BJD member
-
క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ కాశీనగర్ జట్టు
పర్లాకిమిడి : గజపతి జిల్లాలోని కాశీనగర్ సమితి అల్లాడ గ్రామపంచాయతీలో నవీన్ సాము స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు కోడూరు నారాయణరావు మంగళవారం ప్రారంభిం చారు. ఈ టోర్నమెంట్లో కాశీనగర్, ఖండవ, అల్లాడ, గుణుపురం టీమ్‌లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కాశీనగర్ టీమ్ విన్నర్‌గా, గుణుపురం జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు కాశీనగర్ సమితి చైర్మన్ సీహెచ్ సింహాద్రి, కె.నారాయణరావులు షీల్డులు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శొబొరొ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంతమాట..ఎంతమాట..!
రాయగడ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్‌గొమాంగో సతీమణి హేమగొమాంగో అధికార బీజేడీ పార్టీలో ఉంటూ అదే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆమె బీజేడీలో ఉన్నప్పటికీ పార్టీలో ఆమెకు ఎటువంటి ప్రాధాన్యం ఇంతవరకు కల్పించలేదు. హేమగొమాం గో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో విఫలం కాగా పార్టీలో కూడా ఆమె స్థితిని నిలబెట్టుకోలేక పోయారు. పార్టీ కార్యకర్తలు కూడా నేటివరకు ఆమెకు దూరంగా ఉండేవారు. ఈ సమయంలో హేమగొమాంగో తన మద్దతు దారులతో కలిసి గుణుపురంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బీజేడీ పార్టీని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ అవినీతి పాలనపై దుమ్మెత్తి పోశారు. ఈ ఘటన హఠాత్తుగా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అవినీతి మయమైన పాలన సమావేశంలో హేమగొమాంగో మాట్లాడుతూ బీజేడీ ముఖ్యమంత్రి పాలన అవినీతి మయంగా మారిందని పార్టీ కి సంబంధించి విభిన్న అభివృద్ధి పనులు కోరుతూ ఇచ్చే వినతిపత్రాలు బుట్ట దాఖలవుతున్నాయని ఆరోపించారు. సీఎం నవీన్‌పట్నాయక్ తన మాట¯లను వినిపించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించడం లేదని, పేరుకే ముఖ్యమంత్రి అయినా కార్యక్రమాలను ఐఏఎస్ అధికారి పాండ్యన్ చూస్తున్నారని, పాండ్యన్‌కు భారీగా డబ్బు ముట్టజెప్పనిదే పనులు జరగడం లేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికార బీజేడీ పార్టీ రాయగడ జిల్లా నాయకుడు భగీరథి మండంగి హత్య కేసు, టికిరిలో ఉపాధ్యాయురాలు ఈతిశ్రీప్రధాన్ హత్యకేసు, కుందులిలో ఆశ్రమ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి, ఆత్మహత్య కేసులో నేటికీ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగలేదని విమర్శించారు. పెరిగిపోయిన దాదాగిరి బీజేడీ పార్టీ అవినీతి కూపంలా తయారైందని, పద్మపూర్‌లో ప్రజలు తాగునీటికి అనేక ఇబ్బందులు పడుతున్నా ఏ సమస్యను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం బీజేడీలో దాదాగిరి, గుండాగిరి పెరిగిపోయింది. బీజేడీని వ్యతిరేకించే వారిని హత్య చేయడం, లేదా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించి గద్దె దించాలని, రాయగడ జిల్లాలో బీజేడీ వ్యతిరేక పోరాటాలకు తనకు మద్దతుదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అయితే ప్రస్తుతం రాయగడ జిల్లాలో ఉల్క కుటుంబాల రాజకీయాలకు గొమాంగోల రాజకీయాలకు తెరపడింది. ప్రజల మద్దతు కానీ ఏ పార్టీ మద్దతు కానీ వారికి లేదు. ఇప్పటికే తెరమరుగైన వారు ఎన్నికల ముందుల ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేడీ పార్టీలో ఆమె పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. -
అస్కాలో హత్య
బరంపురం: గంజాం జిల్లా హెడ్‌క్వార్టర్ ఛత్రపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్ఏసీ కౌన్సిలర్, అధికార పార్టీ బీజేడీ యువజన నాయకుడు లక్ష్మీదత్త ప్రధాన్ హత్యను జిల్లా ప్రజలు మరువక ముందే జిల్లాలోని అస్కాలో మరో బీజేడీ యువజన నాయకుడు ప్రతాప్ చంద్ర పోలాయి హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా మరోసారి సంచలనం రేపింది. పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అస్కా నుంచి బరంపురానికి యువజన నాయకుడు ప్రతాప్ చంద్ర పోలాయి బస్సులో వస్తున్న సమయంలో పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొరంజయి జంక్షన్లో గుర్తు తెలియని దుండగులు బస్సులో చొరబడి ప్రతాప్ చంద్ర పోలాయిపై తుపాకీలతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ప్రతాప్ చంద్ర పోలాయిని తోటి ప్రయాణికులు తొలుత అస్కా గోష్ఠి ఆరోగ్య సేవా కేంద్రానికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో వెంటనే బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం ప్రతాప్ చంద్ర పోలాయి మృతి చెందినట్లు నిర్ధారించారు. మద్యం దుకాణం వివాదమే కారణమా? ప్రతాప్ చంద్ర పోలయి అస్కా ఎన్ఏసీలో ని 13వ వార్డుకు చెందిన బీజేడీ కౌన్సిలర్ బబితా పోలాయి భర్త. ప్రతాప్ చంద్ర పోలాయి అస్కాలోని పకలపల్లిలో నివాసం ఉంటున్నారు. మద్యం వ్యాపారం వివాదంలో ప్రతాప్ చంద్ర పోలాయి హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సమాచారం. అస్కా బస్‌స్టాండ్‌లో నెలకొల్పిన మద్యం దుకాణంలో ప్రతాప్ చంద్ర పోలాయి పార్టనర్. అయితే గత కొద్ది రోజుల నుంచి మద్యం దుకాణం భాగస్వాముల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో ప్రతాప్ చంద్ర పోలాయి హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అస్కా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. -
దేశంలో రెండు టైమ్జోన్లు!
న్యూఢిల్లీ: దేశంలో రెండు వేర్వేరు టైమ్జోన్ల అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం బుధవారం లోక్‌సభలో తెలిపింది. బీజేడీ సభ్యుడు బి.మెహతబ్ ఈ విషయాన్ని సభలో లేవనెత్తుతూ దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సూర్యోదయమయ్యే సమయాల్లో సుమారు 2 గంటల వ్యత్యాసం ఉందన్నారు. ‘అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉదయం 4 గంటలకు సూర్యోదయమైతే కార్యాలయాలు 10 గంటలకు తెరుచుకుంటున్నాయి. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ దీనిపై గతంలో అధ్యయనం కూడా జరిపింది’ అని వెల్లడించారు. దేశంలో రెండు భిన్న టైమ్ జోన్లు అమలుచేస్తే 2.7 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, కార్యాలయాల పనివేళలపై కేంద్రమే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రామాణిక సమయాన్ని నిర్వచిస్తున్న 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని అరగంట ముందుకు జరిపితే అస్సాం–పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలోని 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రామాణికం కానుందని తెలిపారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ స్పందిస్తూ.. మెహతబ్ సూచనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని తెలిపారు.