
తీగల కృష్ణారెడ్డికి చంద్రబాబు బుజ్జగింపు
హైదరాబాద్: గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. మంగళవారం చంద్రబాడుతో తీగల సమావేశమయ్యారు. పార్టీ మారొద్దని ఈ సందర్భంగా తీగలకు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని హామీయిచ్చినట్టు తెలుస్తోంది.
అయితే పార్టీ మారేందుకే తీగల మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై మంగళవారం ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని తన అనుచరులకు తీగల కృష్ణారెడ్డి ఫోన్ చేశారు.