హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ డ్రా | hyderabad,delhi match draw | Sakshi
Sakshi News home page

హైదరాబాద్, ఢిల్లీ మ్యాచ్ డ్రా

Published Sat, Jan 11 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

hyderabad,delhi match draw

 కూచ్ బెహర్ ట్రోఫీ
 జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ అండర్-19 ట్రోఫీలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్ 77 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
 
  చైతన్య (58) అర్ధ సెంచరీతో రాణించగా... రాహుల్ సింగ్ (43), చైతన్య రెడ్డి (43) మెరుగ్గా ఆడారు. ఢిల్లీ బౌలర్లు రావత్ 4, పీఆర్ సింగ్ 2 వికెట్లు చేజిక్కించుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 451/8తో బరిలోకి దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 149.1 ఓవర్లకు 452 పరుగులకు ఆలౌటైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement