పట్నా: బాలికల విద్య కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకున్న ఆడపిల్లలు పలు రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అయితే బాలికల విద్య కోసం ఒక ఎంపీ తన ఐదేళ్ల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు.
బీహార్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శాంభవి చౌదరి తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే జీతాన్ని బాలికల విద్యకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) ఎంపీ శాంభవి చౌదరి తన లోక్‌సభ నియోజకవర్గం సమస్తిపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తన మొత్తం వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శాంభవిని అభినందించారు. అలాగే ఆమెను ఎన్‌డీఏ అభ్యర్థిగా ఎంపికచేశారు. శాంభవి చౌదరి తన పదవీకాలంలో వచ్చే జీతాన్ని ‘పఢేగా సమస్తిపూర్ తో బఢేగా సమస్తిపూర్’ అనే ప్రచారం ఉద్యమంలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. తనకు ప్రతినెలా జీతం రూపంలో వచ్చే డబ్బును ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే..
Comments
Please login to add a commentAdd a comment