odisaa
-
నృత్య ప్రపంచంలో ఆమె ఓ అద్భుత శిఖరం..! ఏకంగా రాజ్యసభ..
పద్దెనిమిదేళ్ళ వయసులో ఇంటి నుంచి పారిపోయి ప్రపంచ స్థాయిని అందుకున్న భరతనాట్య నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్ ఓ అద్భుత శిఖరం. ఆమె ఎనిమిది పదుల జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారత శాస్త్రీయ నృత్య ప్రపంచంలో సోనాల్ మాన్ సింగ్ పేరు మాత్రమే కాదు ఆమె ధిక్కరణ, ధైర్యం, అభిరుచికి నిలువెత్తు చిహ్నం. చిన్న నాటి నుంచి ఆమె నృత్యం కేవలం ప్రదర్శనగా మాత్రమే ఉండాలనుకోలేదు. నృత్యం ద్వారా జీవితానికి నిజమైన అర్థాన్ని కనుక్కోవాలనుకుంది. ఆధ్యాత్మిక ప్రయాణం, సామాజిక నిబంధనలను సవాల్ చేయడానికి నృత్యం ఒక మార్గంగా భావించింది. ‘‘నాకు 15, 20, 50, 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ప్రదర్శనలు ఇస్తున్నాను అని చెప్పేదాన్ని. కానీ డ్యాన్స్ నాకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారింది‘ అని 80 ఏళ్ల ఈ భారత శాస్త్రీయ నృత్యకారిణి, భరతనాట్యం, ఒడిస్సీ నృత్య గురువు సోనాల్ మాన్సింగ్ వివరిస్తారు. పద్మ భూషణ్ (1992), పద్మ విభూషణ్ (2003) గ్రహీత, పార్లమెంటు, రాజ్యసభ సభ్యురాలు కావడానికి నామినేట్ అయిన సోనాల్ ప్రతి నృత్య అడుగు మనకు ఓ పాఠంగా అవుతుంది.‘కృష్ణ’ ప్రదర్శన మాత్రమే కాదుడ్యాన్స్ క్లాస్ అంటే నాకు ప్రాణం. అందుకే డ్యాన్స్‌తోపాటు వృత్తిని కొనసాగించమని అడిగితే ఇంటి నుంచి పారిపోయి, బెంగళూరుకు వెళ్లి, అక్కడ నాట్య గురువుల ఇంట్లో ఆశ్రయం పొందాను. ప్రొఫెసర్ యు.ఎస్.కృష్ణారావు, చంద్రభాగ దేవిల వద్ద శిక్షణ పొందాను. ఇటీవల ఇండియా హాబిటాట్ సెంటర్లో ’కృష్ణ’ అనే నాట్య కథను ప్రదర్శించాను. దీని గురించి ఎందుకు చెబుతునాన్ననంటే ఈ ఆలోచన నా చిన్నప్పటి నుంచి ఉండేది. చదివిన సాహిత్యం.. ముఖ్యంగా మన పురాణాలు, మహాభారతం నుంచి వచ్చింది. ’కృష్ణ’ అన్నింటి మిశ్రమం.ప్రమాదం జరిగినా ఎదురీతే! చిన్ననాటిఋ నుంచి వేషం వేసుకుని దరువులకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టేదాన్ని. నాలుగేళ్ల వయసులో క్లాసికల్ మణిపురి డ్యాన్స్ కాస్ట్యూమ్ ధరించి డ్యాన్స్ చేశాను. భరతనాట్యం ప్రశాంతతను ఇచ్చేది. 1974లో జర్మనీలో కారు ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయి. ఇకపై డ్యాన్స్ చేయలేనని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ, పట్టువదలలేదు. ఫిజియోథెరపీ సెషన్ల తర్వాత ఏడాదిలోనే ప్రదర్శన ఇచ్చాను. డ్యాన్స్ నుంచి మాత్రమే శక్తిని పొందుతాను. నా జీవితంలో నేను ఎప్పుడూ డిప్రెషన్ గా భావించలేదు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.స్త్రీత్వం గురించి గర్వంఒంటరిగా ఉన్న అమ్మాయి తన ఇంటిని వదిలిపెట్టి నృత్యాన్ని నమ్ముకొని, ప్రదర్శనలూ ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటే ఎవరూ నమ్మరు. క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడూ స్త్రీత్వానికి సంబంధించినది. పురుషులు ఎప్పుడూ ఉపాధ్యాయులు, మహిళలు నృత్యకారులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పురుషులు ప్రదర్శనలు ఇవ్వడానికి వస్తున్నారు. వారేం చేసినా నృత్యంలో స్త్రీలే రాజ్యమేలారు. అందుకే నా నృత్యాల్లో ‘పంచకన్య’, ’ద్రౌపది’, ’మీరా’. స్త్రీ శక్తికి సంబంధించినవి ఉంటాయి. ’ నృత్యం నేర్చుకోవాలని తపించేవారు ఎప్పుడూ వ్యక్తిగతంగానే గురువును వెతకాలని’ అంటూ నృత్య పాఠాలను వివరిస్తుంది సోనాలి మాన్సింగ్. (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! ) -
బాలాసోర్ రియల్ హీరోలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎక్కడో దూరాన ఉంటూ, ఈ వార్త విని తల్లడిల్లిపోతున్నవారి సంగతి అలా ఉంచితే, అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారి మనోభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. రైలు ప్రమాద క్షతగాత్రులకు సహాయం అందించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న యువకులు మీడియాతో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో తాము ఎక్కడ కాలు మోపినా మాంసపు ముద్దలు, తెగిపడిన అవయవాలు కనిపిస్తున్నాయన్నారు. కొందరు క్షతగాత్రులు తమ ప్రాణాలు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అరుపులు విన్నవెంటనే తాము పరిగెత్తుకుంటూ వెళ్లి బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. అలాగే కొన్ని వందల మృతదేహాలను వెలికితీశామన్నారు. బాధితులు వీరిని రియల్ హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి రియల్ హీరోలలో ఒకరైన 38 ఏళ్ల తుకన్ దాస్ మాట్లాడుతూ తాను ఇక్కడకు ఒక మందిరం నిర్మాణ పనుల నిమిత్తం వచ్చానని, రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తాను ఒక బోగీలోకి దూరి వెళ్లి చూడగా.. 60 మృతదేహాలు కనిపించాయని, అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారని అన్నారు. వెంటనే తాను వీలైనంతమందికి సాయం అందించానని తెలిపారు. ఇదేవిధంగా స్థానికంగా ఉంటున్న కొందరు యువకులు రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ తాము 150కిపైగా మృతదేహాలను బయటకు తెచ్చామన్నారు. అలాగే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 288 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక కార్యకలాపలు కొనసాగుతున్నాయి. -
ప్రమాద ఘటనలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
కవచ్ ఏమైంది..?
-
క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ కాశీనగర్ జట్టు
పర్లాకిమిడి : గజపతి జిల్లాలోని కాశీనగర్ సమితి అల్లాడ గ్రామపంచాయతీలో నవీన్ సాము స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను మాజీఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు కోడూరు నారాయణరావు మంగళవారం ప్రారంభిం చారు. ఈ టోర్నమెంట్లో కాశీనగర్, ఖండవ, అల్లాడ, గుణుపురం టీమ్‌లు పాల్గొన్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో కాశీనగర్ టీమ్ విన్నర్‌గా, గుణుపురం జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు కాశీనగర్ సమితి చైర్మన్ సీహెచ్ సింహాద్రి, కె.నారాయణరావులు షీల్డులు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శొబొరొ, సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎక్సైజ్ అధికారులను స్తంభాలకు కట్టేసి...
సాక్షి, బరంపురం: గంజా జిల్లాలో అక్రమంగా నడుస్తున్న నాటు సారా దుకాణాలపై దాడికి వెళ్లిన ఎక్సైజ్ స్క్వాడ్‌పై గ్రామస్తులు ఎదురు దాడి చేసి వారిని చితకబాదారు. అంతటితో ఆగకుండా వారిని విద్యుత్ స్తంభాలకు కట్టేసి వారి యూనిఫారాలు విప్పి నిప్పుపెట్టి కాల్చివేశారు. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. గాయాలపాలైన ఎక్సైజ్ అధికారులకు తొలుత పత్రపూర్ సమితి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని పత్రపూర్ సమితి, జరడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మోసనిబడా గ్రామంలో కొద్ది రోజులుగా అక్రమ సారా దుకాణాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ స్క్వాడ్ ఆదివారం తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఎక్సైజ్ స్క్వాడ్ అధికారులపై గ్రామస్తులు ముకుమ్మడిగా దాడికి దిగారు. అధికారుల యూనిఫాం విప్పేసి వారిని విద్యుత్ స్తంభాలకు కట్టి చితకబాదారు. ఆగ్రహించిన జనం విద్యుత్ అధికారుల యూనిఫాంలకు నిప్పుపెట్టి తగులబెట్టారు. గ్రామంలో పోలీస్ బలగాలు ఈ విషాద సంఘటనలో నలుగురు అధికారులతో పాటు 10 మంది సిబ్బంది గాయపడ్డారు. మరో వైపు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నట్లు జరడ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి చెప్పారు. ప్రస్తుతం మోసనిబడా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో అదనపు పోలీసు బలగాలు మోహరించి శాంతి భద్రతలు పరివేక్షిస్తున్నారు. -
ఒడిశాలో చాతక పక్షి ప్రత్యక్షం!
బెర్హంపూర్ (ఒడిశా): వర్షాలకు భవిష్య సూచకంగా భావించే చాతక పక్షి ఒడిశాలో ప్రత్యక్షం కావడంతో స్థానికుల్లో వర్షాల రాకపై ఆశలు మరింత పెరిగాయి. ఒడిశాకు చాతక పక్షి వలస వచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు సమీపించినట్లేనని పక్షి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. రుతుపవనాల పక్షి, వానకోయిలగా కూడా పిలిచే ఈ పక్షి దక్షిణాఫ్రికా నుంచి ఏటా నైరుతి రుతుపవనాలకు ఐదు నుంచి ఏడు రోజుల ముందుగానే ఒడిశాకు వలస వస్తుందని ప్రముఖ శాస్త్రవేత్త యూఎన్ దేవ్ గురువారం వెల్లడించారు. భువనేశ్వర్‌లోని బెర్హంపూర్ ఏరియాలో తాము చాతక పక్షిని చూశామని ఆయన తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలోకి రాజా ఉత్సవం సమయంలో ఈ పక్షి వస్తుందని, ఈసారి కాస్త ముందుగానే వచ్చిందన్నారు. చాతక పక్షికి, వానలకు సంబంధం ఉన్నట్లు మహాభారతంలో, కాళిదాసు మేఘసందేశంలో కూడా ఉందని, అలాగే ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిం చారని దేవ్ తెలిపారు. కాగా, ఒడి శాలోకి రుతుపవనాలు జూన్ 15న లేదా 16న ప్రవేశించవచ్చని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ ఎస్డీ సాహూ పేర్కొన్నారు. -
ఏపీ సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌సహా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు కదలికలు ఊపందుకున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. వారికి అందిన తాజా సమాచారం మేరకు రాష్ట్ర సరిహద్దుల్లో నక్సల్స్ కదలికలు బాగా పెరిగినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలోని సీమాం ధ్రలో సమైక్య ఉద్యమ బందోబస్తులో పోలీసులు బిజీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న నక్సల్స్ తమ కార్యకలాపాలు పెంచి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా 4 రాష్ట్రాల సరిహద్దుల్లోనూ పారామిలటరీ, గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇదిలావుంటే, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జిల్లా కలెక్టర్, పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర గురువారం పేలింది. ఇలాంటి మందుపాతరల ను మన రాష్ట్ర సరిహద్దుల్లో కూడా పెద్ద సంఖ్యలోనే అమర్చినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. పారామిలటరీ బలగాలను లక్ష్యంగా చేసుకుని వీటిని అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నక్సల్స్ కోసం వేట ముమ్మరం చేశారు.