ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: తాలిబన్.. ఇప్పుడు ఈ పేరు అఫ్గన్‌లో హడలెత్తిస్తుంది. అఫ్గనిస్తాన్‌లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తాలిబన్ల అరాచక పాలన మొదలవడంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాలిబన్ పాలన మొదలయినప్పటి నుంచి అఫ్గన్‌లో రోజుకో వార్త వెలుగుచూసింది. అలాంటి తాలిబన్ పదం రాజస్తాన్ క్రికెట్‌లో కలకలం రేపింది. విషయంలోకి వెళితే రాజస్తాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని బినియానా గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
చదవండి: ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయానికి 50 ఏళ్లు
ఈ టోర్నమెంట్‌లో ఒక ఊరు 'తాలిబన్' పేరుతో పాల్గొంది. పోఖ్రాన్‌కు 36 కిమీ దూరంలో ఉన్న ఆ ఊరిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. కాగా టోర్నమెంట్‌లో ఒక జట్టు తాలిబన్ పేరు పెట్టుకోవడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన టోర్నీ నిర్వాహకులు తాలిబన్ జట్టును టోర్నీ నుంచి తొలగించి క్షమాపణలు చెప్పుకున్నారు. '' తొలుత తాలిబన్ పేరుతో జట్టు ఉన్నట్లు తాము గుర్తించలేకపోయామని.. మ్యాచ్‌లో భాగంగా స్కోర్‌ను ఎంటర్ చేసే క్రమంలో గమనించాం. వెంటనే సదరు జట్టును టోర్నీ నుంచి తొలగించామని.. దేశానికి క్షమాపణలు చెబుతూ.. లీగ్ తరపున ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని'' నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా నిషేధం విధించిన తాలిబన్ జట్టు టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ ఆడడం విశేషం.
చదవండి: Mark Boucher: 'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి'
Comments
Please login to add a commentAdd a comment