల ధరలు పెరగడంతో మోయలేని భారంగా మారింది. డీఏపీ ధర ఎక్కువ పెరగడంతో దీని వాడకం తగ్గించి యూరియా, ఇతర ఎరువుల వాడకం పెంచారు. దీంతో ఎరువుల సమతూల్యత తగ్గి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
ఎరువు.. ‘ధర’వు
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందగా మారింది.. రైతుల పరిస్థితి. ప్రతి ఏడాది రైతు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గత ఏడాది వర్షాలు సకాలంలో కురియకపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో అప్పులపాలయ్యారు. ఈ ఖరీఫ్ సీజన్ ఆగస్టులో భారీ వర్షాలు కురువడంతో జిల్లాలో 24 వేల హెక్టార్లలో పత్తి, సోయా పంటలు నష్టపోయారు. దీనికి తోడు ప్రస్తుతం అయా కంపెనీలు ఎరువుల ధరలు పెంచేశాయి. దీంతో రబీ పంటల పెట్టుబడి భారం మరింత పెరుగనుంది. పంటల దిగుబడి పెరగాలనే ఉద్దేశంతో రైతులు దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వినియోగిస్తారు. ఇదే అదునుగా భావించిన కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.100 నుంచి రూ.275 వరకు పెంచాయి. ప్రతి సంవత్సరం ఎరువుల ధరలను పెంచుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికి మూడు సార్లు ధరలను పెంచారు. 2017 మార్చిలో ధరలు పెంచగా ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్‌లో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మరోసారి ధరలను పెంచి రైతులను కోలుకోకుండా చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతుపై దాదాపు రూ.5వేల వరకు అదనపు భారం పడనుంది. యూరియా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండడంతో ధరను పెంచడానికి వీలు లేదు. అన్నదాతకు గుదిబండ.. జిల్లాలో రబీ సాగు విస్త్రీర్ణం 23 హెక్టార్లలో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 18వేల హెక్టార్లలో శనగ, వెయ్యి హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో జోన్న, 500 హెక్టార్లలో మొక్కజోన్న, 1500 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రబీ పంటల కోసం 9వేల మెట్రిక్ టన్నుల యూరియా, 4,500 టన్నుల డీఏపీ, 2300 మెట్రిక్ టన్నుల ఎంఓపీ, 6500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం. ఎరువుల ధరల పెరుగుదల రైతుల మెడపై గుదిబండగా మారాయి. పొటాష్ ధర బస్తాకు రూ.675 నుంచి రూ.950, డీఏపీ ధర రూ.1290 నుంచి రూ.1425కు పెరిగింది. డీఏపీ ధర ఎక్కువ పెరగడంతో దీని వాడకం తగ్గించి యూరియా, ఇతర ఎరువుల వాడకం పెంచనున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఎరువుల సమత్యులత తగ్గి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
ఎరువు.. బరువు
సాక్షి భూపాలపల్లి: ఇప్పటికే విపరీతమైప ఒడిదుడుకుల మధ్య సేద్యం సాగుతోంది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కుదేలైన అన్నదాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరోవైపు గులాబీ రంగు పురుగు, కత్తెర పురుగు వంటి చీడపీడల ఉధృతికి వ్యవసా యం భారంగా మారుతోంది. దీనికి తోడు ప్రస్తుతం పెరిగి న ఎరువుల ధరలు అన్నదాతకు మరింత భారంగా పరిణమించాయి. ప్రభుత్వం పంపిణీ చేసే యూరియా మినహాయించి మిగతా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై రూ.50 నుంచి 100 వరకు ధరలు పెరిగాయి. రైతుకు ఎకరాకు ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం రూ.4000లకు మించి వ్యయం అవుతోంది. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం జిల్లాలో రైతుల పరిస్థితి అంత బాగోలేదు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, కొత్తగా మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు రూపంలో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని అదుపు చేయడానికే రసాయ న మందులను పిచికారీ చేస్తున్నారు. ఎకరానికి అదనంగా రెండు నుంచి మూడు వేల రూపాలయల ఖర్చు అవుతోం ది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పంటల చేలల్లో వర్షపునీరు నిలవడంతో మొక్కల ఎదుగుదల లోపించింది. వారం రోజులుగా వర్షాలు తెరిపినివ్వడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు ఎరువులు వేస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం మరో మారు ఎరువుల ధరలు పెరిగాయి. ఐదు నెలల్లో పెరగడం ఇది మూడోసారి. దీంతో వ్య యం కాస్త ఎకరానికి మరో వెయ్యిరూపాయలు పెరగనుంది. మున్ముందు కాలం ఎట్లుంటుందో తెలియదు. దిగుబడి ఏమేరకు వస్తదో.. ధర ఎట్టుంటదో.. ఇప్పుడు మాత్రం పెట్టుబడి ఎక్కువైతాంది.. అంటూ చాలామంది రైతులు వాపోతున్నారు. అధికమైన ఎరువుల వినియోగం రెండు వారాల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట పొలాల్లో ఎరువులు చల్లుతూ రైతులు బీజీగా ఉన్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంట పండిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆశించిన విధంగా పత్తి, ఇతర పంటల్లో ఎదుగుదల లోపించింది. మొక్కల పెరుగుదల కోసం ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం అన్ని పంటకు కలిపి దాదాపు 85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగుచేస్తుండడంతో రైతులు యూరియా, డీఏపీ, 20–20 ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల్లో డీఏపీ, 20–20 కూడా ఉన్నాయి. డీఏపీ ప్రతి బస్తాపై రూ.180, 20–20 బస్తాపై రూ.100 పెరిగింది. ప్రభుత్వం యూరియా బస్తాను 5 కిలోలు తగ్గించినా ధర రూ.290 దగ్గరే ఉంచింది. డీపీపీ బస్తా ధర మొదట్లో రూ.1081 ఉండగా తాజాగా 1,330కి పెరిగింది. అయితే ఇందులో జింక్, వేప æకలిపిన డీపీపీతోపాటు సాధరణ డీఏపీలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. దీంతో ఏవి కొనుగోలు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణ డీఏపీ రూ.1,290, కోటెడ్ డీఏపీ పేరిట బస్తాకు రూ.40 నుంచి రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. -
ఎరువు .. బరువు
యల్లనూరు: పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా అన్నదాతల ఆర్థిక ప్రగతిలో మార్పు రావటం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదని నిరంతరం ఉపన్యాసాలు చెప్పి పాలిస్తున్న ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి మరచి రైతుపై మరో అదనపు భారం మోపుతున్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభానికి ముందే ప్రభుత్వం మరోసారి ఎరువుల ధరలు పెంచటంతో అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కో ఎరువు బస్తాపై రూ.100 నుంచి రూ.120 వరకు ధరలు పెరిగాయి. వ్యవసాయం భారంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల అన్నదాతలు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. పెరిగిన వ్యవసాయ ఖర్చులకు తోడు ఎరువుల ధరలకు రెక్కలు రావటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలేవీ? రైతులు ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఉత్సాహం చూపని ప్రభుత్వాలు ఎరువుల ధరల పెరుగుదలకు మాత్రం ఆసక్తి చూపుతున్నాయని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఎరువుల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని మండిపడుతున్నారు. మూడేళ్లుగా వ్యవసాయానికి సాగునీరు, వర్షాలు లేకపోవడంతో కరువు కాటకాలతో అల్లాడుతున్న తరుణంలో ప్రభుత్వం ధరలు పెంచటం సరికాదంటున్నారు. రైతులకు నిరంతరం అండగా ఉండి వారి సంక్షేమానికి పాటుపడతామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతన్నలను నిండాముంచుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టంగా మారనుంది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు, కూలీలు తదితర ఖర్చులకు తోడు ప్రకృతి కరుణించకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు నియంత్రించాలి ప్రభుత్వాలు ఎరువుల ధరలు పెంచడం చాలా దారుణం. రైతులు సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటంతో విఫలమైన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఎరువుల ధరలు పెంచడం సరికాదు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – రామచంద్రారెడ్డి, సీపీఐ నాయకుడు, యల్లనూరు -
