సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం–2లోని ది హైదరాబాద్ జింఖానా క్లబ్ ఎన్నికల ఫలితాలు రద్దయ్యాయి. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును సాయంత్రం చేపట్టి ఇంకాసేపట్లో ఫలితాలు వెల్లడిస్తారనంగా ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సభ్యులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అర్హత లేని సభ్యులు ఓట్లు వేశారని ఆందోళన చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మొత్తం 719 మంది ఓటర్లు ఉండగా, 727 బ్యాలెట్ పేపర్లు రావడంతో ఎన్నిక వివాదాస్పదమైంది. 11 మంది సభ్యులు బకాయిలు చెల్లించకపోవడంతో ఓటు వేసేందుకు వారిని అనర్హతగా గుర్తించాలని, వారి ఓట్లు ఎలా పడ్డాయంటూ ఓ వర్గం వాదనకు దిగి రద్దు చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఎన్నికలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా క్లబ్ చైర్మన్ పదవికి గుళ్ళపల్లి భవాని, టీ. శివరాజేంద్ర ప్యానల్స్ పోటీపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment