→ హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా, బైసన్‌పోలో మైదానాల్లో అసెంబ్లీ, సచివాలయం, కళాభారతి భవ నాల నిర్మాణాలను ప్రశ్నిస్తూ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖ లైంది. 33 ఎకరాల బైసన్ పోలో, 22 ఎకరాల జింఖానా భూముల్లో నిర్మాణా లను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వా లని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో రిటైర్డు డీజీపీ ఎం.వి.భాస్కర రావు, మాజీ క్రికెటర్ వివేక్ జయసూర్య, మరో ఇద్దరు పిల్ వేశారు.
ఈ మైదానాల్లోనే జాతీయ స్థాయి ఎన్‌సీసీ శిక్షణ జరుగుతుందని, అనేక క్రీడలకు వినియోగించే ఈ మైదానాల్లో నిర్మాణాలకు కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన అనుమతులు రద్దు చేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందులో తెలంగాణ సీఎస్, కేంద్ర రక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి, కార్యదర్శి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్, సబ్ ఏరియా కమాండర్, ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికా రులను ప్రతివాదులుగా చేర్చారు. కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతుంది ‘ఈ నిర్మాణాలు జరిగితే ఈ ప్రాంతం కాంక్రీట్ జంగిల్‌గా మారి పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది’అని పిటిషనర్లు పిల్‌లో హైకోర్టుకు అభ్యర్థించారు.