టీఆర్ఎస్లోకి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు! | telangana tdp mlas to join trs | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లోకి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు!

Published Thu, Oct 9 2014 4:41 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

టీఆర్ఎస్లోకి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు! - Sakshi

టీఆర్ఎస్లోకి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు!

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి షాక్ తగలింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు త్వరలో కారు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. కాగా త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి చెప్పారు.

 

భేటీ అనంతరం రాజేంద్ర నగర్  ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ వీడే వార్తలు అవాస్తవం అన్నారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాల మేరకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. కేసీఆర్ ను కలిసేందుకే ఇతర ఎమ్మెల్యేలతో వెళ్లినట్లు ప్రకాష్ గౌడ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement