gangadhar goud
-
‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్‌లో ఘటన..!
సాక్షి, కరీంనగర్: ఉపాధివేటలో గల్ఫ్ బాట పట్టిన యువకుడి శవపేటికలో తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ అంటూ మృతుని భార్య రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని అనంతపల్లికి చెందిన బుర్ర గంగాధర్‌గౌడ్(44) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. బుధవారం పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందగా.. సోమవారం శవపేటిక స్వగ్రామానికి చేరింది. శవపేటికపై పడి భార్య లక్ష్మి, తల్లి గంగవ్వ రోదనలు మిన్నంటాయి. మృతునికి తండ్రి సత్తయ్య, తల్లి గంగవ్వ, భార్య లక్ష్మి, కుమారుడు మనివర్ధన్, కూతురు మణిదీప్తి ఉన్నారు. -
నిజామాబాద్ ఎంపీగా గెలుస్తా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను నిజామాబాద్ ఎంపీ గానే పోటీ చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎంపీగా గెలుస్తా నని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌తో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ధర్మపురి అర్వింద్ ఓ దౌర్భాగ్యుడు అని, ఆయన ఎంపీగా గెలవడంతో నిజామాబాద్ అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందని ధ్వజమెత్తారు. అర్వింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి అర్వింద్ దారుణంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం సున్నా అని విమర్శించారు. నిజామాబాద్ ఐటీ హబ్ తో జిల్లా దశ దిశ మారబోతోందని, ఉద్యోగాల కల్పనపై అర్వింద్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనన్నారు. సీఎంకు సవాల్ విసిరే స్థాయి ఆయనకు లేదన్నారు. స్విచ్‌లో వేలు పెట్టి చూస్తే కరెంటు వస్తుందో లేదో తెలుస్తుంది తెలంగాణలో కరెంటు 24 గంటలు వస్తుందో లేదో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ బీజేపీ కార్యాలయంలోని స్విచ్‌లో వేలుపెట్టి చూడాలని కవిత సలహా ఇచ్చారు. పార్లమెంటులో ఏం మాట్లాడుతారో సంజయ్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాళేశ్వరం సహా ఏ ప్రాజెక్టుకూ కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని, మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఉండడంతో అక్కడున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాక, రూ.22వేల కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రెండురోజుల కిందట కేంద్ర మంత్రి నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడారని, దానికి కొనసాగింపుగా బండి సంజయ్ అదే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించిన బండి సంజయ్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరంపై బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం చేయగా, బీఆర్ఎస్ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని కవిత పేర్కొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సి గంగాధర్‌గౌడ్‌కు కరోనా
సాక్షి, డిచ్పల్లి: తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నామని వివరించారు. తనతో పాటు సతీమణి, కుమారుడికి పాజిటివ్ అని శనివారం అర్ధరాత్రి తెలిసిందని, కోడలు, గన్‌మన్, డ్రైవర్‌కు నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. 37 మందికి పాజిటివ్ నిజామాబాద్ అర్బన్: జిల్లాలో కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. ఆదివారం 37 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,843కు చేరింది. తాజా కేసుల్లోనే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. ముబారక్‌నగర్, సీతారాం నగర్ కాలనీ, వీక్లీ మార్కెట్, పద్మానగర్, సాయినగర్, గౌతంనగర్, ఎన్ఆర్ఐ కాలనీలలో కేసులు నమోదయ్యాయి. వేల్పూరు, మంథని, ఆలూరు, దుద్గాం, వెల్మల్ తదితర ప్రాంతాల్లోనూ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనాతో ఒకరి మృతి వర్ని(బాన్సువాడ): వర్ని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి (50) కరోనాతో మృతి చెందాడు. సదరు వ్యక్తికి ఇటీవల పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడని, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మాచారెడ్డి: మండలంలోని ఫరీద్‌పేట గ్రామానికి చెందిన మహిళ (63) కరోనా ఆదివారం సాయంత్రం మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. మూడు రోజుల క్రితం పాజిటివ్ రావడంతో నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. -
అవినీతి రహిత తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎమ్మెల్సీ, శాసనసభ బీసీ కమిటీ చైర్మన్ వి.గంగాధర్‌గౌడ్ అన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర రెండో మహాసభలు మహబూబాబాద్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. సభకు మాటూరి బాలరాజు గౌడ్ అధ్యక్షత వహించగా తెలంగాణ సాయుధ పోరాటయోధుడు వర్దెల్లి బుచ్చిరాములు సంఘం జెండాను ఆవిష్కరిం చారు. గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గీత కార్మికుల సమస్యలపై శాసనమం డలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సీఎం కేసీఆర్ హరితహారంలో భాగంగా చెరువు గట్లపై ఈత, ఖర్జూర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని, త్వరలో ఆ మొక్కలకు డ్రిప్ ద్వారా నీరు అందించేందుకు చర్యలు తీసుకోనుందని తెలిపారు. -
