జింఖానా, న్యూస్‌లైన్: ఎస్‌ఆర్ చాంపియన్స్ ట్రోఫీ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజీ క్రికెట్ టోర్నీలో తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్) కాలేజీ విజేతగా నిలిచింది. వరంగల్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీకేఆర్ 7 వికెట్ల తేడాతో ముఫకంజా కాలేజీపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముఫకంజా కాలేజీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జుబేద్ (56) అర్ధ సెంచరీతో రాణించాడు. టీకేఆర్ బౌలర్ సాకేత్ 6 వికెట్లు పడగొట్టగా, చైతన్య రెండు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన టీకేఆర్ 13 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలిచింది. వంశీ (60) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రోహిత్ రెడ్డి (46) మెరుగ్గా అడాడు.
సాకేత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. రెండు, మూడు స్థానాల కోసం జరిగిన పోరులో ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు 7 వికెట్ల తేడాతో విద్యాజ్యోతి కాలేజీపై విజయం సాధించింది. తొలుత బరిలోకి దిగిన విద్యాజ్యోతి కాలేజి 15 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. శివ దీప్ (33), కిరణ్ (26) ఫర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజి బౌలర్లు రోహిత్, సందీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. త ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజి మూడే వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి నెగ్గింది. క్రాంతి కిరణ్ (50) అర్ధ సెంచరీతో అజేయంగా నిలివగా... సందీప్ 31 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రాంతి కిరణ్‌కు దక్కింది.
టీకేఆర్ ఆటగాళ్లు రోహిత్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును, వంశీ వర్ధన్‌రెడ్డి బెస్ట్ ఆల్‌రౌండర్ అవార్డును సొంతం చేసుకున్నారు. బెస్ట్ ఫీల్డర్‌గా ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ క్రీడాకారుడు అరవింద్, బె స్ట్ బౌలర్‌గా అధిల్ ఎంపికయ్యారు. ముగింపు కార్యక్రమానికి ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చాంప్ తీగల కృష్ణారెడ్డి కాలేజి
Published Mon, Jan 13 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
Advertisement
Advertisement