
మహబూబాబాద్ రూరల్: రాష్ట్రాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎమ్మెల్సీ, శాసనసభ బీసీ కమిటీ చైర్మన్ వి.గంగాధర్‌గౌడ్ అన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర రెండో మహాసభలు మహబూబాబాద్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. సభకు మాటూరి బాలరాజు గౌడ్ అధ్యక్షత వహించగా తెలంగాణ సాయుధ పోరాటయోధుడు వర్దెల్లి బుచ్చిరాములు సంఘం జెండాను ఆవిష్కరిం చారు. గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గీత కార్మికుల సమస్యలపై శాసనమం డలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సీఎం కేసీఆర్ హరితహారంలో భాగంగా చెరువు గట్లపై ఈత, ఖర్జూర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని, త్వరలో ఆ మొక్కలకు డ్రిప్ ద్వారా నీరు అందించేందుకు చర్యలు తీసుకోనుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment