ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాజీవ్ గాంధీ స్మారక ప్రైజ్‌మనీ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 25 నుంచి అంబర్‌పేట్ ప్లేగ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ధనుంజయ్ గౌడ్ తెలిపారు. ఫతేమైదాన్ క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీజీఎస్‌ఏ సంయుక్త కార్యద ర్శులు పి.యాద గిరి, గౌడ్, సి.రజనీకాంత్‌లతో కలిసి ఆయన ఈ టోర్నీ వివరాలు వెల్లడించారు.
అంబర్‌పేట్ ప్లేగ్రౌండ్ స్పోర్ట్స్ అసోసియేషన్(ఏపీజీఎస్‌ఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో విజేతలకు రూ.50 వేల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈ టోర్నీలో పాల్గొనే ఆసక్తి గల జట్లు తమ ఎంట్రీలను ఈనెల 20లోగా పంపించాలి. ఇతర వివరాలకు ధనుంజయ్ గౌడ్ (98855-55977) లేదా (99666-67798)లను సంప్రదించవచ్చు.
25 నుంచి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ
Published Sun, Nov 10 2013 11:33 PM | Last Updated on Fri, May 25 2018 7:33 PM
Advertisement
Advertisement