నగరంలో నేటి నుంచి సీనియర్ మహిళల టి20 ఎలైట్ గ్రూప్-ఎ క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ....
జింఖానా, న్యూస్‌లైన్: నగరంలో నేటి నుంచి సీనియర్ మహిళల టి20 ఎలైట్ గ్రూప్-ఎ క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ.... జింఖానా, ఏఓసీ సెంటర్ మైదానాల్లో జరుగుతుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో హైదరాబాద్, ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా, రైల్వేస్ జట్లు పాల్గొంటున్నాయి.
తొలి రోజు మ్యాచ్‌లో హైద రాబాద్... హర్యానాతో జింఖానా మైదానంలో అమీతుమీ తేల్చుకోనుంది. అనంతరం 4వ తేదీన రైల్వేస్‌తో, 5వ తేదీన మహారాష్ట్రతో, 6వ తేదీన ఒరిస్సాతో పోటీపడనుంది.