బరువెక్కిన ఎరువు
గోపాల్పేట: ఎరువు మరింత బరువెక్కింది. యాసంగి సాగు వేళ రైతులకు మరింత భారంపడింది. ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా పెరుగుతుండడంతో పెట్టుబడి అధికమవుతోంది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1నుంచి కంపెనీలు అమల్లోకి తీసుకురానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు పెరగడంతో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు ఆయా కంపెనీలు చెబుతున్నాయి. జిల్లాలో సుమారు 1,19,700 మంది రైతులు ఉన్నారు. పెరిగిన ఎరువుల ధరలతో రబీలో రైతులపై రూ.2.50కోట్ల అదనపు భారం పడనుంది. ఒక్కోరైతుపై రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల మేర భారం పడుతుందని అంచనా.. పెరిగిన ధరలు ఇలా డీఏపీ బస్తా పాత ధర రూ.1081ఉండగా కొత్తధర రూ.1215కి చేరింది. కాంప్లెక్స్ ఎరువులైన 14–35–14 పాత ధర రూ.1122ఉండగా కొత్తధర రూ.1240కి చేరింది. 20–20–0–13 పాత ధర రూ.873ఉండగా కొత్త ధర రూ.930కి చేరింది. 10–26–26 పాతధర రూ.1044 ఉండగా, కొత్తధర రూ.1150కి చేరింది. 28–28–0 పాత ధర రూ.1122 ఉండగా కొత్త ధర రూ.1240కి చేరింది. 16–20–0–13 పాత ధర రూ.821 ఉండగా కొత్త ధర రూ.880కు చేరింది. డీఏపీ(5 శాతం జింక్)పాత ధర 1107 ఉండగా కొత్త ధర రూ.1240కి చేరింది. 20–20–0–13 పాత ధర రూ.925 ఉండగా కొత్తధర 980కి చేరింది. యాసంగిలో ఇప్పటికే రైతులు ఎరువులను కొనుగోలు చేసి పంటలకు వేశారు. మళ్లీ ఇప్పుడు కొనుగోలుచేసే రైతులపై పెరిగిన భారం పడనుంది. కంపెనీలు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి ప్రకటించలేదు. పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. ఎరువు ధరలు తగించాలి రోజు రోజుకు వ్యవసాయం సాగుఖర్చులు పెరిగిపోతున్నాయి. కూలీల కొరత, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలు రైతులకు భారంగా మారింది. ఖరీఫ్‌లో సరైన వర్షాలు లేక పంటలు ఎండి దిగుబడి తగ్గిపోయింది. కేఎల్ఐ నీళ్లు పుష్కలంగా చెరువులు, కుంటల్లో ఉండడంతో యాసంగిలో ఎక్కువగా వరి, వేరుశనగ సాగు చేశారు. ఈ పరిస్థితుల్లో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచడంతో రైతులకు భారం పడుతుంది. -శ్రీనువాసులు, రైతు, గోపాల్పేట పాత ధరలకే విక్రయించాలి కొత్తస్టాకు ధరలు ముద్రిం చి వస్తాయి. అప్పటి వరకు పాత స్టాకును పా త ధరలకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు విక్రయించొద్దు.. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువు బస్తా ల ధరలు పెరగడంతో యాసంగిలో జిల్లా రైతాంగంపై సుమారు రూ.2.50కోట్ల భారం పడనుంది. –నూతన్‌కుమార్, టెక్నికల్ ఏడీఏ, వనపర్తి జిల్లా -
ఎరువు భారం
సాక్షి, ఆసిఫాబాద్ : ఎరువుల ధరలు పెరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎరువుల ధరలు పెంచనున్నట్లు ఎరువుల కంపెనీ లు నిర్ణయించాయి. దీంతో రైతులపై మరింత భారం పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఖరీఫ్‌లో రైతులకు ఎకరాకు రూ.4వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడంతో ఓ వైపు ఆనందం వ్యక్తం కాగా.. మరో వైపు ఎరువుల ధర పెంపు వార్తతో రై తులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరుకు పెరగడంతో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు కంపెనీలు చెబుతున్నాయి. గత రెండేళ్లుగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో సాగు పెట్టుబడులు అధికమై వ్యవసాయం రైతులకు భారంగా మారింది. ఫిబ్రవరి ఒకటి నుంచి యూరియా, కాంప్లెక్స్ ధరలు పెరుగుతా యని డీలర్లు పేర్కొంటున్నారు. టన్ను యూరి యాపై రూ.2,600 వరకు, టన్ను కాంప్లెక్స్ ఎరువులపై రూ.2,240 వరకు పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బస్తా డీఏపీ రూ.1,083 ఉండగా, రూ.1213కు పెంచనున్నారు. 28:28:0 కాంప్లెక్స్ ఎరువు బస్తా రూ.1122 ఉండగా, దీన్ని రూ.1234కు పెరుగుతుందని అంటున్నారు. అన్ని రకాల కంపెనీలపై బస్తాకు కనీసం రూ. వంద పెరగున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న సాగు ఖర్చులు రైతులకు భారంగా మారాయి. భూమి కౌలు ధరలు మొదలుకొని విత్తనాలు, ఎరువులతోపాటు వ్యవసాయ ఖర్చులు రైతులకు భారంగా మారింది. పత్తి రైతు ఎకరానికి సాగు ఖర్చు సుమారు రూ.30 వేలు అవుతుంది. ఈ ఏడాది గులాబీరంగు పురుగు పత్తి రైతులను, తెల్లదోమ వరి రైతులను నిలువునా ముంచింది. పురుగు ప్రభావంతో వరి, పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతోయాభై శాతం మంది రైతులకు పెట్టుబడులు వెళ్లని దుస్థితి నెలకొంది. ఏటా పెరుగుతున్న కౌలు భూముల ధరలు, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలతో సాగు ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయి. రైతులపై భారం.. ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం 1,17,918 హెక్టార్లు కాగా, ఖరీఫ్‌లో 1,17,918 హెక్టార్ల పంటలు సాగు చేయగా, 87,118 హెక్టార్ల పత్తి, 12,495 హెక్టార్ల కంది, 8281 హెక్టార్ల వరి, 3445 హెక్టార్ల సోయా, 1566 హెక్టార్ల జొన్న, 977 హెక్టార్ల మక్క, 1477 హెక్టార్ల పెసరు, 426 హెక్టార్ల మినుము, 40 హెక్టార్ల వేరుశనగ, 152 హెక్టార్ల మిరప, 26 హెక్టార్ల ఆముదంతోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. రబీలో మొక్కజొన్న 2312 హెక్టార్లు, మక్క 1419, కంది 236, మినుము 12, పెసలు 191, శనగ 1587, వరి 1616 హెక్టార్లు సాగు చేస్తున్నారు. పంట సాగుకు ఎకరాకు మూడు బస్తాల యూరియా, డీఏపీ 1, కాంప్లెక్స్ 1, పొటాష్ 1 బస్తా అవసరముంటుంది. ఈ లెక్కన బస్తాకు సుమారు రూ.ఒక వంద పెరగడంతో జిల్లా వ్యాప్తంగా ఏటా రైతులపై రూ.6.65 కోట్ల భారం పడుతుంది. ఎరువుల ధరలు నియంత్రించాలి రోజురోజుకు వ్యవసాయం సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కూలీల కొరత, పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరలు రైతులకు భారంగా మారింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించపోవడంతో ఈ యేడాది దిగుబడి గణనీయంగా తగ్గింది. పెట్టుబడులు వెళ్లని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎరువుల ధరలు నియంత్రించాలి. – సేనాపతి, రైతు, ఆసిఫాబాద్ -
ఎరువు.. జీఎస్టీ బరువు
⇒పెరగనున్న ఎరువుల ధరలు ⇒జిల్లా రైతులపై రూ.36 కోట్లకు పైగా భారం ⇒పురుగు మందులు మరింత ప్రియం చేజర్ల (ఆత్మకూరు): వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్ర«భావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలొస్తున్నాయి. జూలై 1నుంచి కొత్త పన్నుల విధానం అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యూరియా సహా రసాయన ఎరువుల ధరలు ఎంత పెరగవచ్చనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఎరువుల ధరలు కొన్ని నెలల క్రితమే కొంతమేర తగ్గాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని రకాల ఎరువులపై వ్యాట్ 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్టీ అమలైతే ఈ పన్ను 12 శాతానికి పెరుగుతుంది. అంటే పన్నుభారం అన్నదాతపై అదనంగా 7 శాతం పడనుంది. యూరియా బస్తాపై దాదాపు రూ.18, మిగిలిన ఎరువులపై బస్తాకు రూ.60 నుంచి రూ.100 వరకు పెరిగే అవకాశం ఉంది. యూరియా భారం రూ.4.10 కోట్లు ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 3,40,077 టన్నుల రసాయన ఎరువులు అవసరమవుతాయి. అన్నిరకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా ఇప్పటివరకు యూరియా ధర మాత్రం పెరగలేదు. ఇది రైతులకు కాస్త ఊరట కలిగిచింది. ప్రస్తుతం యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీ కారణంగా రూ.316కు పెరగనుంది. అంటే బస్తాపై రూ.18 అదనపు భారం పడనుంది. జిల్లాకు 1,13,312 టన్నుల యూరియా ప్రతి ఏడాది అవసరమవుతోంది. టన్నుపై రూ.360 పెరగనుంది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో రైతులపై రూ.4.10 కోట్ల పైగా భారం పడే అవకాశం ఉంది. ఇతర ఎరువుల ధరలు సైతం.. జిల్లాకు డీఏపీ 65,600 టన్నులు, ఎంఓపీ 16,432 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,42,733 టన్నులు అవసరమవుతున్నాయి. 50 కిలోల బస్తాపై గరిష్టంగా రూ.70 వరకు ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఎరువుల కంపెనీల ప్రతినిధులు జిల్లాలోని డీలర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తే రైతులపై జీఎస్టీ భారం ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువుల్లో డైఅమోనియా సల్ఫేట్ (డీఏపీ) ముఖ్యమైనది. ప్రస్తుతం దీనిధర గరిష్టంగా బస్తా రూ.1,155 వరకు ఉంది. భవిష్యత్‌లో రూ.1,221కి చేరే అవకాశం ఉంది. జిల్లాకు డీఏపీ 66,600 టన్నులు అవసరమవుతుండగా, రైతులపై రూ.8.50 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 28.28.0 రకం ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.1,134 ఉంది. ఇది రూ.1,200 దాటే అవకాశం ఉంది. 10.26.26, 14.35.14 ఇలా అన్ని రకాల ఎరువుల ధరలు పెరగనున్నాయి. భారం కానున్న పురుగుమందుల ధరలు రైతులకు పురుగు మందులు సైతం రానున్న రోజుల్లో భారం కానున్నాయి. జిల్లాలో ఏటా దాదాపు 52 వేల టన్నుల పురుగు మందులు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిపై భవిష్యత్‌లో 18 శాతం వరకు జీఎస్టీ వర్తించే అవకాశం ఉంది. వీటితో వివిధ కంపెనీలు బయో ఉత్పత్తులను పెంచే అవకాశం ఉంది. ఓ వైపు పండిన పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కేంద్రం అమల్లోకి తెస్తున్న జీఎస్టీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అవుతుంది. -
పెట్టుబడి కొంత..లాభం కొండంత
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోయాయి. విత్తనాలు, క్రిమిసంహారక మందుల్లో ఏది మంచిదో, ఏది నకిలీదో తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. విచక్షణారహితంగా పురుగుమందులు వాడటం వల్ల ఆర్థికంగా భారమే తప్ప పెద్దగా ఫలితం ఉండని పరిస్థితి. ఆదీగాక దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది. మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యం తెలిసీ తెలియని విత్తనాలు వేయడం, అవి మొలకెత్తకపోవడం, ఒక వేళ మొలకెత్తినా కాపు సరిగా రాకపోవడం లాంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సాగు ఖర్చులు తగ్గించడానికి వివిధ రకాల రాయితీలను అందుబాటులో ఉంచింది. వాటిని సద్వినియోగం చేసుకుంటే రైతులు లాభాలు పొందవచ్చు. విత్తన శుద్ధి తప్పని సరి భూ సంరక్షణ, వ్యాధుల నివారణ చర్యలు తప్పకుండా పాటించాలి. సూటి ఎరువులు(యూరియా, దుక్కిలో సూపర్, విత్తిన తర్వాత పొటాష్) వాడాలి. సూక్ష్మధాతు లోపాలను కచ్చితంగా సవరించాలి. మూస పద్ధతి ఖర్చులకు స్వస్తి చెప్పి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగు మందులు వాడాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. ఖర్చు తగ్గించుకునే మార్గాలు రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులను వాటి మోతాదు మేరకే వాడాలి. భాస్వరం.. మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీన్ని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం లేకపోగా ఖర్చు పెరుగుతుంది. పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. వేపపిండి, యూరియా కలిపి వాడితే పోషకాలు వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందుతాయి. నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది. వ్యవసాయ భూముల్లో ఎక్కువగా జింక్, ఐరన్, బోరాన్, మెగ్నీషియం లోపాలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మిగిలిన ఎరువులను తరచుగా వాడటం వల్ల భూముల్లో ఎక్కువ మోతాదులో నిల్వ ఉన్నాయి. సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను అధిగమించేందుకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా సస్యరక్షణ మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు. పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిపార్సు చేసిన మందును, సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి. ఇవి చేయకండి కాంప్లెక్స్ ఎరువులు వాడితే మన భూముల్లో అంతగా ఫలితం ఉండదు. పైగా వాటి ధరలు కూడా ఎక్కువ. పిచికారీ చేసే మందులు మోతాదుకు మించి వాడటం మానుకోవాలి. ఒక ఎకరాకు సిఫార్సు చేసిన మందుకు ఇష్టారీతిగా నీటిని కలపకూడదు. 200 లీటర్ల నీటిని వాడటం మంచిది. పురుగుమందులు, వ్యాధి మందులు కలిపి (ఉదా : ప్రాఫినోపాస్-ఎక్సాకొనగోట)వాడకూడదు. ఒకేసారి రెండు మూడు మందులను మిశ్రమంగా వాడరాదు(ఉదా : ఇమిడాక్లోఫిడ్, అసిటేట్‌ను వరి, వేరుశనగలో కలిపి వాడుతుంటారు). ఇలా కలిపి వినియోగిస్తే రైతుకు ఖర్చు పెరగడమేకాక మందులు సరిగా పనిచేయవు. ఒక్కోసారి పంటను నాశనం చేస్తాయి. -
ఎరువు.. బరువు
ఒంగోలు టూటౌన్ : సాగుకు ఏటేటా కష్టాలు, నష్టాలే ఎదురవుతున్నాయి. నకిలీ విత్తనాలు, రోజురోజుకూ పెరుగుతున్న ఎరువుల ధరలు, గిట్టుబాటు ధరల లేమితో రైతులు సతమతమవుతున్నారు. గత నాలుగేళ్లలో డీఏపీ మూడొంతులు పెరిగింది. ఈ ఏడు మార్చి నెలలో కేంద్రం యూరియా ధరను అమాంతం పెంచింది. పెరిగిన ధరలకు తోడు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. జిల్లాకు ఏటేటా కోటా మేర ఎరువులు కేటాయించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. నామమాత్రపు కేటాయింపులతో సరిపెడుతుండటంతో వ్యవసాయం భారమవుతోంది. పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతులపై ఏడాదికి రూ.50 కోట్ల వరకు అదనపు భారం పడింది. పురుగు మందులదీ అదే పరిస్థితి... మరోపక్క పురుగు మందుల ధరలు ఏ ఏటికాయేడు పెరిగిపోతున్నాయి. మోనోక్రొటోపాస్ లీటరుకు రూ.50 పెరిగింది. కలుపు మందుల ధరలూ ఇదే రీతిన పెరిగాయి. ఫలితంగా రైతులపై 20 నుంచి 30 శాతం వరకు అదనపు భారం పడింది. లక్ష్యానికి దూరంగా ఖరీఫ్ సాగు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఖరీఫ్ పరిస్థితి తారుమారైంది. ఒక పక్క నైరుతీ రుతుపవనాల జాడలేక.. మరో పక్క ఎల్‌నినో ప్రభావంతో మండుతున్న ఎండలు రైతులను అయోమయంలో పడేశాయి. ఖరీఫ్ లక్ష్యం 2.30 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటి వరకు 19,854 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. వరి 20 హెక్టార్లలో, జొన్న నామమాత్రంగా సాగైంది. పచ్చపెసర 494 హెక్టార్లు, మినుములు 449 హెక్టార్లు, వేసవి పత్తి 14,216 హెక్టార్లలో సాగు చేశారు. అదే విధంగా వేరుశనగ 616 హెక్టార్లు, కూరగాయలు 1,820 హెక్టార్లలో సాగైంది. మొత్తం మీద 19,854 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. అసలే గిట్టుబాటు ధరలు రాక అల్లాడుతున్న రైతులకు మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగి నడ్డి విరిచాయి. -
సాగుకు ధరాఘాతం!
నవాబ్‌పేట్ , న్యూస్‌లైన్: రైతే దేశానికి వెన్నెముక అంటూ ఎన్నికల సమయంలో వేదికలపై నేతలు ఉపన్యాసాలు దంచేస్తుంటారు. అన్ని రంగాలకంటే వ్యవసాయానికి పెద్దపీట వేస్తామంటూ రైతన్నలను ఆశల పల్లకిలో ఊరేగిస్తారు. అధికారంలోకి రాగానే పాలకులు అన్నదాతలను విస్మరిస్తున్నారు. వారి వెతలను పట్టించుకోవడంలేదు. వ్యవసాయ పెట్టుబడి ఏటికేడు రెట్టింపు అవుతుండడంతో రైతు కుదేలవుతున్నాడు. ఎరువులు, విత్తనాల ధరలను అదుపులో ఉంచాలనే స్పహ ప్రభుత్వాలకు రావ డం లేదు. ఇష్టానుసారం ధరలు పెంచుతూ పోతు న్న ప్రైవేటు ఎరువుల సంస్థలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నించడం లేదు. దీంతో ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు దుకాణాల ఎదుట రాత్రీ పగలూ అనే తేడా లేకుండా క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏటా ఇదే తంతు జరుగుతున్నా పాలకులు మాత్రం సకాలంలో ఎరువులను సరఫరా చేయడంలో చిత్తశుద్ధి కనబర్చని దుస్థితి దాపురించింది. గిట్టుబాటు ధరలు లేక, ప్రక తి వైపరీత్యాలతో పం టలు నష్టపోయి అప్పుల బాధతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం సానుభూతి చూపని వారూ ఉన్నారు. పంటలకు నష్టపరిహారం, వృుతుల కుటుంబాలకు నయాపైస ఇప్పించరు. ఇదీ అన్నదాతపై పాలకులు చూపిస్తున్న అవ్యాజప్రేమ. ఎరువులు, విత్తనాల ధరలు పైపైకి... ఎరువులు, విత్తనాల ధరలు అదుపు చేయడంలో పాలకులు నిర్లక్షం వహించడంతో రైతన్నలపై ఆర్థిక భారం పెరిగింది. ఓవైపు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్న రైతులకు పంటల ఉత్పత్తికి ప్రాణదాత లైన ఎరువులు, విత్తనాలు ధరలు పెరగడం అదనపు భారంగా భరిస్తున్నారు. నాలుగేళు ్లగా నిత్యం పెరుగుతున్న ఎరువుల ధరలు రైతులకు కంటతడిపెట్టిస్తున్నాయి. ఎరువులపై ప్రభుత్వం అందజేస్తున్న రాయితీ తగ్గింపులో భాగంగా ఎరువుల కంపెనీలపై నియంత్రణ ఎత్తివేసింది. పరిస్థితులను బట్టి ధరలను పెంచుకునే వెసులుబాటును కంపెనీలకు కల్పించింది. దీంతో కంపెనీలు అడ్డు, అదుపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను సాకుగా చూపుతూ ప్రతిసారి భారీగా ఎరువుల ధరలను పెంచుతూ పోతున్నాయి. ఇక విత్తన కంపెనీలదీ ఇదే బాట.