Gymkhana
-
కలిసి ‘కూర్చోవడానికి’ కాని కాలం!
క్లబ్బులు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరులతో కలిసి కూర్చోవడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. క్లబ్బు లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. క్లబ్బు సభ్యులు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. అలాంటి పెద్ద మనుషులను చిన్నబుచ్చే సంగతి ఇది. దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ జింఖానా క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండాలంటోంది. గుప్పెడుమంది డబ్బులు ఎగ్గొట్టి ఉండొచ్చు. మరీ అనుమానాస్పదంగా కనిపిస్తే తప్ప తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ అడగదు. అలాంటిది ఇంత పెద్ద క్లబ్బే ఇలా చేస్తే? కానికాలం అంటే ఇదే!మీరు కనుక ఒక క్లబ్బులో సభ్యుడై ఉన్నట్లయితే, అలా ఉండటం ఎంతో ప్రత్యేకమైనదని మీకు తెలిసి ఉంటుంది. సమస్థాయి వ్యక్తులు కలుసుకోవడానికి, సేద తీరేందుకు, అక్కడ తాము మాట్లాడేవి, చేసేవి బయటికి బహిర్గతం అవుతాయనే భయం లేకుండా ఒక సమూహంగా మసలుకునేందుకు బ్రిటిష్‌వాళ్లు ప్రవేశపెట్టినవే ఈ క్లబ్బులు. నిర్వచనం ప్రకారం అవి ఆంతరంగికమైనవి, గోప్యనీయతను కలిగి ఉండేవి. బహశా అందువల్లే సభ్యులకు తమ క్లబ్బులు ప్రియమైనవిగా ఉండి, వారు తరచు వాటి పట్ల అపరిమితమైన విధేయతను కలిగి ఉంటారు. దాంతోపాటుగా క్లబ్బు సభ్యులు ‘పెద్ద మనుషులు’గా పరిగణన పొందుతారు. మహిళా సభ్యుల విషయంలోనూ ఇది నిజం. ఒక అలిఖిత – అయితే అందరూ ఎరిగిన – ప్రవర్తనా నియమావళి క్లబ్బుల్లో అమలులో ఉంటుంది. క్లబ్బు సభ్యులు ఎల్లప్పుడు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. సభ్యతగల పనులే చేస్తారని వారిపై నమ్మకం ఉంచవచ్చు. సంప్రదాయం ప్రకారం, క్లబ్బు సభ్యులు సభ్యత్వ నియమావళి మేరకు తామక్కడ పొందే సేవలకు డబ్బు చెల్లిస్తారు. అది బారులో డ్రింక్స్‌కి అయినా, డైనింగ్ హాల్లో విందుకైనా; లేదా క్రీడల సదుపాయాలను వినియోగించుకున్నా, వాటిల్లో పాల్పంచుకున్నా అందుకు అయిన ఖర్చును కచ్చితంగా, పూర్తిగా చెల్లించవలసి ఉంటుందనటంలో సందేహం లేదు. మొత్తమ్మీదైతే, ఈ మర్యాదస్తులు తమ చెల్లింపు నిబంధనలను గౌరవిస్తారు. పాడు కాలం, ఇప్పుడేమైందంటే దేశ రాజధానిలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, సభ్యత్వానికి అపరిమితమైన డిమాండును కలిగి ఉన్న ఢిల్లీ జింఖానా క్లబ్ ఇక మీదట మునుపటిలా ఉండబోవటం లేదు. ఆ క్లబ్బు తన సభ్యత్వానికే అవమానకరంగా, అసంబద్ధంగా – సభ్యులు తాము పొందబోయే సేవలకు గాను ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలన్న పద్ధతిని ప్రవేశపెట్టింది! క్లబ్బు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి క్లబ్బు బారులో తాగాలన్నా, క్లబ్బు డైనింగ్ హాలులో తినాలన్నా ఇకపై క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండి ఉండాలి. అంటే మిగులు డబ్బులు ఉండాలి. వార్షిక సభ్యత్వ రుసుము