మహబూబ్‌నగర్ క్రీడలు, న్యూస్‌లైన్: క్రీడాకారులు నిత్యసాధన చేస్తే విజయం తథ్యమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. ఆటల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా స్టేడియంలో శుక్రవారం నుంచి నాలుగురోజులపాటు జరగే జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడ లు శారీరక దేహదారుఢ్యాన్ని పెంచుతాయని, విద్యతోపాటు ఆటలు ము ఖ్యమేనని అన్నారు. క్రీడాకారులు త మ నైపుణ్యాన్ని పెంచుకుని జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఇదేస్ఫూర్తితో ఏటా క్రీడాపోటీలను ని ర్వహించాలని కోరారు. డీఈఓ చంద్రమోహన్ మాట్లాడుతూ..మహిళాక్రీడ లు కూడా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ శర్మన్ క్రీడాపతాకాన్ని ఆవిష్కరించి బెలూన్లను గాల్లోకి వది లారు. ఈ సందర్భంగా దేవరకద్ర డే ర్ డెవిల్స్- జ్ఞానభారతి సూపర్‌కింగ్స్ మొదటిమ్యాచ్‌ను ఆయన బ్యాటింగ్ చేసి ప్రారంభించారు.
అలరించిన సాంస్కృతిక
కార్యక్రమాలు
క్రికెట్‌టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కా ర్యక్రమాలు అలరించాయి. ఆకృతి స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన లం బాడి, పంచవటి విద్యార్థుల థింసా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా ఒలింపిక్ సం ఘం చైర్మన్ కేఎస్ రవికుమార్, డి ప్యూటీ ఈఓ గోవిందరాజులు, ప్రము ఖ విద్యావేత్త జలజం సత్యనారాయణ ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ కుమార్, శ్రీనివాసులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులు స్ఫూర్తిని చాటాలి
Published Sat, Feb 15 2014 3:05 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement