ఉత్సాహంగా క్రీడాపోటీలు | Looking forward to tournaments | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రీడాపోటీలు

Published Mon, Jan 12 2015 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

Looking forward to tournaments

కడప స్పోర్ట్స్: కడప నగరంలోని సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న కడప డయాసిస్ పరిధిలోని విద్యాసంస్థల క్రీడాపోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం రెండోరోజు ఫైనల్ పోటీలను కడప డయాసిస్ డిప్యూటీ మేనేజర్ ఫాదర్ ఆంథోనిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం క్రీడాపోటీలను ప్రారంభించారు.  

ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరాములరెడ్డి, వెంకటరెడ్డి, చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ప్రకాష్, సుబ్బరాయుడు, క్రీడాకారులు పాల్గొన్నారు.
 విజేతల వివరాలు
 సీనియర్ విభాగం (వరుసగా విన్నర్స్, రన్నర్స్)
 బాలుర విభాగం : కబడ్డీ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, హోలిరోజరీ,
 పోరుమామిళ్ల
 వాలీబాల్ : ఇన్‌ఫాంట్, రేణిగుంట, సెయింట్‌జోసఫ్, మైదుకూరు
 బాలికల విభాగం : కబడ్డీ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, సెయింట్‌జోసఫ్, కడప
 త్రోబాల్ : ఇన్‌ఫాంట్, రాజంపేట, ఇన్‌ఫాంట్, పాకాల.
 జూనియర్ విభాగం..
 బాలుర విభాగం : కబడ్డీ : సెయింట్‌జోసఫ్, కడప, హోలీరోజరీ, పోరుమామిళ్ల
 బ్యాడ్మింటన్ : ఇన్‌ఫాంట్, రాజంపేట, సెయింట్‌జోసఫ్, మైదుకూరు
 బాలికల విభాగం : కబడ్డీ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, ఫాతిమా, బద్వేలు
 బ్యాడ్మింటన్ : సెయింట్‌జోసఫ్, కడప, ఇన్‌ఫాంట్, రాజంపేట
 టెన్నికాయిట్ : ఇన్‌ఫాంట్, రాజంపేట, హోలిరోజరీ, పోరుమామిళ్ల
 త్రోబాల్ : శాక్రిడ్‌హార్ట్, రాయచోటి, సెయింట్‌జోసఫ్, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement