సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఆర్ చాంపియన్స్ ట్రోఫీ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజి క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడమ్స్ కాలేజి శుభారంభం చేసింది. వరంగల్‌లోని ఎస్‌ఆర్ కాలేజి గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆడమ్స్ జట్టు 4 వికెట్ల తేడాతో నిట్ (వరంగల్) జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఖాజా 36, జీషాన్ 23 పరుగులు చేశారు.
తర్వాత ఆడమ్స్ కాలేజి జట్టు 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసి గెలుపొందింది. సతీశ్ 43 (నాటౌట్), మహేశ్ 17 పరుగులు చేశారు. అజేయంగా రాణించిన సతీశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ ఎ. వరదా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈవెంట్‌ను ప్రారంభించారు. ఇందులో అకాడమీ డెరైక్టర్ పి. వెంకటేశ్వర్లు, ఎస్‌ఆర్ కాలేజి ప్రిన్సిపాల్ సి.వి.గురు రావు, ఎ.వి.వి.సుధాకర్, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
కిట్స్-కరీంనగర్: 112 (నితిన్ 19, పృథ్వీ 11; వినోద్ 4/4), ప్రసాద్ ఇంజినీరింగ్ కాలేజి- జనగాం: 113/8 (తిరుపతి 19, రమేశ్ 14).
జీఎన్‌ఐటీ- ఇబ్రహీంపట్నం: 102/8 (మనోజ్ 30; రవితేజ 4/14), ఎస్‌బీఐటీ- ఖమ్మం: 77 (చైతన్య 12; శివ 4/26).
ఎంజేసీఈటీ-హైదరాబాద్: 179/6 (అఫ్జల్ 62, అఫ్రిజ్ 55), కిట్స్-వరంగల్: 95 (సూర్య 30, నాయక్ 30).
ఆడమ్స్ కాలేజి శుభారంభం
Published Sun, Jan 5 2014 12:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement