జింఖానా, న్యూస్‌లైన్: జేఎన్‌టీయూహెచ్ జోన్-ఏ క్రికెట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెయింట్ పీటర్స్ కాలేజి 8 వికెట్ల తేడాతో వర్ధమాన్ కాలేజిపై గెలుపొందింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వర్ధమాన్ కాలేజి 9 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. శ్రీకాంత్ 23 పరుగులు చేశాడు. సెయింట్ పీటర్స్ బౌలర్ అజయ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన సెయింట్ పీటర్స్ కాలేజి రెండే వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి నెగ్గింది.
సుమిత్ (61) అర్ధ సెంచరీతో రాణించాడు. మరో మ్యాచ్‌లో టర్బో ఇంజినీరింగ్ కాలేజి (టీఐఎస్‌టీ) 7 వికెట్ల తేడాతో జేఎన్‌టీయూహెచ్‌పై గెలిచింది. మొదట బరిలోకి దిగిన టీఐఎస్‌టీ 80 పరుగులు చేసి ఆలౌటైంది. సచిన్ 18 పరుగులు చేశాడు. జేఎన్‌టీయూహెచ్ బౌలర్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన జేఎన్‌టీయూహెచ్ మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి గెలిచింది. అమీర్ (30) ఫర్వాలేదనిపించాడు. టీఐఎస్‌టీ బౌలర్ 3 వికెట్లు పడగొట్టాడు.
సెయింట్ పీటర్స్ విజయం
Published Fri, Jan 31 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
Advertisement
Advertisement