పద్దెనిమిదేళ్ళ వయసులో ఇంటి నుంచి పారిపోయి ప్రపంచ స్థాయిని అందుకున్న భరతనాట్య నృత్యకారిణి సోనాల్ మాన్‌సింగ్ ఓ అద్భుత శిఖరం. ఆమె ఎనిమిది పదుల జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భారత శాస్త్రీయ నృత్య ప్రపంచంలో సోనాల్ మాన్ సింగ్ పేరు మాత్రమే కాదు ఆమె ధిక్కరణ, ధైర్యం, అభిరుచికి నిలువెత్తు చిహ్నం. చిన్న నాటి నుంచి ఆమె నృత్యం కేవలం ప్రదర్శనగా మాత్రమే ఉండాలనుకోలేదు. నృత్యం ద్వారా జీవితానికి నిజమైన అర్థాన్ని కనుక్కోవాలనుకుంది. ఆధ్యాత్మిక ప్రయాణం, సామాజిక నిబంధనలను సవాల్ చేయడానికి నృత్యం ఒక మార్గంగా భావించింది.
‘‘నాకు 15, 20, 50, 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే ప్రదర్శనలు ఇస్తున్నాను అని చెప్పేదాన్ని. కానీ డ్యాన్స్ నాకు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారింది‘ అని 80 ఏళ్ల ఈ భారత శాస్త్రీయ నృత్యకారిణి, భరతనాట్యం, ఒడిస్సీ నృత్య గురువు సోనాల్ మాన్‌సింగ్ వివరిస్తారు. పద్మ భూషణ్ (1992), పద్మ విభూషణ్ (2003) గ్రహీత, పార్లమెంటు, రాజ్యసభ సభ్యురాలు కావడానికి నామినేట్ అయిన సోనాల్ ప్రతి నృత్య అడుగు మనకు ఓ పాఠంగా అవుతుంది.
‘కృష్ణ’ ప్రదర్శన మాత్రమే కాదు
డ్యాన్స్ క్లాస్ అంటే నాకు ప్రాణం. అందుకే డ్యాన్స్‌తోపాటు వృత్తిని కొనసాగించమని అడిగితే ఇంటి నుంచి పారిపోయి, బెంగళూరుకు వెళ్లి, అక్కడ నాట్య గురువుల ఇంట్లో ఆశ్రయం పొందాను. ప్రొఫెసర్ యు.ఎస్.కృష్ణారావు, చంద్రభాగ దేవిల వద్ద శిక్షణ పొందాను. ఇటీవల ఇండియా హాబిటాట్ సెంటర్‌లో ’కృష్ణ’ అనే నాట్య కథను ప్రదర్శించాను. దీని గురించి ఎందుకు చెబుతునాన్ననంటే ఈ ఆలోచన నా చిన్నప్పటి నుంచి ఉండేది. చదివిన సాహిత్యం.. ముఖ్యంగా మన పురాణాలు, మహాభారతం నుంచి వచ్చింది. ’కృష్ణ’ అన్నింటి మిశ్రమం.
ప్రమాదం జరిగినా ఎదురీతే!
చిన్ననాటిఋ నుంచి వేషం వేసుకుని దరువులకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టేదాన్ని. నాలుగేళ్ల వయసులో క్లాసికల్ మణిపురి డ్యాన్స్ కాస్ట్యూమ్ ధరించి డ్యాన్స్ చేశాను. భరతనాట్యం ప్రశాంతతను ఇచ్చేది. 1974లో జర్మనీలో కారు ప్రమాదంలో చాలా గాయాలు అయ్యాయి. ఇకపై డ్యాన్స్ చేయలేనని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ, పట్టువదలలేదు. ఫిజియోథెరపీ సెషన్ల తర్వాత ఏడాదిలోనే ప్రదర్శన ఇచ్చాను. డ్యాన్స్ నుంచి మాత్రమే శక్తిని పొందుతాను. నా జీవితంలో నేను ఎప్పుడూ డిప్రెషన్ గా భావించలేదు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.
స్త్రీత్వం గురించి గర్వం
ఒంటరిగా ఉన్న అమ్మాయి తన ఇంటిని వదిలిపెట్టి నృత్యాన్ని నమ్ముకొని, ప్రదర్శనలూ ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటే ఎవరూ నమ్మరు. క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడూ స్త్రీత్వానికి సంబంధించినది. పురుషులు ఎప్పుడూ ఉపాధ్యాయులు, మహిళలు నృత్యకారులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది పురుషులు ప్రదర్శనలు ఇవ్వడానికి వస్తున్నారు. వారేం చేసినా నృత్యంలో స్త్రీలే రాజ్యమేలారు. అందుకే నా నృత్యాల్లో ‘పంచకన్య’, ’ద్రౌపది’, ’మీరా’. స్త్రీ శక్తికి సంబంధించినవి ఉంటాయి. ’ నృత్యం నేర్చుకోవాలని తపించేవారు ఎప్పుడూ వ్యక్తిగతంగానే గురువును వెతకాలని’ అంటూ నృత్య పాఠాలను వివరిస్తుంది సోనాలి మాన్‌సింగ్.
(చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..! )
Comments
Please login to add a commentAdd a comment