కడుతున్నాం కదా అంటే ఇప్పుడు అదొక్కటే సరిపోదు. విషయం ఏంటంటే, మనకు ఇష్టమైనప్పుడు క్లబ్బుకు వెళ్లి కూర్చోవడానికి సదుపాయం కల్పించటమనే క్లబ్బు ప్రధాన ప్రయోజనాన్ని ఈ కొత్త పద్ధతి నెరవేరకుండా చేస్తుంది. మీరు మీ క్లబ్బు ఖాతాలో మిగులు డబ్బు లేకుండా తినలేరు. తాగలేరు. అప్పుడిక పక్క వారి మీద పడిపోవటమొక్కటే మీకుండే మార్గం. అది అధ్వాన్నమైన పరిస్థితి. క్లబ్బులు అనేవి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరుల కోసం మీరు డ్రింక్స్ కొనడానికి, లేదా వారితో కలిసి విందులో కూర్చోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ చివరికి మీరు ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. అయితే మీరు డిపాజిట్ చేసిన అడ్వాన్సు చాలినంతగా లేనప్పుడు మీరలా డ్రింక్స్‌ని కొనివ్వలేరు. లేదా ఫ్రెండ్ ఇచ్చిన డిన్నర్‌కు మీరు బిల్లు చెల్లించలేరు. ఆఖరికి వాణిజ్యపరమైన రెస్టారెంట్లు కూడా తమ అతిథులతో ఇంతకన్నా గౌరవంగా, సాదరంగా వ్యవహరిస్తాయి. అక్కడ తినటం ముగించి, వెళ్లటానికి సిద్ధం అయ్యాకే బిల్లు చెల్లిస్తారు. తినటానికి ముందే వాళ్లేమీ అడ్వాన్సు డిపాజిట్ చేసి ఉండనక్కర్లేదు. మీరు మరీ అనుమానాస్పదంగా, నమ్మదగనివారిగా కనిపిస్తే తప్ప మీరేం తినదలచుకున్నారో దానిని తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ మిమ్మల్ని అడగదు. అయినప్పటికీ జిమ్ – జింఖానాను ముద్దుగా సభ్యులు ఇలాగే పిలుచుకుంటారు – ఇకపై కొత్త పద్ధతి అమలు చేయబోతోంది. తన సభ్యత్వం పట్ల ఈ విధమైన అమర్యాదకర వైఖరికి క్లబ్బు చూపిస్తున్న సాకు ఏమిటంటే – కొంతమంది సభ్యులు తమ బిల్లులు చెల్లించటం లేదని! దురదృష్టవశాత్తూ, ఆ మాట నిజం. బకాయి పడిన వారి పేర్ల జాబితాను అందరికీ కనిపించేలా ఉంచినప్పటికీ కూడా వారికి చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. కానీ సభ్యులలో అలాంటి వారు కొద్ది మంది, లేదంటే కొంత భాగం. సభ్యత్వపు విధి విధానాలకు కట్టుబడి, బహుశా పది వేల మందికి పైగా ఉన్న సభ్యుల జాబితాలో అదే పనిగా, తీరు మార్చుకోకుండా బకాయి పడుతుండే సభ్యులు వందకు మించి ఉండరు. తరచు న్యాయబద్ధమైన, ఆమోదయోగ్యమైన కారణాల వల్ల బాకాయిలను ఆలస్యంగా చెల్లిస్తుండేవారిని ఉద్దేశపూర్వకంగానే నేను ఈ జాబితాలో చేర్చటం లేదు. ఇప్పుడు, మిగతా ప్రతి ఒక్కరూ – గౌరవప్రదంగా, అధిక సంఖ్యాకంగా ఉండేవారు – బకాయి పడుతున్న కొద్దిమంది విషయమై ప్రతిస్పందించటానికి క్లబ్బు ఇంతకన్నా మెరుగైన, ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనలేక పోయిన కారణంగా ఇబ్బంది పడాలా?చూస్తుంటే క్లబ్బు సమాధానం ‘అవును’ అన్నట్లే కనిపిస్తోంది. అలా కనిపించటమే క్లబ్బు యాజమాన్యం గురించి ఆందోళన కలగటానికి కారణం. క్లబ్ అంటే ఏమిటో, అదెలా ఉండాలని కోరుకుంటారో యాజమాన్యం అర్థం చేసుకోలేక పోయింది.