జింఖానా, న్యూస్‌లైన్: ఎస్‌ఆర్ చాంపియన్స్ ట్రోఫీ ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజీ క్రికెట్ టోర్నీలో తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్), ముఫకంజా కాలేజీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో టీకేఆర్ 9 వికెట్ల తేడాతో విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టుపై; ముఫకంజా 17 పరుగుల ఆధిక్యంతో ఎస్‌ఆర్ కాలేజి (వరంగల్)పై గెలిచాయి. మొదట విద్యాజ్యోతి 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. సందీప్ 26, శివదీప్ 23 పరుగులు చేశారు. టీకేఆర్ బౌలర్లు సాకేత్ 3, లోహిత్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం టీకేఆర్ వికెట్ కోల్పోయి 111 పరుగులు చేసి నెగ్గింది.
వంశీ (54), రోహిత్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వంశీ అందుకున్నాడు. ఎస్‌ఆర్ కాలేజితో జరిగిన మ్యాచ్‌లో తొలుత ముఫకంజా జట్టు 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఆలౌటైంది. రోహిత్ రెడ్డి (48) మెరుగ్గా ఆడాడు. ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బౌలర్లు సుశ్మిత్ 3, సైజుల 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభినయ్ (31), అర వింద్ (26) సందీప్ (21) ఫర్వాలేదనిపించారు.
ఫైనల్లో టీకేఆర్, ముఫకంజా కాలేజీ
Published Sat, Jan 11 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement