ఫైల్ ఫోటో
టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 249 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 37 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో పార్సీ జింఖానా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ ముంబై బ్యాటర్. ఈ క్రమంలో పయ్యాడే ఎస్‌సీ జట్టుతో జరిగిన ఫైనల్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈ మేరకు పరుగులు రాబట్టాడు.
ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ... ‘‘గ్రౌండ్ చిన్నదిగా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాను. సహచర ఆటగాళ్లు వచ్చి అభినందిస్తుంటే.. అప్పుడు డబుల్ సెంచరీ పూర్తైందని అర్థమైంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని అనుకున్నాను. అదే జరిగింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా జైపూర్ మ్యాచ్‌లో అదరగొట్టిన సూర్య.. ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలోనూ స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయాడు. అయితే, ప్రస్తుత ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానన్న సూర్య... ఎక్కువసేపు క్రీజులో ఉండటం, షాట్లు ఆడటం వల్ల మంచి ప్రాక్టీసు లభించిందన్నాడు. కాగా ఫైనల్‌లో భాగంగా 24 నుంచి 26 వరకు జింఖానా- పయ్యాడే జట్ల మధ్య ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: SA Vs IND: "ఫామ్‌లో లేడని కోహ్లిని తప్పిస్తారా.. రహానే విషయంలో మాత్రం ఎందుకు అలా"
Comments
Please login to add a commentAdd a comment