ASR champions trophy
-
చాంప్ తీగల కృష్ణారెడ్డి కాలేజి
జింఖానా, న్యూస్‌లైన్: ఎస్ఆర్ చాంపియన్స్ ట్రోఫీ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజీ క్రికెట్ టోర్నీలో తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్) కాలేజీ విజేతగా నిలిచింది. వరంగల్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీకేఆర్ 7 వికెట్ల తేడాతో ముఫకంజా కాలేజీపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముఫకంజా కాలేజీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జుబేద్ (56) అర్ధ సెంచరీతో రాణించాడు. టీకేఆర్ బౌలర్ సాకేత్ 6 వికెట్లు పడగొట్టగా, చైతన్య రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన టీకేఆర్ 13 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలిచింది. వంశీ (60) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రోహిత్ రెడ్డి (46) మెరుగ్గా అడాడు. సాకేత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. రెండు, మూడు స్థానాల కోసం జరిగిన పోరులో ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు 7 వికెట్ల తేడాతో విద్యాజ్యోతి కాలేజీపై విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన విద్యాజ్యోతి కాలేజి 15 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. శివ దీప్ (33), కిరణ్ (26) ఫర్వాలేదనిపించారు. ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి బౌలర్లు రోహిత్, సందీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. త ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి మూడే వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి నెగ్గింది. క్రాంతి కిరణ్ (50) అర్ధ సెంచరీతో అజేయంగా నిలివగా... సందీప్ 31 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రాంతి కిరణ్‌కు దక్కింది. టీకేఆర్ ఆటగాళ్లు రోహిత్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును, వంశీ వర్ధన్‌రెడ్డి బెస్ట్ ఆల్‌రౌండర్ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ ఫీల్డర్‌గా ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ క్రీడాకారుడు అరవింద్, బె స్ట్ బౌలర్‌గా అధిల్ ఎంపికయ్యారు. ముగింపు కార్యక్రమానికి ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫైనల్లో టీకేఆర్, ముఫకంజా కాలేజీ
జింఖానా, న్యూస్‌లైన్: ఎస్ఆర్ చాంపియన్స్ ట్రోఫీ ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజీ క్రికెట్ టోర్నీలో తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్), ముఫకంజా కాలేజీ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో టీకేఆర్ 9 వికెట్ల తేడాతో విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టుపై; ముఫకంజా 17 పరుగుల ఆధిక్యంతో ఎస్ఆర్ కాలేజి (వరంగల్)పై గెలిచాయి. మొదట విద్యాజ్యోతి 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. సందీప్ 26, శివదీప్ 23 పరుగులు చేశారు. టీకేఆర్ బౌలర్లు సాకేత్ 3, లోహిత్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం టీకేఆర్ వికెట్ కోల్పోయి 111 పరుగులు చేసి నెగ్గింది. వంశీ (54), రోహిత్ (51) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వంశీ అందుకున్నాడు. ఎస్ఆర్ కాలేజితో జరిగిన మ్యాచ్‌లో తొలుత ముఫకంజా జట్టు 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఆలౌటైంది. రోహిత్ రెడ్డి (48) మెరుగ్గా ఆడాడు. ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ బౌలర్లు సుశ్మిత్ 3, సైజుల 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత బరిలోకి దిగిన ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభినయ్ (31), అర వింద్ (26) సందీప్ (21) ఫర్వాలేదనిపించారు. -
సెమీస్‌లో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి
జింఖానా, న్యూస్‌లైన్: ఎస్ఆర్ చాంపియన్స్ ట్రోఫీలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి 4 వికెట్ల తేడాతో ఎస్‌వీఎస్‌ఐటీ (వరంగల్) జట్టుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌వీఎస్‌ఐటీ 14.5 ఓవర్లలో 76 పరుగులు చేసింది. రాజ్‌కుమార్ (49) మెరుగ్గా ఆడాడు. ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి బౌలర్లు అరవింద్, సైదులు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజి 16.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి నెగ్గింది. కిరణ్ 29 పరుగులు చేశాడు. ఎస్‌వీఎస్‌ఐటీ బౌలర్ సాంకీత్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. రాజ్ కుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో మ్యాచ్‌లో వీజేఐటీ ఇంజనీరింగ్ కాలేజి జట్టు 20 పరుగుల తేడాతో ఎంఎల్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజి జట్టుపై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వీజేఐటీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. శివదీప్ (82) అర్ధ సెంచరీతో రాణించాడు. ఎంఎల్ఆర్ఐటీ బౌలర్లు అఖిల్, ప్రసాద్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. తర్వాత బరిలోకి దిగిన ఎంఎల్ఆర్ఐటీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. వినోద్ (30) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. వీజేఐటీ బౌలర్లు లక్ష్మణ్, వికాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వీజేఐటీ బ్యాట్స్‌మన్ శివదీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.