'తలసాని, తీగల రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి'
ఢిల్లీ:టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలపై తెలంగాణ రాష్ట్ర టీడీపీ మండిపడింది. వారు పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే వారి సత్తా ఏమిటో తెలుస్తుందని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చండ్ర వెంకట వీరయ్యలు విమర్శించారు. సొంత లాభం ఆశించే ఆ ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారన్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారు రాజీనామా చేసి మళ్లీ పోటీకి దిగితే వారి సత్తా నిరూపితం అవుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి(మహేశ్వరం), తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్)లు పార్టీ ఫిరాయింపుతో తెలంగాణ టీడీపీలో కలకలం మొదలైంది. -
టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని
-
టీఆర్ఎస్ లో చేరిన తీగల, తలసాని
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మీర్ పేటలోని టీకేఆర్ కాలేజీ ఆవరణలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు. గులాబీ కండువాలు టీడీపీ నాయకుల మెడలో వేసి కేసీఆర్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలసాని, తీగల మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేడు టీఆర్ఎస్లోకి తెలుగు తమ్ముళ్లు
కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్న తీగల, తలసాని, ఎమ్మెల్సీ గంగాధర్ సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి(మహేశ్వరం), తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్)తోపాటు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నారు. టీకేఆర్ కళాశాల ఆవరణలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్‌లో ఏర్పాటు చేసే సభ ద్వారా పార్టీ మారనున్నారు. ఈ మేరకు నలుగురు నేతలు మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి చర్చలు జరిపారు. నిజాం కాలేజ్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి పార్టీలో చేరుతానని తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పినప్పటికీ, సీఎం సూచన మేరకు బుధవారమే గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించారు. కాగా, గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న తలసాని, తీగల సహచర టీడీపీ నాయకులు కూడా కేసీఆర్ సమక్షంలో పార్టీ మారుతున్నట్టు సమాచారం. -
‘దేశం’ ఢీలా
* వలసబాటలో తెలుగు తమ్ముళ్లు * దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ * బస్సుయాత్రకు నో చెప్పిన నేతలు * సార్వత్రిక ఎన్నికల తర్వాత కార్యక్రమాలు జీరో * వీజీ గౌడ్ బాటలో మరికొందరు నేతలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ ఇందూరులో పూర్తిగా చతికిల పడింది. జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీరామారావుకు బ్రహ్మరథం పట్టిన ఇందూరు ప్రజలు.. ఇప్పుడా పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు. టీడీపీలో ఎదిగిన ఎందరో నేతలు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చే రుతుండటంతో కేడర్ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. 1983 తొలి ఎన్నికలలో 9 స్థానాలకు ఏడుచోట్ల, 1985లో మొత్తం 9 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సార్వత్రిక ఎన్నికలతో పూర్తిగా ఢీలా పడిపోయిన టీడీపీకి ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు వి. గంగాధర్ గౌడ్ రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచుకొని చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. అదే బాటలో మరో సీనియర్ ప్రజాప్రతినిధి, నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశం అవుతోంది. వలస బాటలో తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న వ్యవసాయ ప్రతికూల పరిస్థితులను విపక్షాలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్, టీడీపీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలి విపక్ష నేత డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ తదితరులు జిల్లాలో పర్యటించారు. ‘భరోసా యాత్ర’ పేరిట పంట చేలను సందర్శించి రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ టీడీపీ బస్సుయాత్రను నిర్వహించింది. నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు తోడు నిజామాబాద్ జిల్లాలో సైతం ఈ యాత్రను చేపట్టాలని మొదట నిర్ణయించారు. అప్పటకే జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ టీడీపీని వీడేందుకు సిద్ధం కాగా, మిగతా నాయకులు బస్సుయాత్రకు ‘నో’ చెప్పినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో నేతల వ్యవహారంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2009 ఎన్నికలలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి గెలిస్తే, 2014 ఎన్నికల నాటికి ఆ పార్టీకి ఇద్దరే మిగి లారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మం త్ సింధే టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మండవ వెంకటేశ్వర్రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ పార్టీని వదలడం, మరికొందరు అదేబాట పడుతుండటంతో పార్టీలో చివరికి మిగిలేది ఎవరన్న చర్చ కేడర్‌లో సాగుతోంది. వీజీ గౌడ్ వెనుకనే.. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న టీడీపీ ఆ తర్వాత జిల్లాలో మరిం తగా బలహీనపడింది. బీజేపీతో కూటమి కట్టిన టీడీపీ జి ల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసింది. ఆర్మూరులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి గెలుపొందగా టీడీపీ అభ్యర్థి రాజారాం యాదవ్‌కు మూడో స్థానం దక్కింది. బాల్కొండలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. మూడో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి ఎ.మల్లికార్జు న్ రెడ్డికి 25,216 ఓట్లు మాత్రమే వచ్చాయి. బోధన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి 26,396 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. బాన్సువాడలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 65,868 ఓట్లు వస్తే.. టీడీపీకి చెందిన బద్యానాయక్ 19,692 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. జుక్కల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌సింధే విజయం సాధించగా.. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఉండగా.. టీడీపీ ఆఖరిస్థానంలో నిలి చింది. పొత్తులో భాగంగా నాలుగు చోట్ల పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు కూడ మూడు, నాలుగు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను జీర్ణిం చుకోలేని టీడీపీ శ్రేణులు వరుసగా వలసబాట పడుతున్నారు. -
లచ్చన్న ఆశయాలు కొనసాగించాలి
ఒంగోలు టౌన్ : క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీకి మారుపేరుగా నిలిచే సర్ధార్ గౌతు లచ్చన్న ఆశయాలను కొనసాగించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్ ఉద్బోధించారు. గౌతు లచ్చన్న 105వ జయంతి వేడుకలను గౌడ కార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీనివాస కాలనీలో నిర్వహించారు. లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని గౌతు లచ్చన్న ముఖ్యనేతల మన్ననలను పొందారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం రైతు కూలీలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధి, కల్లుగీత కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారని కొనియాడారు. సర్ధార్ అనే బిరుదు ఉత్తర భారతదేశంలో వల్లభాయి పటేల్, దక్షిణ భారతదేశంలో గౌతు లచ్చన్నకు మాత్రమే ఉందన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. టీడీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ మాట్లాడుతూ లచ్చన్న తాను ఎన్నికైన శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి మధ్యలోనే రాజీనామా చేసి ఆ స్థానంలో తన గురువు ఎన్జీ రంగాను గెలిపించి గురుదక్షిణ తీర్చుకున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కానుగుల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు ఎస్కే మౌలాలి, ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ శ్రీను, పద్మశాలి చేనేత ప్రజాసమితి జిల్లా అధ్యక్షుడు మొగిలి ఆనందరావు, జంగమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఒంటెత్తు పోకడలతోనే ఒంటరైన విజయశాంతి
మెదక్ టౌన్, న్యూస్‌లైన్: ఒంటెత్తు పోకడలతోనే ఎంపీ విజయశాంతి ఒంటరై పోయారని, ఆమెను కొత్తగా ఒంటరి చేయాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదని ఆ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగాధర్, యువత రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చల్లా నరేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ ఓనమాలు తెలియని విజయశాంతి కోసం ఉద్యమ నేత కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానాన్ని త్యాగం చేశారన్నారు. రాఖీ కట్టిన చెల్లెకు టీఆర్ఎస్లో ఇచ్చిన ప్రాధాన్యతను కేసీఆర్ ఎవరికీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీతో దోస్తీ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. టీఆర్ఎస్పై చేసిన విమర్శలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమించిన కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను విమర్శిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారో, ఆమెపై ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆమెను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, కృషి ఫలితంగా రైల్వేలైన్ సాకారమైందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నేతలు శ్రీధర్‌యాదవ్, మున్నా, హమీద్, రాంచందర్, జీవన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.