ఏదేమైనా, ఇందుకు – దాటవేశారని చెప్పటానికి వీల్లేని – మరొక పరిష్కారం ఉంది. క్లబ్బు యాజమాన్యం నిజంగానే బిల్లు చెల్లింపులను బకాయి పెట్టే సభ్యుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన చెందుతున్నట్లయితే బయటి రెస్టారెంట్లలో మాదిరిగా తాగిన వెంటనే, లేదా తిన్న వెంటనే బిల్లు చెల్లించాలని వారిని కోరవచ్చు. నిజానికి లండన్‌లోని చాలా క్ల్లబ్బులు ఈ పనే చేస్తున్నాయి. అది మరింత చిత్తశుద్ధిగా, మర్యాదగా ఉంటుంది. ఢిల్లీ జింఖానా క్లబ్ అటువైపుగా ఎందుకు ఆలోచించలేక పోయింది?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అగ్నికి ఖరీదైన కార్ల ఆహుతిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని హైదరాబాద్ జింఖానా క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పార్కింగ్ స్థలంలో ఖరీదైన కార్లు దగ్ధమయ్యాయని బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదుతో జూబీహిల్స్ పోలీసులు జింఖానా క్లబ్ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించారు. శుక్రవారం సాయంత్రం క్లబ్ పార్కింగ్ స్థలంలో ఓ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ కారుకు అటూ ఇటూ రేంజ్‌రోవర్, కియా, మహీంద్రాథార్ కార్లు పార్కింగ్‌చేసి ఉన్నాయి. కారు అంటుకుందని క్లబ్ వ్యాలెట్ సిబ్బందికి చెప్పగా వారు నిర్లక్ష్యంతో ఆలస్యంగా ఘటన స్థలానికి చేరుకోవడంతో అప్పటికే మూడు కార్లకు మంటలు వ్యాపించాయి. ఒక కారును సకాలంలో బయటికి తీసి ఉంటే చుట్టూ ఉన్న మరో రెండు కార్లను బయటికి తీసుకురావడానికి అవకాశం ఉండేదని అలా కాకుండా తీవ్ర జాప్యం చేయడంతో నాలుగు కార్లు కాలిపోయాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కనీసం పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరాలు కూడా లేకుండాపోయాయని మంటలను ఆర్పే పరికరాలు కూడా అక్కడ సిద్ధంగా లేవని గుర్తించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్.. కొందరు ఆ కోరిక తీరకుండానే
సాక్షి, హైదరాబాద్: ఏదైనా క్లబ్బులో సభ్యత్వం కావాలంటే నిర్దేశిత మొత్తం చెల్లిస్తే చాలు వెంటనే అవకాశం కల్పిస్తారు. మరీ డిమాండ్ ఉన్న క్లబ్బుల్లో ఒకటి రెండేళ్లు లేదా గరిష్టంగా ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అదే సికింద్రాబాద్ క్లబ్ మెంబర్షిప్ పొందాలంటే 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిందే. అప్పటికీ సభ్యత్వం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. గత పదేళ్లుగా కొత్త సభ్యత్వాలే ఇవ్వలేదు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో కొందరు ఆ కోరిక తీరకుండానే చనిపోయారంటే అతిశయోక్తి కాదేమో. 218 ఏళ్ల క్రితం అప్పటి నిజాం నవాబు ప్రస్తుత అల్వాల్ పరిధిలోని ప్రాంతాలను సికింద్రాబాద్‌గా నామకరణం చేశారు. 1806లో హుస్సేన్ సాగర్‌కు తూర్పున ఉన్న 13 మొఘలాయి గ్రామాలను బ్రిటిష్‌వారికి అప్పగించారు. అదే కాలక్రమేణ కంటోన్మెంట్‌గా ఏర్పడింది. ► నిజాం ఆధీనంలోని హైదరాబాద్‌కు సమాంతరంగా బ్రిటిషర్లు సికింద్రాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. మిలిటరీ అధికారుల వినోదం కోసం క్రీడాప్రాంగణాలు, బార్లు, థియేటర్ల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఓ సంఘం ఆధ్వర్యంలో 1878లో ‘పబ్లిక్ రూమ్స్’ పేరిట ఓ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ► తొలుత బొల్లారం (సికింద్రాబాద్ స్టేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం)లో ఏర్పాటైన ఈ సంఘం తమ కార్యాలయాన్ని తొకట్టా గ్రామ (కాలక్రమంలో ఇదే బోయిన్‌పల్లిగా మారింది) పరిధిలోని 20.17 ఎకరాల విస్తీర్ణంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా (ఓజీబీ)లోనికి మార్చారు. ► 1836 గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఓల్డ్ గ్రాంట్ బంగళాల స్థలం పూర్తిగా ఆర్మీ ఆధీనంలో, భవనం మాత్రమే హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద యజమానులకు అప్పగించారు. ఈ మేరకు సికింద్రాబాద్ క్లబ్ స్థలం యాజమాన్యం ఇప్పటికీ ఆర్మీ ఆధీనంలో ఉండగా, భవనం మాత్రమే క్లబ్ నిర్వాహకుల చేతుల్లో ఉంది. ► కాలక్రమేనా సికింద్రాబాద్ గారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీసెస్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్‌గా మారింది. ► సికింద్రాబాద్ క్లబ్బులో సభ్యత్వం పొందిన వారు ‘ఎలైట్ పర్సన్స్’గా చెలామణి అయ్యే వారు. ► 2010 నాటికి ఈ క్లబ్బులో సభ్యుల సంఖ్య 8 వేలకు చేరుకోవడంతో కొత్త సభ్యత్వాలను నిలిపివేశారు. అప్పటికే 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సైతం నేటికీ సభ్యత్వాలు దక్కలేదు. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర) కార్పొరేట్ సభ్యత్వానికి రూ.10 లక్షలు సికింద్రాబాద్ క్లబ్లో సభ్యత్వం దక్కని వారికి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. రూ.10 లక్షల నాన్ రీఫండబుల్ రుసుముతో పదేళ్ల కాలపరిమితితో కూడి సభ్యత్వాన్ని అందజేస్తారు. కనీసం రూ.2 కోట్ల టర్నోవర్, రూ.5 కోట్లకు మించి నెట్‌వర్త్ కలిగిన హైదబాద్‌లోని వ్యాపారులకు మాత్రమే ఈ సభ్యత్వం ఇస్తారు. ఇవి కూడా 250 మించి ఇవ్వరు. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ పరిధిలోని మిలిటరీ ఉన్నతాధికారులకు నేరుగా సభ్యత్వం ఇస్తారు. ఇది కూడా గరిష్టంగా 1100 మందికి మాత్రమే ఇస్తారు. (చదవండి: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ రేస్ కార్లతో.. ‘ఫార్ములా–ఈ’) ► ఈ క్లబ్‌లకు దేశీయంగా వివిధ పట్టణాల్లోని 71 పేరెన్నిక కలిగిన క్లబ్బులు, అంతర్జాతీయంగా యూకే, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వివిధ దేశాల్లోని 20కి పైగా క్లబ్బులతో అఫిలియేషన్ ఉంది. అంటే ఈ క్లబ్బు సభ్యులను అఫిలియేషన్ ఉన్న ఆయా క్లబ్బుల్లోకి అతిథులుగా అనుమతిస్తారు. సికింద్రాబాద్ క్లబ్బు సభ్యత్వానికి డిమాండ్ పెరగడానికి ఈ అఫిలియేషన్ కూడా ఒకటి కావడం గమనార్హం. (చదవండి: నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా) -
Suryakumar Yadav: సూర్య డబుల్ సెంచరీ.. 152 బంతుల్లో 249 పరుగులు!
టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 249 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 37 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నమెంట్లో పార్సీ జింఖానా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ ముంబై బ్యాటర్. ఈ క్రమంలో పయ్యాడే ఎస్సీ జట్టుతో జరిగిన ఫైనల్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈ మేరకు పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ... ‘‘గ్రౌండ్ చిన్నదిగా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాను. సహచర ఆటగాళ్లు వచ్చి అభినందిస్తుంటే.. అప్పుడు డబుల్ సెంచరీ పూర్తైందని అర్థమైంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని అనుకున్నాను. అదే జరిగింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా జైపూర్ మ్యాచ్‌లో అదరగొట్టిన సూర్య.. ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలోనూ స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయాడు. అయితే, ప్రస్తుత ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానన్న సూర్య... ఎక్కువసేపు క్రీజులో ఉండటం, షాట్లు ఆడటం వల్ల మంచి ప్రాక్టీసు లభించిందన్నాడు. కాగా ఫైనల్లో భాగంగా 24 నుంచి 26 వరకు జింఖానా- పయ్యాడే జట్ల మధ్య ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: SA Vs IND: "ఫామ్‌లో లేడని కోహ్లిని తప్పిస్తారా.. రహానే విషయంలో మాత్రం ఎందుకు అలా" -
719 ఓట్లు.. 727 బ్యాలెట్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం–2లోని ది హైదరాబాద్ జింఖానా క్లబ్ ఎన్నికల ఫలితాలు రద్దయ్యాయి. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును సాయంత్రం చేపట్టి ఇంకాసేపట్లో ఫలితాలు వెల్లడిస్తారనంగా ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అర్హత లేని సభ్యులు ఓట్లు వేశారని ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం 719 మంది ఓటర్లు ఉండగా, 727 బ్యాలెట్ పేపర్లు రావడంతో ఎన్నిక వివాదాస్పదమైంది. 11 మంది సభ్యులు బకాయిలు చెల్లించకపోవడంతో ఓటు వేసేందుకు వారిని అనర్హతగా గుర్తించాలని, వారి ఓట్లు ఎలా పడ్డాయంటూ ఓ వర్గం వాదనకు దిగి రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా క్లబ్ చైర్మన్ పదవికి గుళ్ళపల్లి భవాని, టీ. శివరాజేంద్ర ప్యానల్స్ పోటీపడ్డాయి. -
‘జింఖానా’లో సచివాలయం వద్దు
→ హైకోర్టులో పిల్ దాఖలు సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా, బైసన్‌పోలో మైదానాల్లో అసెంబ్లీ, సచివాలయం, కళాభారతి భవ నాల నిర్మాణాలను ప్రశ్నిస్తూ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. 33 ఎకరాల బైసన్ పోలో, 22 ఎకరాల జింఖానా భూముల్లో నిర్మాణా లను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వా లని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో రిటైర్డు డీజీపీ ఎం.వి.భాస్కర రావు, మాజీ క్రికెటర్ వివేక్ జయసూర్య, మరో ఇద్దరు పిల్ వేశారు. ఈ మైదానాల్లోనే జాతీయ స్థాయి ఎన్సీసీ శిక్షణ జరుగుతుందని, అనేక క్రీడలకు వినియోగించే ఈ మైదానాల్లో నిర్మాణాలకు కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన అనుమతులు రద్దు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందులో తెలంగాణ సీఎస్, కేంద్ర రక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్, సబ్ ఏరియా కమాండర్, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికా రులను ప్రతివాదులుగా చేర్చారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతుంది ‘ఈ నిర్మాణాలు జరిగితే ఈ ప్రాంతం కాంక్రీట్ జంగిల్‌గా మారి పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది’అని పిటిషనర్లు పిల్లో హైకోర్టుకు అభ్యర్థించారు. -
ఉత్సాహంగా క్రీడాపోటీలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న కడప డయాసిస్ పరిధిలోని విద్యాసంస్థల క్రీడాపోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం రెండోరోజు ఫైనల్ పోటీలను కడప డయాసిస్ డిప్యూటీ మేనేజర్ ఫాదర్ ఆంథోనిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరాములరెడ్డి, వెంకటరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ప్రకాష్, సుబ్బరాయుడు, క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతల వివరాలు సీనియర్ విభాగం (వరుసగా విన్నర్స్, రన్నర్స్) బాలుర విభాగం : కబడ్డీ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, హోలిరోజరీ, పోరుమామిళ్ల వాలీబాల్ : ఇన్ఫాంట్, రేణిగుంట, సెయింట్‌జోసఫ్, మైదుకూరు బాలికల విభాగం : కబడ్డీ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, సెయింట్‌జోసఫ్, కడప త్రోబాల్ : ఇన్ఫాంట్, రాజంపేట, ఇన్ఫాంట్, పాకాల. జూనియర్ విభాగం.. బాలుర విభాగం : కబడ్డీ : సెయింట్‌జోసఫ్, కడప, హోలీరోజరీ, పోరుమామిళ్ల బ్యాడ్మింటన్ : ఇన్ఫాంట్, రాజంపేట, సెయింట్‌జోసఫ్, మైదుకూరు బాలికల విభాగం : కబడ్డీ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, ఫాతిమా, బద్వేలు బ్యాడ్మింటన్ : సెయింట్‌జోసఫ్, కడప, ఇన్ఫాంట్, రాజంపేట టెన్నికాయిట్ : ఇన్ఫాంట్, రాజంపేట, హోలిరోజరీ, పోరుమామిళ్ల త్రోబాల్ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, సెయింట్‌జోసఫ్, కడప -
కోలాహలంగా ఫ్లెమింగో ఫెస్టివల్
రెండోరోజున ఆటల పోటీల సందడి సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్-2015లో భాగంగా రెండోరోజు శనివారం సూళ్లూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఆటలపోటీలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్రీడలను నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్రీడాపోటీలను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి విద్యార్థులు, తిరుపతి, శ్రీకాళహస్తి, చెన్నై నుంచి వచ్చిన పలువురు పర్యాటకులు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. అ తర్వాత ఉచిత బస్సుల్లో అటకానితిప్పకు వెళ్లి పులికాట్లో ఆహారవేటలో ఉన్న విదేశీ వలస విహంగాలను వీక్షించారు. ఆ తర్వాత నేలపట్టు పక్షులు కేంద్రానికి వెళ్లి చెరువులోని చెట్లపై గూళ్లుకట్టుకుని విన్యాసాలు చేస్తున్న విహంగాలను తిలకించారు. శనివారం మాత్రం సూళ్లూరుపేట మైదానం, బీవీపాళెంలో బోట్ షికార్, నేలపట్టుల్లో పక్షులను వీక్షించేందుకు పర్యాటకులు కిటకిటలాడుతూ కనిపించారు. దీనికి తోడు పులికాట్లో అత్యధికంగా విదేశీ వలస విహంగాలు దర్శనమివ్వడంతో సందర్శకులు పులకించిపోయారు. శ్రీహరికోట-సూళ్లూరుపేట మార్గానికి ఇరువైపులా పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ ప్రకృతి ప్రియులకు కనువిందు చేశాయి. బోటు షికారు... భలే హుషారు... తడ మండలం భీములవారిపాళెం వద్ద బోటు షికారు ఏర్పాటు చేశారు. పులికాట్ సరస్సులో బోటు షికారు బాగుందని పర్యాటకుల అభిప్రాయం. నేలపట్టులో పక్షులను తిలకించడానికి జిల్లా నుంచి, తమిళనాడు నుంచి వేలాదిమంది పర్యాటకులు వచ్చారు. -
ఇంగ్లండ్‌లో భారతీయ రెస్టారెంట్‌కు అవార్టు
లండన్: ఇంగ్లండ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌కు జాతీయ అవార్డు దక్కింది. లండన్‌లోని జింఖానా 'నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ద ఇయర్'గా ఎంపికైంది. ఈ అవార్డు గెల్చుకున్న తొలి భారతీయ రెస్టారెంట్ ఇదే కావడం విశేషం. ఇంగ్లండ్‌లో భారతీయ వంటకాలకు ఈ రెస్టారెంట్ ప్రసిద్ధిగాంచింది. భోజనప్రియులకు భారతీయ వంటకాలను బ్రిటీష్ స్టైల్లో అందిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో జింఖానా రెస్టారెంట్‌ను ఆరంభించారు. అయితే తక్కువ కాలంలో వెరైటీ రుచుల వంటకాలతో మంచి పేరు తెచ్చుకుంది. -
మూడో రౌండ్లో రాహుల్
జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో బాలుర అండర్-14 రెండో రౌండ్లో రాహుల్ చందన గెలుపొందాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 6-0తో హర్షవర్ధన్‌పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సాహిల్ 6-0తో కౌశిక్ కుమార్ రెడ్డిపై గెలిచాడు. ఆకాశ్ 6-2తో యువరాజ్‌పై, అఖిల్ కుమార్ రెడ్డి 6-2తో విశాల్ వర్మపై విజయం సాధించారు. నిషద్ 6-4తో నిషాంత్‌పై, జియావుద్దీన్ 6-5 (9/7)తో అభిషేక్‌పై, అభినవ్ రామకృష్ణ 6-5 (7/4)తో బృహత్పై, శశి ప్రీతమ్ 6-1తో రోహిత్ దయానంద్‌పై గెలిచారు. ఇతర ఫలితాలు బాలుర అండర్-12 రెండో రౌండ్: ఆకాశ్ 6-0తో సాషమ్ గుప్తాపై, బృహత్ 6-3తో హరి హస్వంత్పై, యశ్వంత్ 6-2తో అలెగ్జాండర్ మోషర్పై, భాస్కర్ మోహన్ రాయ్ 6-2తో గండ్ల అర్చిత్‌పై, కౌశిక్ కుమార్ రెడ్డి 6-0తో అనికేత్‌పై, ముకుంద్ రెడ్డి 6-4తో ఆది రోహన్ రెడ్డిపై, సిద్ధార్థ్ రెడ్డి 6-5 (7/5)తో అక్షిత్‌పై, రాహుల్ 6-0తో సాయి కార్తీక్‌పై నెగ్గారు. అండర్-10 రెండో రౌండ్: యశ్వంత్ 6-0తో శంషుద్దీన్‌ను, జైకృష్ణ పాల్ 6-1తో హేమ సింహను, ఆయుష్ 6-2తో వర్షిత్ కుమార్‌ను, కిషోర్ కుమార్ 6-1తో వైభవ్ మనగిరిని, గౌరవ్ కృష్ణ 6-4తో శ్రీప్రణవ్ను, సిద్ధార్థ్ రె డ్డి 6-1తో రాఘవ్ దినేష్‌ను, కేశవ్ శ్రీనివాసన్ 6-1తో ప్రమీత్ సింగ్ భాటియాను, అభిరామ్ 6-0తో ముకుంద్ రెడ్డిని ఓడించారు. -
ఆకర్ష్ అజేయ సెంచరీ
జింఖానా, న్యూస్‌లైన్: సాయి సత్య జట్టు బ్యాట్స్‌మన్ ఆకర్ష్ కులకర్ణి (107 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు సిండికేట్ బ్యాంక్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిండికేట్ బ్యాంక్ 190 పరుగులకు కుప్పకూలింది. అరవింద్ శెట్టి (114) సెంచరీతో కదం తొక్కగా... జయానంద్ పటేల్ (32) ఫర్వాలేదనిపించాడు. సాయి సత్య బౌలర్ అనురాగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన సాయి సత్య రెండే వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి గెలిచింది. దీక్షిత్ 40 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో జిందా తిలిస్మాత్ జట్టు బౌలర్లు మన్నన్ (5/15), అవినాష్ సింగ్ (3/34) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆ జట్టు 87 పరుగుల తేడాతో విజయ హనుమాన్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన జిందా తిలిస్మాత్ 202 పరుగులు చేసి ఆలౌటైంది. ఫరాజ్ నవీద్ 32 పరుగులు చేశాడు. విజయ హనుమాన్ జట్టు బౌలర్లు ఫరాన్ 4, సుఖేన్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన విజయ హనుమాన్ 115 పరుగులకే చేతులెత్తేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బాలాజీ కోల్ట్స్: 179 (రతన్ శర్మ 50, వికాస్ మోహన్ 41; భరత్ 4/24); జై భగవతీ: 180/8 (ఖాన్ 43, సయ్యద్ షబ్బీర్ ఆలీ 32 నాటౌట్). తెలంగాణ: 172/9 (జయ్ 31, జైసూర్య 61); జెమినీ ఫ్రెండ్స్: 150 (చంద్రశేఖర్ 37, ప్రతీక్ 43; అనురాగ్ విఠల్ 4/20). సుల్తాన్ షాహీ: 254 (ప్రసాద్ 39, సందీప్ 42, వంశీ 59; నీలేష్ 4/60); ఆక్స్ఫర్డ్ బ్లూస్: 257/5 (దీపాంకర్ 84, భరత్ రాజ్ 43, అమిత్ సింగ్ 73 నాటౌట్). బడ్డింగ్ స్టార్: 209 (నిఖిల్ పర్వాని 66, నిఖిల్ యాదవ్ 50, రాజ్మణి 56; ముజ్తాబా 4/25, ఇమ్రాన్ ఖాన్ 3/35); పాషా బీడీ: 179 (రోహిత్ ఖురానా 31, మనీష్ 4/30). ఎంసీసీ: 169 (రాయన్ అమూరి 77, శ్రవణ్ 4/24, అర్జున్ 3/45); కాంటినెంటల్: 170/1 (అర్జున్ 57 నాటౌట్, రోహిత్ రెడ్డి 104). న్యూ బ్లూస్: 177 (రిషబ్ సింగ్ 45, దత్త ప్రకాష్ 30; అర్షద్ 5/31); బ్రదర్స్ ఎలెవన్: 157. -
ఫైనల్లో టీకేఆర్, ముఫకంజా కాలేజీ
జింఖానా, న్యూస్‌లైన్: ఎస్ఆర్ చాంపియన్స్ ట్రోఫీ ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజీ క్రికెట్ టోర్నీలో తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్), ముఫకంజా కాలేజీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో టీకేఆర్ 9 వికెట్ల తేడాతో విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టుపై; ముఫకంజా 17 పరుగుల ఆధిక్యంతో ఎస్ఆర్ కాలేజి (వరంగల్)పై గెలిచాయి. మొదట విద్యాజ్యోతి 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. సందీప్ 26, శివదీప్ 23 పరుగులు చేశారు. టీకేఆర్ బౌలర్లు సాకేత్ 3, లోహిత్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం టీకేఆర్ వికెట్ కోల్పోయి 111 పరుగులు చేసి నెగ్గింది. వంశీ (54), రోహిత్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వంశీ అందుకున్నాడు. ఎస్ఆర్ కాలేజితో జరిగిన మ్యాచ్‌లో తొలుత ముఫకంజా జట్టు 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఆలౌటైంది. రోహిత్ రెడ్డి (48) మెరుగ్గా ఆడాడు. ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బౌలర్లు సుశ్మిత్ 3, సైజుల 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభినయ్ (31), అర వింద్ (26) సందీప్ (21) ఫర్వాలేదనిపించారు. -
హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ డ్రా
కూచ్ బెహర్ ట్రోఫీ జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ అండర్-19 ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ 77 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. చైతన్య (58) అర్ధ సెంచరీతో రాణించగా... రాహుల్ సింగ్ (43), చైతన్య రెడ్డి (43) మెరుగ్గా ఆడారు. ఢిల్లీ బౌలర్లు రావత్ 4, పీఆర్ సింగ్ 2 వికెట్లు చేజిక్కించుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 451/8తో బరిలోకి దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 149.1 ఓవర్లకు 452 పరుగులకు ఆలౌటైంది. -
నైనా జైస్వాల్‌కు సన్మానం
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకుంటున్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను సోమవారం హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. 13 ఏళ్ల నైనా ఇటీవల ఇరాన్లో జరిగిన అంతర్జాతీయ క్యాడెట్ అండ్ జూనియర్ టీటీ టోర్నీలో రెండు స్వర్ణాలతో పాటు ఓ కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా నైనా మాట్లాడుతూ తన విజయాల వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని తెలిపింది. ‘ఆడపిల్లలను నేటి సమాజం భారంగా పరిగణిస్తున్న సమయంలో నన్ను అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఓ మహిళగా సమున్నత స్థాయికి ఎదిగిన మాజీ పోలీస్ అధికారిణి కిరణ్ బేడిని నేను ఆదర్శంగా తీసుకుంటాను’ అని నైనా తెలిపింది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ కుమార్తె 15 స్వర్ణ పతకాలు సాధించినట్లు నైనా తండ్రి, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ కార్యదర్శి అశ్విన్‌కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం. ఆరిఫ్, అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసిం అలీ, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నరసింహారావు, ప్రముఖ బాడీ బిల్డర్ మోతేశ్యామ్ అలీ, టైపింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించిన ఖుర్షీద్ హుస్సేన్, హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు సాయిప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.