Maheswaram constituency
-
‘కేసీఆర్ సమకాలీకుడ్ని.. నాకే టికెట్ ఇవ్వరా?’
సాక్షి, రంగారెడ్డి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ అసంతృప్తులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా.. మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ మాజీ మేయర్, బీఆర్ఎస్ లీడర్ తీగల కృష్ణారెడ్డి పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే గనుక బీఆర్ఎస్ను వీడడం ఖాయమని స్పష్టంచేశారాయన. మా కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉంది. అందుకే ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవన్నట్లు మాట్లాడుతున్నారు. తిరిగి మేం కూడా విమర్శిస్తే బాగుండదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితారెడ్డిని పార్టీలోకి తీసుకొని సీఎం కేసీఆర్ తప్పుచేశారు. నేను కేసీఆర్‌తో సమానంగా రాజకీయాల్లో ఉన్నా. .. ఉద్యమంలో పనిచేసిన సీనియర్ నాయకులు చాలామంది పార్టీని వీడుతున్నారు. వారందర్నీ పిలిపించి మాట్లాడాలి. లేకుంటే మేం కూడా మా దారి మేం చూసుకుంటాం అని టీకేఆర్ స్పష్టం చేశారు. అలాగే.. కాంగ్రెస్‌గానీ, మరేయితర పార్టీ నుంచిగానీ ఆహ్వానం అందిందా? అనే ప్రశ్నకు.. ఎవరూ సంప్రదించలేదని తెలిపారాయన. ఇదీ చదవండి: బీఆర్ఎస్కి కొత్త గుబులు -
నర్సింహారెడ్డికి మొండిచేయి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా సారథి బొక్క నర్సింహారెడ్డికి మొండిచేయి ఎదురైంది. మహేశ్వరం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు చివరకు టికెట్ దక్కలేదు. పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసిన ఐదో జాబితాలోనూ ఆయన పేరు లేదు. మహేశ్వరం సెగ్మెంట్‌కు అందెల శ్రీరాములు యాదవ్ పేరును ఖరారు చేశారు. సామాజిక సమీకరణలు నేపథ్యంలో ఆ సీటు బీసీలకు కేటాయించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్థానంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడితోపాటు సీనియర్ నేతలు శ్రీరాములు, శంకర్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నర్సింహారెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినా అధికారికంగా ప్రకటించలేదు. శ్రీరాములుకు టికెట్ ఇవ్వాలని సంఘ్ పరివార్ పెద్దలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం సెగ్మెంట్ అభ్యర్థి ఎవరనేదానిపై అయోమయం నెలకొంది. ఇలా ఐదో జాబితా వరకు ఈ విషయంలో గోప్యత పాటించారు. ప్రధానంగా నర్సింహారెడ్డి, శ్రీరాములు మధ్యనే పోటీ నెలకొంది. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డికి బీజేపీ నాయకత్వం అప్పగించింది. రంగంలోకి దిగిన కిషన్‌రెడ్డి శనివారం రాత్రి నర్సింహారెడ్డి, శ్రీరాములుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చివరకు శ్రీరాములు పేరు ఖరారుతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. కొన్ని కారణా వల్ల శ్రీరాములకు టికెట్ ఇవ్వా ల్సి వస్తుందని బీజేపీ జిల్లా సారథికి కిషన్ రెడ్డి నచ్చజెప్పా రు. టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించి భంగ పడ్డ ఆయనకు భవిష్యత్‌లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
మహేశ్వరం, మలక్‌పేటలలో పర్యటించనున్న కేసీఆర్
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లో బుధవారం పర్యటించనున్నారని ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. సభ కోసం సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. ముప్పై ఏళ్లుగా ఎన్టీఆర్నగర్ రెగ్యులరైజేషన్ సమస్య పెండింగ్‌లో ఉందని, ఆ బస్తీ వాసులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా మలక్‌పేట నియోజకవర్గం చావణీ డివిజన్లోని పిల్లిగుడిసెల ప్రాంతానికి ముఖ్యమంత్రి బుధవారం రానున్నారు. ఆ ప్రాంతంలోని సయీద్ ఫంక్షన్ హాలులో పిల్లగుడిసెల నివాసితులతో ఆయన సమావేశమై సమస్యలను తెలుసుకుంటారు.