syndicate bank team
-
‘రుణమాఫీ’లో తోసేద్దామని..
పథకం ప్రకారమే ఎడపల్లి సిండికేట్ బ్యాంకులోఅక్రమార్కులు రెండున్నర కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది. బోగస్ పట్టాలు, నకిలీ వన్‌బీ, పహాణీలతో రైతుల పేరిట ఖాతాలు తీసి పంట రుణాలను మంజూరు చేసి లేపుకున్నారు. ఈ రుణాలను రుణమాఫీ కింద మాఫీ చేయించి తప్పించుకుందామని స్కెచ్ వేశారు. అయితే పథకం వికటించి అక్కమార్కుల గుట్టు రట్టయ్యింది. సాక్షి, నిజామాబాద్ : పంట రుణాల కుంభణంకోలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంక్‌లో బోగస్ పట్టాలు, నకిలీ వన్‌బీ, పహాణీలతో సుమారు రూ.2.5 కోట్ల వరకు అక్రమార్కులు పంట రుణాల పేరిట లూటీ చేసిన విషయం విధితమే ! ఈ రుణాలను ప్రభుత్వ రుణమాఫీ పథకంలో మాఫీ చేయించి, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని ముగించేసేలా పక్కా ప్రణాళికతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణ తేలింది. రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం కాస్త జాప్యం జరిగింది. ఈలోగా ఈ బాగోతం వెలుగులోకి రావడంతో బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు, బాధితులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లీడ్ బ్యాంకు ఉన్నతాధికారులు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకానికి అర్హులైన రైతుల జాబితాను ఆయా బ్యాంకుల బ్రాంచీల ద్వారా సేకరించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇలా తయారు చేసిన జాబితాలో ఈ బోగస్ పంటరుణాలను కూడా చేర్చేసి, చేతికి మట్టి అంటకుండా నిధులు కాజేయాలనే పక్కా ప్రణాళికతో వ్యవహారం నడిపినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అప్రమత్తమైన రెవెన్యూ శాఖ.. సిండికేట్‌బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో రెవెన్యూశాఖ అప్రమత్తమైంది. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, నకిలీ పహాణీలు, వన్‌బీలు తెరపైకి రావడంతో రెవెన్యూ అధికారులు కుంభకోణంపై దృష్టి సారించారు. ఇలా పంటరుణాలు పొందిన రైతుల పేర్లు, పాసుపుస్తకాలు, పహాణీలు, 1బీ రికార్డులు తమకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఇందుకు బ్యాంకు ఉన్నతాధికారులు అంగీకరించకపోవడంతో స్థానిక తహశీల్దార్ అశోక్ కుమార్ వివరాల కోసం లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ కూడా ఈ వ్యవహారాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా కుంభకోణంపై ఆరా తీస్తున్నారు. ఇంకా లిఖిత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ముందస్తుగా వివరాలను సేకరిస్తున్నారు. దళారుల ముఠాగా మారి.. బ్యాంకు ఉన్నతాధికారులు, ఆయా గ్రామాల్లో ఉన్న దళారులు చేతులు కలిపి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గ్రామాల్లో అమాయకులకు కాస్త డబ్బులను ఆశగా చూపి, వారి ఆధార్ కార్డులను సేకరించి వారితో ఖాతాలను తెరిపించారు. ఖాతాదారులకు భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించి రుణం మంజూరు చేశారు. ఈ రుణాన్ని సదరు బినామీ ఖాతాల్లోకి మళ్లించి ఆ ఖాతానుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇలా ఏకంగా రూ.కోట్లలో బ్యాంకును లూటీ చేయడం జిల్లాలో చర్చనీయాశంగా మారింది. అంతర్గత విచారణ కొనసాగుతోంది : రేణుక, రీజినల్ మేనేజర్.. పంట రుణాల మంజూరులో జరిగిన లోపాలపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు బయటకు చెప్పడం కుదరదు. ఈ విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాము. -
ఆకర్ష్ అజేయ సెంచరీ
జింఖానా, న్యూస్‌లైన్: సాయి సత్య జట్టు బ్యాట్స్‌మన్ ఆకర్ష్ కులకర్ణి (107 నాటౌట్) అజేయ సెంచరీతో విజృంభించడంతో ఆ జట్టు సిండికేట్ బ్యాంక్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిండికేట్ బ్యాంక్ 190 పరుగులకు కుప్పకూలింది. అరవింద్ శెట్టి (114) సెంచరీతో కదం తొక్కగా... జయానంద్ పటేల్ (32) ఫర్వాలేదనిపించాడు. సాయి సత్య బౌలర్ అనురాగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన సాయి సత్య రెండే వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి గెలిచింది. దీక్షిత్ 40 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో జిందా తిలిస్మాత్ జట్టు బౌలర్లు మన్నన్ (5/15), అవినాష్ సింగ్ (3/34) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆ జట్టు 87 పరుగుల తేడాతో విజయ హనుమాన్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన జిందా తిలిస్మాత్ 202 పరుగులు చేసి ఆలౌటైంది. ఫరాజ్ నవీద్ 32 పరుగులు చేశాడు. విజయ హనుమాన్ జట్టు బౌలర్లు ఫరాన్ 4, సుఖేన్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన విజయ హనుమాన్ 115 పరుగులకే చేతులెత్తేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బాలాజీ కోల్ట్స్: 179 (రతన్ శర్మ 50, వికాస్ మోహన్ 41; భరత్ 4/24); జై భగవతీ: 180/8 (ఖాన్ 43, సయ్యద్ షబ్బీర్ ఆలీ 32 నాటౌట్). తెలంగాణ: 172/9 (జయ్ 31, జైసూర్య 61); జెమినీ ఫ్రెండ్స్: 150 (చంద్రశేఖర్ 37, ప్రతీక్ 43; అనురాగ్ విఠల్ 4/20). సుల్తాన్ షాహీ: 254 (ప్రసాద్ 39, సందీప్ 42, వంశీ 59; నీలేష్ 4/60); ఆక్స్ఫర్డ్ బ్లూస్: 257/5 (దీపాంకర్ 84, భరత్ రాజ్ 43, అమిత్ సింగ్ 73 నాటౌట్). బడ్డింగ్ స్టార్: 209 (నిఖిల్ పర్వాని 66, నిఖిల్ యాదవ్ 50, రాజ్మణి 56; ముజ్తాబా 4/25, ఇమ్రాన్ ఖాన్ 3/35); పాషా బీడీ: 179 (రోహిత్ ఖురానా 31, మనీష్ 4/30). ఎంసీసీ: 169 (రాయన్ అమూరి 77, శ్రవణ్ 4/24, అర్జున్ 3/45); కాంటినెంటల్: 170/1 (అర్జున్ 57 నాటౌట్, రోహిత్ రెడ్డి 104). న్యూ బ్లూస్: 177 (రిషబ్ సింగ్ 45, దత్త ప్రకాష్ 30; అర్షద్ 5/31); బ్రదర్స్ ఎలెవన్: 157. -
8 వికెట్లతో విజృభించిన సజ్జాద్
జింఖానా, న్యూస్‌లైన్: బ్రదర్స్ ఎలెవన్ బౌలర్ సజ్జాద్ ఆలీ 8 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో బ్రదర్స్ ఎలెవన్ జట్టు 32 పరుగుల తేడాతో సిండికేట్ బ్యాంక్ జట్టుపై విజయం సాధించింది. తొలిరోజు మ్యాచ్‌లో బ్రదర్స్ ఎలెవన్ 153 పరుగులు చేసింది. సలీం (29), పవన్ కుమార్ (29), సాలమ్ బయాష్ (25) ఫర్వాలేదనిపించారు. సిండికేట్ బ్యాంక్ బౌలర్ 6 వికెట్లు తీసుకున్నాడు. రెండో రోజు బరిలోకి దిగిన సిండికేట్ బ్యాంక్ 121 పరుగుల వద్ద కుప్పకూలింది. శ్రీనివాస్ (42), అరవింద్ శెట్టి (29) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు. పాషాబీడి, వీనస్ సైబర్‌టెక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో... పాషా బీడి జట్టు 8 వికె ట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. సయ్యద్ ఫరాన్ (73 నాటౌట్) అర్ధ సెంచ రీతో చెలరేగగా, సౌరవ్ కుమార్ 46 పరుగులు చేశాడు. వీన్స్ సైబర్‌టెక్ బౌలర్ వంశీ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. నేడు వీనస్ సైబర్‌టెక్ బ్యాటింగ్ చేయాల్సివుంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బాలాజి కోల్ట్స్: 175 (రతన్ శర్మ 78; విజయ్ అశ్విన్ 4/41, మహేష్ 3/66); సుల్తాన్ షాహి: 176/7 (ప్రసాద్ 32, మహేష్ 40; ఇంద్ర దీప్ 3/14, నవజోత్ 3/74) జిందా: 281 (శ్యామ్ 71, హుస్సేన్ 68, శహభాష్ ఉద్దీన్ 63; భరత్ 4/69, రాకేష్ 4/56); జై భగవతి: 44/0. బడ్డింగ్ స్టార్: 200 (తుషార్ 55); హైదరాబాద్ టైటాన్స్: 59/3.