జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో బాలుర అండర్-14 రెండో రౌండ్‌లో రాహుల్ చందన గెలుపొందాడు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాహుల్ 6-0తో హర్షవర్ధన్‌పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సాహిల్ 6-0తో కౌశిక్ కుమార్ రెడ్డిపై గెలిచాడు. ఆకాశ్ 6-2తో యువరాజ్‌పై, అఖిల్ కుమార్ రెడ్డి 6-2తో విశాల్ వర్మపై విజయం సాధించారు. నిషద్ 6-4తో నిషాంత్‌పై, జియావుద్దీన్ 6-5 (9/7)తో అభిషేక్‌పై, అభినవ్ రామకృష్ణ 6-5 (7/4)తో బృహత్‌పై, శశి ప్రీతమ్ 6-1తో రోహిత్ దయానంద్‌పై గెలిచారు.
ఇతర ఫలితాలు
బాలుర అండర్-12 రెండో రౌండ్: ఆకాశ్ 6-0తో సాషమ్ గుప్తాపై, బృహత్ 6-3తో హరి హస్వంత్‌పై, యశ్వంత్ 6-2తో అలెగ్జాండర్ మోషర్‌పై, భాస్కర్ మోహన్ రాయ్ 6-2తో గండ్ల అర్చిత్‌పై, కౌశిక్ కుమార్ రెడ్డి 6-0తో అనికేత్‌పై, ముకుంద్ రెడ్డి 6-4తో ఆది రోహన్ రెడ్డిపై, సిద్ధార్థ్ రెడ్డి 6-5 (7/5)తో అక్షిత్‌పై, రాహుల్ 6-0తో సాయి కార్తీక్‌పై నెగ్గారు.
అండర్-10 రెండో రౌండ్: యశ్వంత్ 6-0తో శంషుద్దీన్‌ను, జైకృష్ణ పాల్ 6-1తో హేమ సింహను, ఆయుష్ 6-2తో వర్షిత్ కుమార్‌ను, కిషోర్ కుమార్ 6-1తో వైభవ్ మనగిరిని, గౌరవ్ కృష్ణ 6-4తో శ్రీప్రణవ్‌ను, సిద్ధార్థ్ రె డ్డి 6-1తో రాఘవ్ దినేష్‌ను, కేశవ్ శ్రీనివాసన్ 6-1తో ప్రమీత్ సింగ్ భాటియాను, అభిరామ్ 6-0తో ముకుంద్ రెడ్డిని ఓడించారు.
మూడో రౌండ్‌లో రాహుల్
Published Sun, Feb 16 2014 1:19 AM | Last Updated on Fri, May 25 2018 2:48 PM
Advertisement
Advertisement