ప్రత్యేక హోదాపై ప్రధానికి రాహుల్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. లేఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ప్రకటన చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూడాలని ఆ లేఖలో రాహుల్ పేర్కొన్నారు. గతంలోనూ ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్...ఎన్డీయే ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేసింది.
ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని వెల్లడించాలని ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై చర్చించేందుకు ఆయన ప్రధాని అపాయింట్మెంట్ను కోరారు.