
తెలుగు ఇండస్ట్రీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. స్ట్రెయిట్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే థియేటర్లకు జనాలు సరిగా రావట‍్లేదు. కొందరు దర్శక నిర్మాతలేమో రివ్యూయర్లదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్ లో పొరపాట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.
(ఇదీ చదవండి: 'ది ఫ్యామిలీ మ్యాన్-3' నటుడు అనుమానాస్పద మృతి)
ఎందుకంటే కంటెంట్ సరిగా ఉండి ఎంటర్ టైన్ చేస్తే మనది కాదా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. గతవారం 'సారంగపాణి' సినిమాతో పాటు జింఖానా, తుడురమ్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజయ్యాయి. స్ట్రెయిట్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు.
అదే టైంలో 'ప్రేమలు' హీరో నస్లేన్ నటించిన 'జింఖానా'కు మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. కామెడీ కనెక్ట్ అయ్యేలా ఉండటం దీనికి కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి రూ.2.70 కోట్ల మేర వసూళ్లు వచ్చాయని టాక్.
(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?)
చాలా తెలుగు సినిమాలతో పోలిస్తే 'జింఖానా'పై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఈ కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు లాభాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు విడుదల వరకు దీనిపై పెట్టుబడి కూడా అంత ఎక్కువ పెట్టి ఉండరుగా!
జింఖానా విషయానికొస్తే.. అలెప్పీకి చెందిన కొందరు కుర్రాళ్లు.. ఇంటర్ ఫెయిలవుతారు. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ సీటు సంపాదించాలని బాక్సింగ్ నేర్చుకుంటారు. లోకల్ పోటీల్లో ఎలాగోలా గెలిచేస్తారు. దీంతో రాష్ట‍్ర స్థాయి పోటీలకు రెడీ అవుతారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? చివరకు గెలిచారా లేదా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా)