ఆకర్ష్ అజేయ సెంచరీ | akarsh kulkarni hits century | Sakshi
Sakshi News home page

ఆకర్ష్ అజేయ సెంచరీ

Published Sun, Jan 19 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

akarsh kulkarni hits century

 జింఖానా, న్యూస్‌లైన్: సాయి సత్య జట్టు బ్యాట్స్‌మన్ ఆకర్ష్ కులకర్ణి (107 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు సిండికేట్ బ్యాంక్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిండికేట్ బ్యాంక్ 190 పరుగులకు కుప్పకూలింది. అరవింద్ శెట్టి (114) సెంచరీతో కదం తొక్కగా... జయానంద్ పటేల్ (32) ఫర్వాలేదనిపించాడు. సాయి సత్య  బౌలర్  అనురాగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన సాయి సత్య రెండే వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి గెలిచింది.
 
  దీక్షిత్ 40 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో జిందా తిలిస్మాత్ జట్టు బౌలర్లు మన్నన్ (5/15), అవినాష్ సింగ్ (3/34) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆ జట్టు 87 పరుగుల తేడాతో విజయ హనుమాన్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన జిందా తిలిస్మాత్ 202 పరుగులు చేసి ఆలౌటైంది. ఫరాజ్ నవీద్ 32 పరుగులు చేశాడు. విజయ హనుమాన్ జట్టు బౌలర్లు ఫరాన్ 4, సుఖేన్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన విజయ హనుమాన్ 115 పరుగులకే చేతులెత్తేసింది.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 బాలాజీ కోల్ట్స్: 179 (రతన్ శర్మ 50, వికాస్ మోహన్ 41; భరత్ 4/24); జై భగవతీ: 180/8 (ఖాన్ 43, సయ్యద్ షబ్బీర్ ఆలీ 32 నాటౌట్).
 
  తెలంగాణ: 172/9 (జయ్ 31, జైసూర్య 61); జెమినీ ఫ్రెండ్స్: 150 (చంద్రశేఖర్ 37, ప్రతీక్ 43; అనురాగ్ విఠల్ 4/20).
 
 సుల్తాన్ షాహీ: 254 (ప్రసాద్ 39, సందీప్ 42, వంశీ 59; నీలేష్ 4/60); ఆక్స్‌ఫర్డ్ బ్లూస్: 257/5 (దీపాంకర్ 84, భరత్ రాజ్ 43, అమిత్ సింగ్ 73 నాటౌట్).
 
  బడ్డింగ్ స్టార్: 209 (నిఖిల్ పర్వాని 66, నిఖిల్ యాదవ్ 50, రాజ్‌మణి 56; ముజ్తాబా 4/25, ఇమ్రాన్ ఖాన్ 3/35); పాషా బీడీ: 179 (రోహిత్ ఖురానా 31, మనీష్ 4/30).
 
  ఎంసీసీ: 169 (రాయన్ అమూరి 77, శ్రవణ్ 4/24, అర్జున్ 3/45);  కాంటినెంటల్: 170/1 (అర్జున్ 57 నాటౌట్, రోహిత్ రెడ్డి 104).
 
  న్యూ బ్లూస్: 177 (రిషబ్ సింగ్ 45, దత్త ప్రకాష్ 30; అర్షద్ 5/31); బ్రదర్స్ ఎలెవన్: 157.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement