హైదరాబాద్ :
నగర కార్పొరేటర్లు-సినీ స్టార్స్ మధ్య జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఎల్బీస్టేడియంలో ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపాటి హాజరయ్యారు.
సినీస్టార్స్ శ్రీకాంత్, తరుణ్, సంజనతో పాటు పలువురు సినీతారలు ప్రముఖులు రావడంతో.. టోర్నమెంట్‌లో సందడి నెలకొంది. ముందుగా మహిళ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహిళ కార్పొరేటర్స్‌టీం ఫీల్డింగ్ ఎంచుకోగా.. సినీ తార సంజన జట్టు బ్యాటింగ్ చేస్తోంది. సంజన జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తుండటంతో.. కార్పొరేటర్ల జట్టు నీరసించింది. విద్యుత్ ఆదా చేయడానికి ఎల్‌ఈడీ లైట్ల వాడకం పెంచాలని సినీస్టార్స్ చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంటోంది.
అదరగొడుతున్న సినీ తారలు.. నీరసించిన నేతలు
Published Sun, Feb 5 2017 1:20 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM
Advertisement
Advertisement