Teegala Krishna Reddy Unhappy with KCR BRS, Know Reason Behind Why - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ రాజకీయ సమకాలికుడ్ని.. టికెట్‌ ఇవ్వకుంటే కారు దిగిపోతా!: టీకేఆర్‌

Published Wed, Jun 28 2023 9:05 AM | Last Updated on Wed, Jun 28 2023 11:51 AM

Teegala Krishna Reddy Unhappy with KCR BRS - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ​.. రాజకీయ అసంతృప్తులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా.. మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ మాజీ మేయర్‌, బీఆర్‌ఎస్‌ లీడర్‌ తీగల కృష్ణారెడ్డి పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.  వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే గనుక బీఆర్‌ఎస్‌ను వీడడం ఖాయమని స్పష్టంచేశారాయన.

మా కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉంది. అందుకే ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవన్నట్లు మాట్లాడుతున్నారు. తిరిగి మేం కూడా విమర్శిస్తే బాగుండదు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితారెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్‌ తప్పుచేశారు.  నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా.

.. ఉద్యమంలో పనిచేసిన సీనియర్‌ నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారు. వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. లేకుంటే మేం కూడా మా దారి మేం చూసుకుంటాం అని టీకేఆర్‌ స్పష్టం చేశారు. అలాగే.. కాంగ్రెస్‌గానీ, మరేయితర పార్టీ నుంచిగానీ ఆహ్వానం అందిందా? అనే ప్రశ్నకు.. ఎవరూ సంప్రదించలేదని తెలిపారాయన. 

ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌కి కొత్త గుబులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement