‘దేశం’ ఢీలా | After the General election Activities Zero | Sakshi
Sakshi News home page

‘దేశం’ ఢీలా

Published Tue, Oct 14 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

‘దేశం’ ఢీలా

‘దేశం’ ఢీలా

* వలసబాటలో తెలుగు తమ్ముళ్లు
* దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ
* బస్సుయాత్రకు నో చెప్పిన నేతలు
* సార్వత్రిక ఎన్నికల తర్వాత కార్యక్రమాలు జీరో
* వీజీ గౌడ్ బాటలో మరికొందరు నేతలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ ఇందూరులో పూర్తిగా చతికిల పడింది. జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్‌టీరామారావుకు బ్రహ్మరథం పట్టిన ఇందూరు ప్రజలు.. ఇప్పుడా పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు. టీడీపీలో ఎదిగిన ఎందరో నేతలు ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చే రుతుండటంతో కేడర్ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది.

1983 తొలి ఎన్నికలలో 9 స్థానాలకు ఏడుచోట్ల, 1985లో మొత్తం 9 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సార్వత్రిక ఎన్నికలతో పూర్తిగా ఢీలా పడిపోయిన టీడీపీకి ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు వి. గంగాధర్ గౌడ్ రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచుకొని చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. అదే బాటలో మరో సీనియర్ ప్రజాప్రతినిధి, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధం కావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.
 
వలస బాటలో తెలుగు తమ్ముళ్లు

ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న వ్యవసాయ ప్రతికూల పరిస్థితులను విపక్షాలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్, టీడీపీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్  ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలి విపక్ష నేత డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ తదితరులు జిల్లాలో పర్యటించారు. ‘భరోసా యాత్ర’ పేరిట పంట చేలను సందర్శించి రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ టీడీపీ బస్సుయాత్రను నిర్వహించింది.

నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు తోడు నిజామాబాద్ జిల్లాలో సైతం ఈ యాత్రను చేపట్టాలని మొదట నిర్ణయించారు. అప్పటకే  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్  టీడీపీని వీడేందుకు సిద్ధం కాగా, మిగతా నాయకులు బస్సుయాత్రకు ‘నో’ చెప్పినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో నేతల వ్యవహారంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2009 ఎన్నికలలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి గెలిస్తే, 2014 ఎన్నికల నాటికి ఆ పార్టీకి ఇద్దరే మిగి లారు.

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మం త్ సింధే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మండవ వెంకటేశ్వర్‌రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ పార్టీని వదలడం, మరికొందరు అదేబాట పడుతుండటంతో పార్టీలో చివరికి మిగిలేది ఎవరన్న చర్చ కేడర్‌లో సాగుతోంది.
 
వీజీ గౌడ్ వెనుకనే..
స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న టీడీపీ ఆ తర్వాత జిల్లాలో మరిం తగా బలహీనపడింది. బీజేపీతో కూటమి కట్టిన టీడీపీ జి ల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసింది. ఆర్మూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి గెలుపొందగా టీడీపీ అభ్యర్థి రాజారాం యాదవ్‌కు మూడో స్థానం దక్కింది. బాల్కొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.

మూడో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి ఎ.మల్లికార్జు న్ రెడ్డికి 25,216 ఓట్లు మాత్రమే వచ్చాయి. బోధన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి 26,396 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. బాన్సువాడలో విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 65,868 ఓట్లు వస్తే.. టీడీపీకి చెందిన బద్యానాయక్ 19,692 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

జుక్కల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంత్‌సింధే విజయం సాధించగా.. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఉండగా.. టీడీపీ ఆఖరిస్థానంలో నిలి చింది. పొత్తులో భాగంగా నాలుగు చోట్ల పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు కూడ మూడు, నాలుగు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను జీర్ణిం చుకోలేని టీడీపీ శ్రేణులు వరుసగా వలసబాట పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement