మహర్షి మహేశ్ యోగి జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో వేద పండితులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లకు ధోతీ కుర్తా డ్రెస్ కోడ్‌గా నిర్ణయించారు. సాధారణంగా క్రికెట్ కామెంటరీ ఇంగ్లీష్, హిందీ,తెలుగు భాషలో వింటూ ఉంటాం. కానీ ఈ టోర్నమెంట్‌లో సంస్కృత భాషలో కామెంటరీ చెప్పడం విశేషం. నాలుగు రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. కాగా వైదిక కుటుంబాలలో క్రీడాస్ఫూర్తి, ప్రాచీన భాషని ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.
విజేతలకు నగదు బహుమతులు, వేద పుస్తకాలు, 100 సంవత్సరాల పంచాంగాన్ని బహుకరించారు. కాగా, సంస్కృత బచావో మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారులు వేదాల ప్రకారం కర్మలు చేసే వారని పేర్కొన్నారు. ఇక ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: టీమిండియాకు మరో బిగ్ షాక్..
Comments
Please login to add a commentAdd a comment