
విజేతలకు షీల్డును బహూకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కె.నారాయణరావు
పర్లాకిమిడి : గజపతి జిల్లాలోని కాశీనగర్ సమితి అల్లాడ గ్రామపంచాయతీలో నవీన్ సాము స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు కోడూరు నారాయణరావు మంగళవారం ప్రారంభిం చారు. ఈ టోర్నమెంట్‌లో కాశీనగర్, ఖండవ, అల్లాడ, గుణుపురం టీమ్‌లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కాశీనగర్ టీమ్ విన్నర్‌గా, గుణుపురం జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు కాశీనగర్ సమితి చైర్మన్ సీహెచ్ సింహాద్రి, కె.నారాయణరావులు షీల్డులు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శొబొరొ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విన్నర్స్‌కు బహుమతి ప్రదానంచస్తున్న కాశీనగర్ సమితి చైర్మన్ సీహెచ్ సింహాద్రి
Comments
Please login to add a commentAdd a comment