టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మీర్ పేటలోని టీకేఆర్ కాలేజీ ఆవరణలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు. గులాబీ కండువాలు టీడీపీ నాయకుల మెడలో వేసి కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తలసాని, తీగల మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.