
భోపాల్: పెట్రోధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. కొన్నిరాష్టాల్లో పెట్రోధరలు ఇప్పటికే సెంచరీ దాటేయగా, మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువలో ఉన్నాయి. డీజీల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తమదైన శైలీలో వ్యంగ్యంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కాగా, ఇటీవల భోపాల్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్.. పెట్రోల్ ధరల సమస్యను ప్రత్యేకమైన రీతిలో హైలైట్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్‌కు 5 లీటర్ల పెట్రో క్యాన్‌ను నిర్వాహకులు బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
కాగా, సలావుద్దీన్ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్‌శుక్లా ఆధ్వర్యంలో జరిగింది. అయితే, ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ ముందు నిలబడి పెట్రోల్ రేటు సెంచరి కొట్టేసిందోచ్ అంటూ తన నిరసనను బ్యాట్ పైకెత్తి మరీ చూపించాడు.. కాగా, కరూర్ జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ యజమాని తిరుక్కురుల్ పద్యాలను తప్పులు లేకుండా చదివిన విద్యార్థులకు 1 లీటర్ పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’
Comments
Please login to add a commentAdd a comment